పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

10, నవంబర్ 2018, శనివారం

Pochampally Ikkath Sarees / పోచంపల్లి చీరలు @ భూదాన్ పోచంపల్లిపోచంపల్లి చీరలు తెలంగాణ రాష్ట్రములోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన భూదాన్ పోచంపల్లి లో తయారవుతున్న ప్రసిద్ధ చీరలు.తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కి సుమారు  42 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోచంపల్లి చేనేత వస్త్రాలు, భూదానోద్యమానికి ప్రసిద్ధి చెందింది.విజయవాడ హై వే NH65 మీద గుంటూరు నుండి హైదరాబాద్ వెళ్లే దారిలో కుడివైపు పెద్ద ఆర్చ్ కనపడుతుంది.ఆ ఆర్చ్ నుండి లోపలికి వెళ్ళగానే 12 kms చాలా చక్కని రోడ్,చుట్టూ పచ్చని చెట్లతో ప్రయాణం మనకి తెలియకుండానే పోచంపల్లి వచ్చేస్తాము.ఊరిలోకి వెళ్తుండగానే రోడ్డుకి రెండువైపులా చీరాల షాపులు కనపడుతుంటాయి.

అక్కడి చేనేత కార్మికులు నేసిన చీరలు అందరినీ మురిపిస్తాయి. ఇక ఆడవారినైతే అమితంగా ఆకర్షిస్తాయి. చేనేతల్లో మొదటగా పేటెంట్ హక్కు పొందడం ఓ ప్రత్యేకత. దేశ విదేశీ వనితల వరకూ అందరినీ ఆకట్టుకునే చేనేత ఉత్పత్తులు, చీరలతో ఖండాంతర ఖ్యాతిని పోచంపల్లి పొందింది. ఈ పనితనం "చీరాల" నుండి ఈ ప్రాంతానికి వచ్చింది.

చూడగానే ఇవి పోచంపల్లి  చేనేత చీరలు,వస్త్రాలు అని చెప్పగలిగేంత విభిన్నమైన డిజైన్స్ తో చాలా అందంగా హుందాగా అనిపిస్తాయి. పోచంపల్లి చీరలు కానీ డ్రెస్సులు కానీ ఏ సందర్భానికైనా తగినట్లు గా సెట్ అవ్వటం కూడా వీటి ప్రత్యేకత అనిపిస్తుంది.

పోచంపల్లి విశేషాలు ఈ వీడియోలో చూడొచ్చు..

Pochampally Ikkath Sarees 
పోచంపల్లి చీరలు @ భూదాన్ పోచంపల్లి
4 వ్యాఖ్యలు:

Chandrika చెప్పారు...

బావుందండీ . బాగా చెప్పారు. ఆశ్చర్యం వేస్తుంది ఇలా చేనేత వ్రస్తాలు చూస్తుంటే. ఇంటి పక్కనే ఇటువంటి నిధులు ఉంటే అర్ధం కాదు కదా. అమెరికా లాంటి దేశాలు వచ్చాకే వాటి విలువ తెలుస్తుంది.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"SaraChandrika Chandrika".. గారు Thank you so much అండీ..
మీరు చెప్పింది నిజమండీ,ఇవన్నీ నిధులే.మన పక్కనే వున్నవాటి గొప్పతనం ఎవరో కనిపెట్టేదాకా మనకి తెలియదు కదా పెరటిచెట్టు సామెత లాగా :)
నాకు కూడా పోచంపల్లి చేనేత చాలా నచ్చాయి.

వీడియోలో నేను చెప్పింది నచ్చినందుకు,ఆ విషయం చెప్పినందుకు చాలా థాంక్సండీ
వీడియోలో ఎలా చెప్తున్నానా అని ఇప్పటిదాకా ఒక అనుమానం ఉంది .. ఇప్పుడు ఆ సందేహం తీరిపోయింది :)

Thank you so much For Your Comment ..

నీహారిక చెప్పారు...

మీ వాయిస్ బాగుంది.బ్లాక్ టెంపుల్ డిజైన్ చీర చాలా బాగుంది. చీరలు ఇంకా చూపించవలసింది.రెండుసార్లు వెళ్ళాను కానీ మార్కండేయ ఆలయం కనిపించలేదు. మెయిన్ రోడ్లోనే ఉందా ?

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"నీహారిక" గారు.. వీడియోలో నా వాయిస్ నచ్చినందుకు,ఆ విషయం నాకు చెప్పినందుకు
Thank You so Much అండీ. :)..
చీరలు ఇంకా పిక్స్ ఉన్నాయండీ..కానీ వీడియో ఎక్కువైతే చూసేవాళ్ళకి విసుగ్గా ఉంటుందేమోనని పెట్టలేదు.
మార్కండేశ్వర స్వామి ఆలయం మెయిన్ రోడ్లోనే ఉంది.. మేము కూడా ఇంతకుముందు వెళ్ళినప్పుడు అంతగా గమనించలేదు,వెళ్ళలేదు.ఈసారి మేము నవరాత్రులు మొదటిరోజు వెళ్ళేసరికి మైక్ లో పూజ,మంత్రాలు వినపడి వెళ్ళాము.

మీకు నచ్చిన "బ్లాక్ టెంపుల్ డిజైన్" చీరే నేను తెచ్చుకున్నానండి .. నాకు కూడా చాలా నచ్చింది :)

Thank You So Much ..


Related Posts Plugin for WordPress, Blogger...