పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

9, ఆగస్టు 2011, మంగళవారం

గోరంతదీపం కొండంత వెలుగు ... నా మరో ప్రయోగం..


నా బ్లాగ్ లో inspiration songs లో పెట్టటానికి గోరంతదీపం సినిమాలో "గోరంత దీపం కొండంత వెలుగు"
అనే పాట కోసం నెట్ లో వెతికాను కానీ కనిపించలేదు..
అందుకే ఎలాగు నాకు ఇష్టమైన పాటలు వీడియో మిక్సింగ్ చేయటం అలవాటే కాబట్టి నిన్నంతా ఆ పనిలో వుండి
మొత్తానికి సక్సెస్స్ అయ్యాను.
నాకిష్టమైన పాటను నాకిష్టమైన పిక్చర్స్ తో వీడియో మిక్సింగ్ చేసిన పాట

గోరంత దీపం కొండంత వెలుగు
చిగురంత ఆశ జగమంతా వెలుగు
By:Raajiగోరంత దీపం కొండంత వెలుగు
చిగురంత ఆశ జగమంత వెలుగు

గోరంత దీపం కొండంత వెలుగు

చిగురంత ఆశ జగమంత వెలుగు

కరి మబ్బులు కమ్మే వేళ మెరుపు తీగే వెలుగు
కారు చీకటి ముసిరే వేళ వేగు చుక్కే వెలుగు

కరి మబ్బులు కమ్మే వేళ మెరుపు తీగే వెలుగు
కారు చీకటి ముసిరే వేళ వేగు చుక్కే వెలుగు

మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు
మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు
దహియించే బాధల మధ్యన సహనమే వెలుగు


గోరంత దీపం కొండంత వెలుగు
చిగురంత ఆశ జగమంత వెలుగు

కడలి నడుమ పడవ మునిగితే కడ దాకా ఈదాలి

కడలి నడుమ పడవ మునిగితే కడ దాకా ఈదాలి

నీళ్ళు లేని ఎడారిలో ...
నీళ్ళు లేని ఎడారిలో కన్నీళ్ళైన తాగి బతకాలి
నీళ్ళు లేని ఎడారిలో కన్నీళ్ళైన తాగి బతకాలి
ఏ తోడు లేని నాడు నీ నీడే నీకు తోడు
ఏ తోడు లేని నాడు నీ నీడే నీకు తోడు

జగమంతా దగా చేసినా చిగురంత ఆశను చూడు

చిగురంత ఆశ జగమంత వెలుగు
గోరంత దీపం కొండంత వెలుగు

చిగురంత ఆశ జగమంత వెలుగు


సినిమా:గోరంతదీపం
లిరిక్స్:c.నారాయణ రెడ్డి


6 వ్యాఖ్యలు:

జయ చెప్పారు...

చాలా బాగుంది రాజి. నాక్కూడా నేర్చుకోవాలనిపిస్తోంది.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

థాంక్యూ జయ గారు
మీరు కూడా త్వరగా నేర్చుకోండి మరి.
ఇది మీకేమంత కష్టం కాదులెండి..

మాలా కుమార్ చెప్పారు...

వావ్ సూపర్ అంటే సూపర్ అండి . అసలు ఆ లైన్ల కు తగ్గ ఇమేజెస్ ఎంత బాగా కలెక్ట్ చేసారు . చాలా చాలా బాగుంది .

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

ధన్యవాదములు మాలాకుమార్ గారు...
మీకు అంతగా నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా వుంది..
ఆ ఇమేజెస్ కలెక్ట్ చేయటం వాటిని పాటలో సెట్ చేయటం చాలా టైం పట్టింది.
ఎంత కష్టపడినా మీరందరూ మెచ్చుకున్నారు కదా అదే నాకు great gift..

Haritha 916 gold చెప్పారు...

అద్బుతం........ చాలా బాగుంది ఇప్పుడు ఈటీవీలో మూవీ చూస్తు లిరిక్స్ కోసం వెతికాను ఇక్కడ దర్శనమిచ్చింది. ధన్యవాదాలు... రఘు

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

పాట చూసి, మీ స్పందన తెలిపినందుకు ధన్యవాదాలు Raghu Kanchi గారు..

Related Posts Plugin for WordPress, Blogger...