పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

28, నవంబర్ 2011, సోమవారం

Art By : రమ్యాభద్ర...


మా చెల్లి రమ్య చిన్నప్పటి నుండి చాలా టాలెంటెడ్ .
మంచి బొమ్మలు గీస్తుంది,పైటింగ్స్ వేస్తుంది..స్కూల్ డేస్ లో కూడా
ఎక్కడ పైంటింగ్,డ్రాయింగ్ పోటీలు జరిగినా తనే విన్ అయ్యేది.
ఇంట్లో వాళ్ళందరం తన టాలెంట్స్ ని ఎంకరేజ్ చేసే వాళ్లము..
నేను,తమ్ముడు ఎక్కడికి వెళ్ళినా తన పైటింగ్స్ కి కావలసినవన్నీ తెచ్చివ్వాల్సిందే..
పెళ్ళైన తర్వాత కూడా తన హాబీస్ ని ఎంకరేజ్ చేసే భర్త రావాలని మేమందరం అనుకునే వాళ్లము.
దానికి తగినట్లే తన హజ్బండ్ మా చెల్లి ఆర్ట్ ని ,టాలెంట్స్ ని మాకంటే ఎక్కువగా ఇష్టపడతారు..
మేము ఎలాగైతే తనకి అవసరమైనవన్నీ తెచ్చి ప్రోత్సహిస్తామో మా మరిదిగారు భద్ర కూడా అలాగే చేస్తారు..
తన అభిరుచుల్ని గుర్తించి,గౌరవించి,ప్రోత్సహించే భర్త దొరకటాన్ని
మించిన అదృష్టం ఏ అమ్మాయికైనా ఏముంటుంది..

మా చెల్లికి బాపు బొమ్మలు ఇష్టమని "బాపు బొమ్మల హరివిల్లు" బుక్ గిఫ్ట్ గా ఇచ్చారు ..
అందులో
వినాయకుడి బొమ్మ మా చెల్లి ఆయిల్ పైంట్స్ తో వేసింది..

మా రమ్య చార్ట్ మీద వేసిన బొమ్మను ఎంతో అపురూపంగా ఫ్రేం చేయించారు తన హజ్బండ్
ఫ్రేం
చేయించటమే కాదు ఇంటికి ఎవరు వచ్చినా ఇది మా రమ్య చేసింది అని ఎంతో గొప్పగా చెప్తారు..
వూల్ తో చార్ట్ మీద చేసే మాటీ వర్క్.మా అమ్మ మా చిన్నప్పుడు మాటీ వర్క్ చాలా బాగా చేసేది.
అమ్మ
దగ్గర నేను నేర్చుకున్నాను.ఇప్పుడు చెల్లి సొంతగా బుక్ చూసి నేర్చుకుని తయారు చేసింది.

దాన్ని కూడా ఫ్రేం చేయించి హాల్ లో డెకరేట్ చేశారు
తనని ఇంతగా ఎంకరేజ్ చేస్తున్న తన బెటర్ హాఫ్ కి మా చెల్లి ఇచ్చిన గిఫ్ట్ టీషర్ట్.
వైట్ టీ షర్ట్ మీద బాపు బొమ్మలు వేసి ఎంతో అందంగా తీర్చిదిద్దింది.
షర్ట్ చూసి అందరు మెచ్చుకుంటే తననే మెచ్చుకున్నంత ఆనంద పడతారు మా మరిదిగారు.


4 వ్యాఖ్యలు:

సుభ/subha చెప్పారు...

రాజీ గారూ పరిచయం చేసేసారా మీ చెల్లాయ్ ఆర్ట్ ని. చాలా చాలా బాగున్నాయండి. మీ రమ్య నాకంటే చాలా సీనియర్ ఆర్ట్ లో.కానీ మీ చెల్లాయిని ప్రోత్సహిస్తున్నట్టే నన్ను కూడా ప్రొత్సహిస్తున్నందుకు చాలా చాలా థాంకులు మీకు.All the best Ramya gaaruu.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

అవును సుభా గారు
మీ ఆర్ట్ చూడగానే నాకు కూడా మా చెల్లి ఆర్ట్ పరిచయం చేయాలనిపించింది.
పైగా మీరు చెప్పారు కదా నా బ్లాగ్ లో చోటిమ్మని అందుకే వెంటనే ఇవాళ పరిచయం చెసేశాను..
ఇంక మీ ఆర్ట్ కూడా మా చెల్లి ఆర్ట్ లాగే చాలా బాగుంటుంది సందర్భానికి తగిన చిత్రాన్ని చక్కగా వేసేస్తారు..
మా చెల్లికి ఆర్ట్ బ్లాగ్ వుందండీ మీకు లింక్ ఇస్తాను చూడండి..
మా రమ్య తరపున,నా తరపున మీకు ధన్యవాదములు..

http://ramsarts.blogspot.com/

సుభ/subha చెప్పారు...

chuusaanu raajii gaaru. akkaDE comment kuuDaa peTTaanu.thx andii.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

థాంక్యూ సుభా గారు..
బ్లాగ్ చూసి,కామెంట్ కూడా ఇచ్చినందుకు చాలా థాంక్స్.
మా చెల్లి తరపున కూడా..

Related Posts Plugin for WordPress, Blogger...