యా కుందేందు తుషార హార ధవళా
యా శుభ్ర వస్త్రాన్వితా
యా వీణా వర దండ మణ్డిత కరా
యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిహి
దేవైస్సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ
నిశ్శేష జాడ్యాపహా
శ్వేత వస్త్రాలతో అలంకృతమై,హంసవాహినిగా,
తెల్లని తామర పుష్పంపై కొలువుతీరిన
వీణాపాణి జ్ఞానానంద
పరాశక్తి.
శ్రద్ధ , ధారణా, మేధా, విధి, వల్లభా, భక్తజిహ్వాగ్రసదన, శమాది గుణదాయిని
అనే సప్త నామధేయాలతో విరాజిల్లే విద్యా స్వరూపిణి.
బుద్ధి, స్మృతి,
వాక్కు,విద్య ఆ దివ్య జనని అనుగ్రహ ఫలాలు
అమ్మ చెంతనే వుండే అమ్మ వాహనం హంస - పాలను, నీటిని వేరు చేస్తుంది.
అలాగే మానవులు కూడా మంచి,చెడుల విచక్షణాజ్ఞానంతో మసలుకోవాలని సరస్వతిమాత
తన హంసవాహనం ద్వారా సందేశం ఇస్తుంది .
అజ్ఞాన తీరాలనుండి విజ్ఞానపు వెలుగు వైపుకి నడిపించి,జీవితంలో అవసరమైన జ్ఞాన సంపదను,
కరుణాకటాక్షాలను అనుగ్రహించమని ఆ వాగ్దేవిని శ్రీ పంచమి సందర్భంగా ప్రార్ధిస్తూ
అందరికీ శ్రీ పంచమి శుభాకాంక్షలు.
సరస్వతీ స్తుతి