నాకు ఇష్టమైన మరొక ఇన్స్పిరేషన్ సాంగ్ "కలకానిది విలువైనదీ"
"వెలుగు నీడలు" సినిమాలోని ఈ పాటకు "శ్రీ శ్రీ" గారు రచించిన అద్భుతమైన సాహిత్యం
ఈ పాటను చిరస్థాయిగా మనస్సులో నిలిచేలా చేసింది.
సినిమాలో సావిత్రి భర్త జగ్గయ్య అనుకోని ప్రమాదంలో చనిపోతాడు.అప్పుడు ఆ దిగులుతో బాధపడుతున్న
సావిత్రిని ఓదారుస్తూ జీవితంలో కష్టాలు వస్తే వాటి గురించే బాధపడుతూ.. ఎంతో విలువైన జీవితాన్ని వ్యర్ధం చేసుకోకూడదని చెప్తూ, నాగేశ్వరరావు పాడే ఈ పాట అప్పడు... ఇప్పుడు ఒక ఆణిముత్యం.
ఈ పాటలో నాకు నచ్చే మహాకవి శ్రీ శ్రీ గారి inspirational words ...
"అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే "
"ఏదీ తనంత తానై నీ దరికి రాదు
శోధించి సాధించాలి అదియే ధీరగుణం"
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే "
"ఏదీ తనంత తానై నీ దరికి రాదు
శోధించి సాధించాలి అదియే ధీరగుణం"
కల కానిది విలువైనదీ
బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు
కల కానిది విలువైనదీ
బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు
గాలి వీచి పూవుల తీగ నేల వాలిపోగా
గాలి వీచి పూవుల తీగ నేల వాలిపోగా
జాలి వీడి అటులే దాన్ని వదిలివైతువా
చేరదీసి నీరు పోసి చిగురించనీయవా
కల కానిది విలువైనదీ
బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు
అలముకున్న చీకటిలోనే అలమటించనేలా
అలముకున్న చీకటిలోనే అలమటించనేలా
కలతలకే లొంగిపోయి కలువరించనేలా
సాహసమను జ్యోతినీ చేకొని సాగిపో
కల కానిది విలువైనదీ
బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు
అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే
అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే
ఏదీ తనంత తానై నీ దరికి రాదు
శోధించి సాధించాలి అదియే ధీరగుణం
కల కానిది విలువైనదీ
బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు
బ్రతుకూ ... బలిచేయకు
కల కానిది విలువైనదీ
బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు
గాలి వీచి పూవుల తీగ నేల వాలిపోగా
గాలి వీచి పూవుల తీగ నేల వాలిపోగా
జాలి వీడి అటులే దాన్ని వదిలివైతువా
చేరదీసి నీరు పోసి చిగురించనీయవా
కల కానిది విలువైనదీ
బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు
అలముకున్న చీకటిలోనే అలమటించనేలా
అలముకున్న చీకటిలోనే అలమటించనేలా
కలతలకే లొంగిపోయి కలువరించనేలా
సాహసమను జ్యోతినీ చేకొని సాగిపో
కల కానిది విలువైనదీ
బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు
అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే
అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే
ఏదీ తనంత తానై నీ దరికి రాదు
శోధించి సాధించాలి అదియే ధీరగుణం
కల కానిది విలువైనదీ
బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు
బ్రతుకూ ... బలిచేయకు
4 కామెంట్లు:
రాజి గారు,
ఎంతో నచ్చి కొన్నాళ్ళు నా బ్లాగ్ లో ఒపెన్ అవగానే విన్పించేట్టు పెట్టాను. కొన్నాళ్ళ తరవాత బ్లాగ్ లేట్ గా ఓపెన్ అవుతున్నదని తీసివేశాను.
శ్రీ శ్రీ గారు అయన శైలి కి భిన్నంగా రాసిన కొన్ని అద్భుతమైన పాటల్లో ఇదీ ఒకటి. నిజానికి ఇలా రాసినవి కొన్ని పాటలైనా ప్రతిదీ ఓ ఆణిముత్యమే... Every line is an inspiring quote by itself.
మందాకిని గారూ బ్లాగ్ లో ఒపెన్ అవగానే విన్పించేట్టు పెట్టటం మంచి ఆలోచనండీ..
ఎప్పుడు విన్నా విసుగనిపించని పాటల్లో ఇది కూడా ఒకటి.
నాకు కూడా చాలా నచ్చే పాట ఇది.
మీ స్పందనకు ధన్యవాదములు..
"చిన్ని ఆశ" గారూ థాంక్సండీ..
"Every line is an inspiring quote by itself."
నిజమేనండీ ఈ పాట లో ప్రతి మాట inspirational quotes అనిపిస్తాయి..
కామెంట్‌ను పోస్ట్ చేయండి