మణులన్నింటిలోన మాణిక్యం ఎరుపు
సందె వన్నెల్లోన సాగే మబ్బెరుపు
తానెరుపు అమ్మాయి తనవారిలోన
పెళ్ళిలో పెళ్లి కూతురికి పండే ఎర్రని గోరింటాకు తో మొదలై పెళ్లి పట్టు చీర,గాజులు,
పాపిటలో ఎర్రని కుంకుమతో పెళ్లి కూతురు వివాహిత స్త్రీగా మారే దాకా ఎరుపుదే ప్రాధాన్యత.
- ఎరుపు రంగు వేగం, శక్తి, ధైర్యం, సాహసాలకు ప్రతీక,ఇది ఉత్తేజకరమైన రంగు.
- ఎరుపురంగు ఇష్టపడే వ్యక్తి సాహసోపేతమైన వ్యక్తిత్వం కలిగి వుంటారు.
- ఇతరులను అధిగమించాలని చూస్తుంటారు.
- అలాగే ప్రమాద సూచికగా కూడా ఎరుపునే సూచిస్తారు.
తొలి తొలి వలపే పచ్చదనమే
పచ్చిక నవ్వుల పచ్చదనమే
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమే ఆనందానికి ఇల్లు.
శుభ సందర్భాల్లో ఆకుపచ్చకు ప్రాధాన్యత ఉంది.శుభకార్యాలు,పండుగలు
పచ్చని మామిడాకు తోరణాలతోనే మొదలవుతాయి.
- ఆకుపచ్చ రంగు ఇష్టపడే వాళ్ళు తోటివారికి సాయపడేందుకు ప్రయత్నిస్తారు.
- ఎవరైనా బాధల్లో వున్నట్లు కనిపిస్తే, వారిని ఓదార్చేందుకు చూస్తారు.
- సాంప్రదాయబద్ధంగా వ్యవహరిస్తారు,కొన్ని సార్లు నిర్దయగా కూడా ఉంటారు.
- ఆకుపచ్చ రంగు హాస్పిటల్స్ లో ఉపయోగిస్తారు..ఈ రంగు కళ్ళకు మంచిది.
- ఇది నూతనోత్సాహాన్ని, శాంతిని ఇచ్చే రంగు
మా ఇంట్లో పూలకుండీల మధ్యలో కాసేపు కూర్చోవటం,మొక్కలకి నీళ్ళు పోస్తూ
వాటిని పలకరించం నాకు చాలా ఇష్టం..♥
U.S మిలటరీ లో ధైర్య సాహసాలకు గుర్తింపుగా "పర్పుల్ హార్ట్" అవార్డ్ ఇస్తారు.
ఈ రంగు సృజనాత్మక వ్యక్తిత్వానికి ప్రతీక.
- పర్పుల్ కలర్ ఇష్టపడేవారు తమ ఇండిపెండెన్స్‌ను ప్రదర్శించుకోవాలనుకుంటుంటారు.
- నమ్మిన వారికోసం ఏదైనా చేయగల ఔన్నత్యం ఈ రంగు ఇష్టపడే వారి సొంతం.
- లేనిపోని లౌక్యాలను ప్రదర్శించరు,వినయంగా అమాయకంగా ఉంటారు.
- ఈ రంగును వాడితే డిప్రెషన్, అభ్రదతా భావం, ఆగ్రహం వంటి ఉద్వేగాలను అణచిపెట్టుకోవడం జరుగుతాయి.
వుంటాయి.పర్పుల్ గులాబీలు నాకు చాలా ఇష్టమైన పూలు.♥
కేళిచలన్మణి కుండల మండిత గండ యుగ స్మిత శాలీ
హరిరిహ ముగ్ధ వధూ నికరే విలాసిని విలసతి కేళిపరే
అనంతమైన ఆకాశం,అంతులేని సముద్రం,అందరూ ఇష్టపడే కన్నయ్య రంగునీలం.
ప్రశాంతమైన రంగు.
ఈ రంగును ఎక్కువగా ఉపయోగించటం వలన స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ,
సుఖనిద్ర, సున్నితత్వం వంటి వాటిని సాధించవచ్చు.
- స్వచ్చత,శాంతం,అనర్గళంగా మాట్లాడటం,ఆత్మవిశ్వాసం,
- మనసులో ఒకటి పైకి ఒకటి లాగా ఉండని మనస్తత్వం ఈ రంగును ఇష్టపడే వాళ్ళ ప్రత్యేకతలు.
♥ నాకు ఇష్టమైన సముద్రం,ఆకాశం,కృష్ణయ్య అన్నీ నీలమే..ఆక్వా బ్లూ నాకు చాలా ఇష్టం.♥
జగాన వలపే నిండాలి లే
ఓహో గులాబి బాలా అందాల ప్రేమమాలా
పింక్ రిబ్బన్ బ్రెస్ట్ కాన్సర్ పై అవగాహనకు,దానికి వ్యతిరకంగా పోరాడే హోప్ ను
కలిగించే సింబల్ గా ఉపయోగిస్తున్నారు.
జైపూర్ లో పింక్ రంగులో ఉండే కట్టడాలతో పింక్ సిటీ ప్రసిద్ధి చెందింది.
- పింక్ కలర్ఇష్టపడేవారుఅందంగా,చిలిపిగాఉంటారట.
- పింక్ కలర్ సంతోషాన్ని,ఉత్సాహాన్నీ కలిగిస్తుంది.
కనటమే తెలుసు కమ్మని ప్రేమలో
చాలా సాధారణమైన స్వభావాన్ని కలిగి ఉంటారు.
నాకే కాదు అందరికీ చాలా ఇష్టమైన chocolates బ్రౌన్ కలరే ! మరీ ఎక్కువ
chocolates తినటం ఆరోగ్యానికి మంచిది కాకపోయినా అప్పుడప్పుడు తినటం అవసరం :)
♥ chocolates, ఇంకా కాఫీ కూడా నా ఫేవరేట్.♥
కొండబంతి గోరంత పచ్చ
పసుపు రంగు శుభకరమైన రంగుల్లో ఒకటి.గడపకి పసుపు రాయటం శుభకార్యాలకి,
పండగలకి ఆహ్వానం పలకటానికి .పసుపు రాసిన గడపలు లక్ష్మీ కళతో వుంటాయి.
శాస్త్రీయంగా కూడా పసుపు వాడకం మంచిది.పసుపురంగులో గొప్ప కళ ఉంది.
- పసుపు రంగు గులాబీలు స్నేహానికి గుర్తు..
- పసుపు రంగు ఇష్టపడే వారు హుషారుగా ఉత్సాహంగా ఉంటారు.
- ఆత్మస్థైర్యంతో ఉంటారు, తెలివిగా వ్యవహరిస్తారు. లాజికల్ గా మాట్లాడతారు.
♥ పసుపు రంగు చామంతులు,పసుపుగా పండిన మామిడిపళ్ళు ,పచ్చని బంగారం నాకు చాలా ఇష్టం.♥
తెల్లని తెలుపే ఎద తెలిపే
నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం
తెలుపు స్వచ్చతకు,నిర్మలత్వానికి ప్రతీక.ఎండాకాలంలో తెల్లటి కాటన్ డ్రెస్ లే ఎక్కువగా వాడతారు.
కళ్ళకు హాయిగా ప్రశాంతంగా అనిపించే రంగు.
- తెలుపు రంగు ఇష్టపడేవాళ్ళుసహజ సిద్ధమైన వైఖరిని,విషయాల పట్ల స్ఫష్టమైన అవగాహనను కలిగి ఉంటారు.
- సున్నితమైన మనస్కులు కూడా.
- అంతే కాదు తెలుపును ఇష్టపడే వాళ్ళు దేన్నీ అంత సులభంగా మెచ్చుకోరు .
♥ సమ్మర్ లో తెల్లటి మల్లెపూలు ,తెల్లటి కాటన్ డ్రెస్ లు నా ఫేవరేట్ ♥
వానాకాలం మొత్తం నలుపే
కాకి రెక్కల్లో కారునలుపే
కన్నె కాటుక కళ్లు నలుపే
విసిగి పాడే కోయిల నలుపే
నీలాంబరాల కుంతల నలుపే
నలుపు రంగు ఎక్కువగా ఆశుభానికి,శని కి ప్రతీకగా సూచిస్తారు.
కానీ వర్షాన్నిచ్చే నల్లటి మేఘాలు,మనిషికి విశ్రాంతి నిచ్చే రాత్రి అన్నీ నలుపే..
అలాగే ఆడపిల్ల కాటుక కళ్ళు,నల్లని పొడవైన కురులు ఇష్టపడని వాళ్ళుండరు.
- నలుపు రంగును ఇష్టపడే వాళ్ళు బలమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు.
- వాళ్ళపై వేరొకరు ఆధిపత్యం చెలాయించటం వీళ్ళకి నచ్చదు.
- చరిత్రను ఇష్టపడే వారు నల్ల రంగు కార్లంటే ఆసక్తి కలిగి ఉంటారట.
♥ నాకు కూడా నల్లని పొడవైన జడ,నల్లపూసల గొలుసు చాలా ఇష్టం.♥
చిరుగాలుల కెరటాలలో
ఏ మల్లి మరులెల్ల ఎగదోసెనో ...
ఏ రాజు ఎదలోతు చవిచూసేనో..
ఈ సంజెలో కెంజాయలో
సంజె కెంజాయ రంగుగా,చెంగావి రంగు గా ఈ రంగును వర్ణిస్తారు.
యోగులు, మునీశ్వరులు కాషాయ వస్త్రాలు ధరిస్తారు.
- ఈరంగు ఇష్టపడే వారు మాటకారులు
- వీళ్ళు ఎప్పుడూ చురుకుగా,సంతోషంగా ఉంటూ చంచల స్వభావాన్నికలిగిఉంటారు.
- నారింజ రంగు ధరించేవారు అనుక్షణం ఆత్మ పరిశీలన చేసుకుంటారు.
♥ చిన్నప్పుడు జింగ్ థింగ్ గోల్డ్ స్పాట్,ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ నాకు చాలా ఇష్టమైనవి.♥
ప్రకృతి లోని అందమైన రంగుల్లాగే మనజీవితం కూడా సకలవర్ణ శోభితం కావాలని కోరుకుంటూ
అందరూ సంతోషంగా జరుపుకునే హోలీ పండుగ శుభాకాంక్షలు
4 కామెంట్లు:
నాకు ఈ పోస్ట్ చాలా చాలా బల్లె బల్లె!!!రాజీ కి ఇష్టంలేని రంగేమి లేనట్లుందే. రాజి అంటే ఇంద్రధనుసన్నమాట. అన్ని రంగుల మేలు కలయిక తెలుపు ఎంత బాగుంటుందో కదా! స్నేహానికి, ఆత్మాభినానానికి గుర్తైన లేత పసుపు ఇంకా బాగుంటుంది కదూ!! హోళీ కి నా నుంచి రాజి కి ఒళ్ళంతా ఈ పచ్చటి బంగారమే:)))
"జయ" గారూ.. పోస్ట్ నచ్చినందుకు థాంక్సండీ..
నిజమేనండీ "అన్ని రంగుల మేలు కలయిక ఇంద్రధనస్సు" అంటే నాకు చాలా ఇష్టం..
ఇంద్రధనస్సుతో నన్ను పోల్చినందుకు చాలా
సంతోషం :)
నా చిన్నిప్రపంచంలో మీ రాకతో హోలీ సందడి వచ్చేసింది.
హోళీకి మీ నుండి ఆత్మీయంగా నాకు పచ్చటి బంగారం ఇచ్చినందుకు ధన్యవాదములు..
అలాగే ఈ హోళీకి మీకు పసుపుపచ్చని గులాబీలు ఇస్తున్నాను :):)
సప్తవర్ణాల కలయిక ... నలుపు -తెలుపు వేదిక.
జీవన నాటక రంగం ... వీటి మేటి కలయిక లోనే.
చాలా బాగా ..చెప్పారు. వండర్ ఫుల్ పోస్ట్. అభినందనలు..
"మన మిత్రులందరికీ హోళీ శుభాకాంక్షలు"
"సప్తవర్ణాల కలయిక ... నలుపు -తెలుపు వేదిక.
జీవన నాటక రంగం ... వీటి మేటి కలయిక లోనే."
వనజ వనమాలి గారూ జీవితంలో సప్తవర్ణాల పాత్రను చక్కగా చెప్పేశారండీ..
పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదములు..
మీకు కూడా "హోళీ శుభాకాంక్షలు"
కామెంట్‌ను పోస్ట్ చేయండి