పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

31, ఆగస్టు 2014, ఆదివారం

ఇళయరాజా & ఇళయరాజా

నా మరో కొత్త వీడియో ప్రయోగం "నాదం నీ దీవెనే నీ రాగాలాపనే"...  ఈ పాట తమిళ్ డబ్బింగ్ సినిమా రాగమాలిక లోది  రాధ,కన్నన్ నటించారు . ఈ  పాట వింటుంటే నాదం,రాగం, ఇలా ఏదో శాస్త్రీయ సంగీతం పాటలగా అనిపిస్తుంది కానీ ఈ పాట వీడియో తమిళం లో చూశాను .. రాధ పల్లెటూరి అమ్మాయి లాగా పాడుతుంది ... 

తన ప్రేమను తెలియచేస్తూ అమ్మాయి పాడే ఈ పాట ఇళయరాజా సంగీతం, వేటూరి సాహిత్యం తో పాటూ జానకమ్మ స్వరం లో చాలా బాగుంటుంది .. 1982 లో వచ్చిన రాగమాలిక సినిమా గురించి తెలుగులో ఎక్కడావీడియోలు, పాటలు లేవు కానీ యూట్యూబ్ లో తమిళ సినిమా పాటలు, వీడియోలు ఉన్నాయి .ఈ పాట వీడియో తెలుగులో లేదు కాబట్టి నాకు నచ్చిన చిత్రాలతో వీడియో చేశాను.. 

"సంగీత జ్ఞాని ఇళయరాజా" గారి సంగీతం లో వచ్చిన ఈ పాట కోసం నేను ఎంచుకున్న చిత్రాలు కూడా ఇళయరాజావే.. "ఆర్టిస్ట్ ఇళయరాజా"  గురించి అందరికీ తెలిసే వుంటుంది .జీవం ఉట్టిపడే అమ్మాయిల చిత్రాలు చూస్తుంటే ఆశ్చర్యం  అనిపిస్తుంది .. రోజువారీ ఇంట్లో పనులు చేస్తున్నట్లున్న అమ్మాయిలు, పరిసరాలను  చిత్రించిన పెయింటింగ్స్ చూస్తుంటే ఫోటోలు చూస్తున్నాము అనిపిస్తుంది కానీ పెయింటింగ్స్  అనిపించవు . రాజా రవి వర్మ తర్వాత ఆడవాళ్ళ చిత్రాలను ఇంత  చక్కగా వేసింది ఈయనేనేమో. ఆర్టిస్ట్ ఇళయరాజా పెయింటింగ్ లో అమ్మాయిలైతే ఈ పాటకి సరిపోతారు అనిపించి ఆ  చిత్రాలతో పాటు కొన్ని నాకు నచ్చిన రాధాకృష్ణుల పెయింటింగ్స్ తో ఈ పాట ఎడిట్ చేశాను. 

ఆర్టిస్ట్ S.ఇళయరాజా గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు. ఒకరు మహా సంగీత జ్ఞాని, మరొకరు జీవం ఉట్టిపడే చిత్రాల సృష్టికర్త ఇలా వీరిద్దరి సృష్టిని ఒక చోటికి చేర్చిన  నా చిన్ని ప్రయత్నమే ఈ పాట.. 

నాదం నీ దీవెనే నీ రాగాలాపనే
నీ రాగ గీతం పాడుతుంటే
పలుకే పాలూరదా ఓ.. పువ్వే వికసించదా
నాదం నీ దీవెనే నీ రాగాలాపనే
2 వ్యాఖ్యలు:

మురళి చెప్పారు...

just excellent!!
this is one of my favourite songs
thank you very much for the video

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మురళి గారూ.. ఈ పాట నాకు కూడా ఇష్టమైన పాట ..

వీడియో చేస్తున్నప్పుడు పాట ఎన్ని సార్లు విన్నా విసుగనిపించలేదు .

నేను చేసిన వీడియో నచ్చినందుకు , మీ స్పందన తెలిపినందుకు చాలా థాంక్సండి..

Related Posts Plugin for WordPress, Blogger...