ఈ మధ్య వచ్చిన సినిమాల్లో నాకు నచ్చిన సినిమా లీడర్.శేఖర్ కమ్ముల తన అన్ని సినిమాల్లాగానే గొడవలు,అల్లర్లు లేకుండా తనదైన శైలిలో ప్రెజెంట్ చేసిన సినిమా లీడర్.రాజకీయాలు ఒక వర్గానికి మాత్రమే సంబంధించినవిగా,ఒక వృత్తిగాడబ్బు సంపాదించే వ్యాపారంగా, కొనడం,అమ్ముడుపోవడమే రాజకీయాలుగా
మారిన ఈ రోజుల్లో ప్రస్తుత రాజకీయాలను మార్చి ప్రజల్లో బ్రతకడానికి ఆశని కల్పించమన్న తల్లి కోరిక మేరకు
ముఖ్యమంత్రి అవుతాడు అర్జున్ ప్రసాద్.
వ్యవస్థను మార్చాలన్నఅతని సంకల్పానికి ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి.ఎ సి బి దాడులనుండి ప్రజాప్రతినిధులను తప్పించటం,పోలీసు అకాడమి కోసం హోంమినిస్టర్ లంచం డిమాండ్ చేయటం,
ఒక ఆడపిల్లను చంపిన ఎం ఎల్ ఎ కొడుకుకి శిక్ష పడకుండా చేయటం ఈ పరిస్థితుల్లో ఉన్నతమైన వ్యక్తిత్వం
వున్న అర్జున్ ప్రసాద్ నిస్సహాయ స్థితిలో తప్పు చేయవలసి వచ్చినప్పుడు అనుభవించే మానసిక వేదన ఆత్మవిమర్శ చేసుకునే ప్రతి వ్యక్తికీ ఏదో ఒక సమయంలో ఎదురైవుంటుంది.
ప్రస్తుత రాజకీయాల్లో బంధుత్వాలని స్వార్ధం కోసం ఎలా వాడుకుంటున్నారొ అర్చన [టీవీ ఛానల్ ఓనర్]తో
ప్రేమ విషయంలో తెలుస్తుంది.హీరో రానా డీసెంట్ గా,మంచి వ్యక్తిగా,సమాజంలో మార్పు తేవాలని ఆరాటపడే యువనాయకుడిగా అర్జున్ ప్రసాద్ పాత్రకు సరిగ్గా సరిపోయాడు.తన కొడుకుని రాజకీయనాయకుడిగా కాకుండా నాయకుడిగా, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా తయారు చేయాలన్నసంకల్పం వున్న తల్లిగా సుహాసిని చేసిన సౌమ్యమైన తల్లి పాత్ర ప్రతి అమ్మ తమ పిల్లల పెంపకం గురించి ఆలోచించేలా చేసింది.
హీరోయిన్ లు ఇద్దరు చాల సింపుల్ గా ,స్నేహితుడిని అర్ధం చేసుకుని తోడుండే మంచి మనసున్న వ్యక్తులుగా బాగా నటించారు.
మనవరాలితో కలిసి సి.ఎం తో మాట్లాడటానికి వచ్చిన ముసలివాడు మేము బస్ లోనే వెళతాం బాబు అక్కడైతే జనాలు వుంటారు అనే సన్నివేశం చాలా బాధ కలిగిస్తుంది.
శిక్ష తప్పించుకున్నాను అన్న ఆనందంతో సి.ఎం కు బొకే ఇవ్వడానికి వచ్చిన వెధవని చాచి కొట్టే సన్నివేశం
మంచి పని చేసాడు అన్న ఆనందం కల్గించింది.
ప్రజలు డబ్బు కోసం ఆశపడకుండా మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన సామాజిక బాధ్యతను ఈ చిత్రం గుర్తు చేసింది.
ఇప్పుడిప్పుడే సమాజం గురించి ఆలోచిస్తూ ఇంకా అన్యాయం,అక్రమాలకి అలవాటుపడని వ్యక్తులు,
ఇప్పటిదాకా కొన్ని తప్పులు చేసినా ఇంకముందు సమాజ శ్రేయస్సు కొరుకునే వ్యక్తులు తప్పకుండా
చూడాల్సిన సినిమా లీడర్
వందేమాతరం,మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటలు చాలా బాగున్నాయి.
వందేమాతరం .. వందేమాతరం
రాజి