"ప్రేమనేది ఒకరి ప్రమేయంతో కాదు తనంతట తానుగా ఉద్భవించాలి.
ఒక వ్యక్తి మనసులో ప్రేమ పుట్టించటమనేది ఆ దేవునికి కూడా సాధ్యం కాదు
అదే సాధ్యమైతే ఈ ప్రపంచంలో అందరూ సుఖ శాంతులతో జీవించేవారు
ఇన్ని ప్రపంచ యుద్ధాలు జరిగి ఉండేవి కాదు..."
ఈ మాటలు యండమూరి వీరేంద్రనాధ్ గారి థ్రిల్లర్ నవల ఆధారంగా తీసిన "ముత్యమంతముద్దు" సినిమాలోవి. ప్రేమతో, మంచి మాటలతో దేన్నైనా సాధించొచ్చు అంటూ ఉంటారు కానీ అది సాధ్యం కాదని ఒక గురూజీ ద్వారా మళ్ళీ ఈరోజు నిరూపితమైంది .. పిడుక్కీ బియ్యానికి ఒకే మంత్రం అన్నట్టు ఏదో కాసేపు అదో ఫ్యాషన్, టైమ్ పాస్ అనుకునే వాళ్ళు తెగ ఫాలో అవుతున్నారు కదా ఇక అందరూ నామాట వింటారనుకుంటే ఇలాగే అవుతుంది. ఎప్పుడూ శాంతి శాంతి అంటూ మనల్ని ఎవరు హీనంగా తిట్టినా, విమర్శించినా, మనలో లోటుపాట్లు ఎత్తి చెప్పినా వినబడనట్లు,మనల్ని కాదన్నట్టు సైలెంట్ గా వుండాలి, వాళ్ళ ఖర్మానికి వాళ్ళని వదిలెయ్యాలి అప్పుడు వాళ్ళే నోరు నొప్పి పుట్టి మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు అంటూ శంకర్ దాదా mbbs సినిమాలో చిరంజీవిని చూసి B.P రాకుండా పిచ్చి నవ్వు నవ్వే లింగంమామ లాగా , స్నేహితులు సినిమాలో హీరో లాగా ALL Is Well అనుకుంటూ ఉండమని చెప్పే మీ నోటి వెంట కూడా ఒక్కసారికే మిలటరీ అనే మాట తెప్పించారు. వాళ్ళతో పెట్టుకుంటే ఎంత పని జరిగిందో చూశారా గురూజీ ..!!
గీతలో శ్రీ కృష్ణుడేం చెప్పాడు నాయనా ..అంటే నేను పెద్దగా చదువుకోలేదు సామీ అన్నట్లు ధర్మం,న్యాయం, శాంతి,ప్రేమ లాంటి గొప్పమాటల గురించి వాటికి అర్ధాలే తెలియని వాళ్ళ ముందు మాట్లాడటం చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లు,బూడిదలో పన్నీరు పోసినట్లు అవుతుందని మీకు తెలియకపోవటం ఏమీ బాలేదు గురూజీ .. ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే.. గాడి తప్పిన ధర్మాన్ని పరిరక్షించటానికి ఏ రూపంలోనైనా ఎప్పుడైనా భగవంతుడు అవతరిస్తాడు,ధర్మాన్ని గెలిపిస్తాడని నమ్ముతున్న సమాజం మనది.అందుకే కొన్ని సమస్యల్ని అలా భగవంతుడికి వదిలేయటమే మంచిదేమో అనిపిస్తుంది.

గురూజీ మీకు చెప్పేటంత దాన్ని కాదు కానీ ఈ రోజుల్లో చాలా మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారు.మనసులో సమస్యలని బైటికి చెప్పుకోలేక,చెప్పుకున్నా సానుభూతితో అర్ధం చేసుకుని స్పందించి,ఓదార్చే మనుషుల్లేక,డిప్రెషన్స్ తో కుమిలిపోతూ,చివరికి ప్రాణాలు కూడా తీసుకుంటున్న వాళ్ళు ఎందరో.. ఏవేవో సమస్యలతో పిచ్చివాళ్లై పిచ్చి హాస్పటల్స్ లో జీవితాంతం ఉండిపోతున్నారు కూడా.. ప్రస్తుతం మామూలు ఆరోగ్య సమస్యల హాస్పటల్స్ తో సమానంగా మానసిక సమస్యల డాక్టర్లు,హాస్పటల్స్ కనపడుతున్నాయి.మానసిక వ్యాధిగ్రస్తులుగా ముద్రపడి పూర్తి పిచ్చివాళ్ళుగా మారిపోతున్న వాళ్ళని మీ ప్రేమతో,మాటలతో మార్చొచ్చు కదా.. మీరు, మీ శిష్యులు ఇలాంటి అభాగ్యుల మీద ఎందుకు దృష్టి పెట్టటం లేదు? కేవలం కొన్ని ఉన్నతవర్గాల మీదె మీకెందుకంత అభిమానం?
మీకింకో విషయం తెలుసా గురూజీ కొన్నిసార్లు మానసిక వ్యాధిగ్రస్తులపై ఎంత ప్రేమ,సానుభూతి ఉన్నా అయినవాళ్ళు కూడా ఏమీ చేయలేక,వాళ్ళని దూరంగా ఉంచాల్సిన తప్పనిసరి పరిస్థితి ఉంటుంది ఏదో సామాన్యులు ఇలా చేస్తే ఒక అర్ధముంది కానీ ,"అందరికీ జాతకం చెప్పే బల్లి ఎక్కడో పడిందని" సామెత చెప్పినట్లు బయట ఎందరికో మానసిక వికాస పాఠాలు బోధించి,జీవితాన్ని ఒక కళగా బ్రతకటం గురించి బోధిస్తూ,"The Monk Who Never Sold His Ferrari" లాగా జీవిస్తున్న మీ అనుంగు శిష్యులు కూడా సొంతమనుషుల మానసిక వైకల్యాన్ని సరిచేయలేక వాళ్ళని పిచ్చివాళ్ళుగా ముద్ర వేసి,కాళ్ళు,చేతులు కట్టేసి,మత్తు ఇంజెక్షన్లు చేపించి మరీ సంవత్సరాల పాటు పిచ్చి హాస్పటల్స్ లో పడేసి చేతులు దులుపుకుంటున్న వాళ్ళు కూడా కొందరున్నారు. ప్రతి స్టేట్ లో, జిల్లాలో ఉండి, ప్రజలకు విస్తృతంగా సేవ చేస్తున్న మీ సంస్థకి సంబంధించిన స్వచ్చంధ సేవకులు తమ దగ్గరలో ఉన్న మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళని గుర్తించటం పెద్ద సమస్యేమీ కాదు కదా,మన దేశంలో ఉన్న ప్రభుత్వ,ప్రైవేట్ మెంటల్ హాస్పటల్స్ లో మీ సేవా మీ సంస్థ ద్వారా మీ కోర్సులతో వారి మానసిక సమస్యలను తొలగించొచ్చు కదా .. కొంచెం కొత్తగా ఆలోచించండి గురూజీ ..
ఈ ప్రపంచంలో ఎవరికి చెయ్యాలనిపించే పనులు వాళ్ళు చేస్తారు, ఎవరికి వినాలనిపించిన మాటలు వాళ్ళు వింటారు.అవి ఎంత సమాజానికి విరుద్ధమైనవే అయినా ఎవరు చేసే పనులు వాళ్ళకి ధర్మం,న్యాయం అనిపించటం సహజం.మనిషి తన అవసరాలకు,ఆలోచనలకు తగినట్లు తన నమ్మకాలతో, సిద్ధాంతాలతో కొన్ని వర్గాలను తయారు చేసుకుంటాడు.అందుకే కదా ప్రతి మనిషికీ తనకు నచ్చే ,తనను మెచ్చే వాళ్ళొక వర్గమైతే,తనను ద్వేషించే వాళ్ళు,తాను శత్రువులనుకునే వాళ్ళు మరొక వర్గం.మీరెవరినో దుర్మార్గులు, దుష్టులు అనుకుని వాళ్ళని మీ బోధలతో మార్చాలని అనుకుంటున్నారేమో కానీ వాళ్ళ కంటే దుర్మార్గమైన మేక వన్నె పులులు,తేనె పూసిన కత్తులు వగైరా వగైరాలు మీ శిష్యబృందంలోనే ఉన్నారు గురూజీ.సంస్కార కేంద్రాలని పేరు పెట్టుకుని వాళ్లకి లేని సంస్కారాన్ని ఎదుటి వాళ్లకి నేర్పాలని పాటు పడుతున్నారు పాపం. ముందు వాళ్ళలో పరివర్తన తీసుకురండి.ఇలాంటి శిష్య బృందం వలన మీ సంస్థకి చెడ్డపేరు తెచ్చుకోకండి..