పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

13, ఫిబ్రవరి 2012, సోమవారం

నీ పిలుపే ప్రేమగీతం...!


ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకోకుండా కేవలం ఉత్తరాల పరిచయం తో
ప్రేమించుకుని,ఎన్నో ఇబ్బందుల తర్వాత చివరికి కలిసే జంట కధే 1996 లో
అజిత్, దేవయాని హీరో హీరోయిన్లుగా వచ్చిన "ప్రేమలేఖ" సినిమా ..
ఈ సినిమాలో పాటలన్నీ బాగుంటాయి.ఆ పాటల్లో నీ పిలుపే ప్రేమ గీతం అన్న పాట...
ఈపాట సాహిత్యం,సంగీతం చాలా బాగుంటాయి.


నీ పిలుపే ప్రేమ గీతం

నీ పిలుపే ప్రేమగీతం...నీ పలుకే ప్రేమవేదం
ఆశలే బాసలై ... కలలు గనే పసిమనసులై
కవితలు పాడీ ... కవ్వించనీ
కవ్వించనీ ... కవ్వించనీ

కళ్ళు...కళ్ళు ... మూసుకున్నా
హృదయంతో మాటాడునమ్మా ప్రేమా
నిద్దుర చెదిరిపోయేనమ్మా నేస్తం కోసం
వెతికేనమ్మా ప్రేమా..

ఆడించీ ...పాడించీ ... అనురాగంకురిపించీ
అలరించేదే ప్రేమా
రమ్మంటే పొమ్మంటూ ... పొమ్మం
టే రమ్మంటూ
కవ్వించేదేప్రేమా

ప్రేమలకు హద్దుల్లేవులే ... దాన్నిఎవ్వరైనా ఆపలేరులే
నీ పిలుపే ప్రేమగీతం...

జాతీ లేదూ...మతమూ లేదూ
కట్నాలేవి కోరుకోదూ ప్రేమా
ఆదీ లేదూ అంతం లేదూ
లోకం అంతా తానై ఉండును ప్రేమా

ఊరేదో...పేరేదో...కన్నోళ్ళ వూసేదో
అడగదు నిన్ను ప్రేమా..
నాలోనా నీవుండీ నీలోనా నేనుండీ
జీవించేదేప్రేమా..

జాతకాలు చూడబోదులే ...ఎన్నిజన్మలైన వీడిపోదులే..
నీ పిలుపే ప్రేమగీతం...నీ పలుకే ప్రేమవేదం
ఆశలే బాసలై ... కలలుగనే పసిమనసులై
కవితలు పాడీ ... కవ్వించనీ
కవ్వించనీ ... కవ్వించనీ

Related Posts Plugin for WordPress, Blogger...