రాత్రి ఎంత త్వరగా పడుకున్నా పొద్దున్నే లేవాలనిపించటం లేదు
దుప్పటి గట్టిగా బిగించి కళ్ళు తెరవాలనిపించటం లేదు..
పొద్దున్నే స్నానం చేయాలంటే భయంగా వుంటుంది...
చక్కగా జుట్టుకి నూనె పెట్టి జడ వేసుకుందామని చూస్తే కొబ్బరి నూనె డబ్బాలో
నూనె బదులు గడ్డ కట్టిన నెయ్యి కనిపిస్తుంది ..
సాయంత్రం బయటకి ఎక్కడికన్నా వెళ్ళాలంటే 6 గంటలకే చీకట్లు ..
తెల్లవారుఝామున మొక్కలపై అందంగా కనపడుతున్న మంచు బిందువులు..
మరి చలికాలం వస్తే ఇలాగే వుంటుంది కదా..
డిసెంబర్ ,జనవరి నాకు ఇష్టమైన నెలలు
డిసెంబర్ లో నేను పుట్టాను.. నేను చదువుకుంది సిస్టర్స్ స్కూల్ లో కావటంతో
డిసెంబర్ లో మాకు ఎక్కువ క్రిస్మస్ సెలవులు ఉండేవి..
అలాగే డిసెంబర్ వెళ్తూ జనవరి వస్తూ తీసుకువచ్చే కొత్త సంవత్సరం అంటేనే
అందరికీ ఉత్సాహమే కదా అలాగే నాకు కూడా..
ఇంకా ఈ చలికాలానికి మాత్రమే ప్రత్యేకమైన నాకు ఇష్టమైన కొన్ని విశేషాలు..
ఉదయాన్నే చలికి వేడి వేడి కాఫీ
అమ్మ చేసే సున్నిపిండితో పాటు వాడే వింటర్ కేర్ ప్రొడక్ట్స్
స్వెటర్స్,షాల్స్ వేసుకుని విచిత్ర వేషధారణలు

చలికి వణుకుతూనే చేసే ధనుర్మాసం పూజలు

ఎదుటివాళ్ళ మీద పోటీపడుతూ చలిని కూడా లెక్కచేయకుండా
ఇంటి ముందు వేసే ముగ్గులు
ఇంటి ముందు వేసే ముగ్గులు

ఇంకా ఈ సీజన్ కి మాత్రమే ప్రత్యేకమైన,
షాపింగ్,పార్టీల సందడిని తెచ్చే క్రిస్మస్..

కొత్త సంవత్సరానికి కోటి కలలతో,
తీర్మానాలతో ఆనందకరమైన ఆహ్వానం..
తీర్మానాలతో ఆనందకరమైన ఆహ్వానం..

ఇన్ని ప్రత్యేకతలున్న ఈ చలికాలం అందాలను ఆస్వాదిస్తూ,చలికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ
హాయిగా ఎంజాయ్ చేద్దాం..

