పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

11, జనవరి 2012, బుధవారం

ఓ కాలమా నీ పనే బాగుంది సుమా...!


కాలమా నీ పనే బాగుంది సుమా...!
కాలమా ఎంత అల్ప సంతోషివి నీవు?
నీ "రోజుల" చక్రానికి ఆయువు
ఇరవైనాలుగు గంటలు చాలనుకుంటావు
ధ్యానములోని తాపసిలా
ఎంత ప్రశాంతంగా ఉంటావు..!

కాలమా నీదెంత అదృష్టం..
గడచిన దాన్ని గురించి బాధపడక,
జరగబోయే దానికి చింతించక,
ఎవరి కోసం వేచి చూడక,
నిర్లిప్తంగా ముందుకు సాగుతూ...
ఈ క్షణం
మాత్రమే నిజం అంటావు,
ఏ బంధాలకి
బందీ కానంటావు.

వెనుకకి తిరిగి చూడటం తెలియని
నిన్ను చూస్తుంటే నాకు అసూయగా ఉంది.
ఒకరి చింత నీకు లేదు
ఎవరి నుంచి భయము లేదు.
ఎవరికీ
ఏమి దాచవు
ఎవరి నుండి
ఏమీ ఆశించవు.
ఓ కాలమా నీ పనే బాగుంది సుమా!Related Posts Plugin for WordPress, Blogger...