ఇల్లంటే నలుగురు మనుషులు ప్రేమ,ఆప్యాయతలతో బంధించబడవలసిన నిలయమే కానీ,
పదిమంది శత్రువులు తమ తమ గదుల్లో వ్యూహాలు పన్నుతూ తప్పనిసరిగా
కలిసి బ్రతకాల్సి వచ్చే ఒక వలయం కాదు..
మనషి బంధించబడాల్సింది ప్రేమానురాగాలతోనే కానీ conditions,Rules తో కాదు.
కుటుంబంలో కష్టం వచ్చినప్పుడు ఒకరి మీద ఒకరికి ప్రేమాభిమానాలు వుండటం సహజమే కానీ
ఆ ప్రేమ ఎప్పుడూ ఒకరి మీద ఒకరికి ఉన్నప్పుడే అది గొప్ప కుటుంబం అవుతుంది...
కుటుంబంలోని ప్రేమానురాగాలు,క్రమశిక్షణ ఒక మనిషిని మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా తయారు చేస్తాయి.
అదే కుటుంబంలోని బాధ్యతారాహిత్యం,అవసరానికి మించిన నియంతృత్వం ఇంకొక మనిషిని మానసికంగా కుంగదీస్తుంది... లేదా సంఘ వ్యతిరేకులుగా తయారు చేస్తుంది..
మంచి వివాహమే మంచి దాంపత్యం
మంచి దాంపత్యమే మంచి సంతానం
మంచి సంతానమే మంచి సమాజం
మంచి సమాజమే మంచి ప్రపంచం
మంచి సంతానమే మంచి సమాజం
మంచి సమాజమే మంచి ప్రపంచం
అంతర్జాతీయ కుటుంబ దినోత్సవ శుభాకాంక్షలు...