పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

20, జూన్ 2011, సోమవారం

గోరింటతో ముగ్గులు పెట్టి...


మా
చెల్లి ఎప్పుడూ నాకు చాలా బాగా మెహేంది పెట్టేది కోన్ తో కానీ ఎప్పుడైనా నాకు గోరింటాకు పెట్టక్కా
అని తను అడిగితే నాకు మాత్రం అలా పెట్టటం రాదు అనేదాన్ని...
కానీ నాకు ఆనందం,ఆశ్చర్యం కలిగించిన విషయం మా చెల్లి నిశ్చితార్ధం రోజు గోరింటాకు పెట్టాలి
ఎలాగా అని ఆలోచిస్తూ సరే నేనే ట్రై చేస్తాను అంటూ మొదలుపెట్టాను..
ఎంత బాగా కుదిరిందంటే గోరింటాకు పెట్టిన తర్వాత పండిన ఆ ముద్దు ముద్దు చేతుల్ని చూసి నేనే
ఆశ్చర్యపోయాను ఇంతబాగా నేను వేసానా అని..
అదే అంటారేమో దేవుడు ఎప్పుడు ఏది అవసరమో అది అప్పటికప్పుడు మనకి అందిస్తాడు అని..
అలాగే పెళ్ళికి కూడా నేనే మా చెల్లికి గోరింటాకు పెట్టాను..మెహేంది పెట్టేవాళ్ళతో పెట్టిద్దాము అనుకున్నా
మా చెల్లి నువ్వే పెట్టక్క అని నాతోనే గోరింటాకు పెట్టించుకుంది...
మా చెల్లి పెళ్ళికి నా సొంతగా నేను గోరింటాకు పెట్టటం నాకు చాలా సంతోషం అనిపించింది..
నేను పెట్టిన గోరింటాకు అందరికీ నచ్చింది..మీరు కూడా చూడండి..







Related Posts Plugin for WordPress, Blogger...