పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

31, జులై 2012, మంగళవారం

మా పూలతోట ...


ఈ సంవత్సరం ఎండలు చాలా ఎక్కువగా వున్నాయి.. ఆ ప్రభావం మనుషులనే కాదు మా మొక్కల్ని కూడా చాలా బాధపెట్టింది. పోయిన సంవత్సరం మొక్కలన్నీ ఎంతో చక్కగా పూలు పూసాయి.. కానీ ఈ ఎండలకి ఒక్కోటిగా మొక్కలన్నీ ఎండిపోతుంటే చాలా బాధ అనిపించింది.. కానీ ఏమీ చేయలేని పరిస్థితి..

"ఇంటి వాకిలి వెతికి ఆకాశం చిరు జల్లులు కురియును మనకోసం" అన్నట్లుగా వర్షం కోసం ఎదురుచూసి వర్షం పడగానే వెంటనే నర్సరీకి వెళ్లి, అలాగే ఇళ్ళ దగ్గరికి వచ్చిన మొక్కలు కొనేసి మళ్ళీ మా పూలతోట ని ఆకుపచ్చగా మార్చేసాము.. చాలా రోజుల తర్వాత చల్లటి గాలికి హాయిగా నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన మొక్కలను చూడటం చాలా సంతోషంగా అనిపిస్తుంది..

మొక్కలు కొనటంలో బిజీగా వున్న అమ్మ, పిన్ని..


నర్సరీలో పచ్చందనమే పచ్చదనమే


కొత్త మొక్కలు
మా మొక్కలలో ఎక్కువ గులాబీలే వుంటాయి..








ఎండలకి కూడా మొండిగా తట్టుకుని
వర్షం పడగానే చెట్టునిండా పూలు పూసిన మా చిట్టి గులాబీలు



వర్షానికి తడిచి పచ్చగా మెరిసిపోతున్న మందారం, నందివర్ధనం


ముద్దబంతి నవ్వులు

చుక్కమల్లె పూలు

పోయిన సంవత్సరం నాటిన చామంతుల్లో మిగిలిన చామంతి మొక్కలు.

మా ఇంట్లో మొక్కలే కాదు ఇప్పుడు కురుస్తున్న వర్షాలకి ప్రకృతి అంతా పచ్చగా,అందంగా ఎక్కడికి వెళ్తున్నా దారివెంట పచ్చటి చెట్లు,పొలాల్లో ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్న పంటలు చాలా చల్లగా ఆహ్లాదకరంగా ఎంత దూరం ప్రయాణమైనా విసుగు అనిపించకుండా వాతావరణం చాలా బాగుంది..

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర గన్నేరు పూలు

పంట పొలాలు



కాగితం పూలు


పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమే ఆనందానికి ఇల్లు




Related Posts Plugin for WordPress, Blogger...