పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

30, జూన్ 2010, బుధవారం

నా పంచ ప్రాణాలే నీవనీ....


పంచభూతాల సాక్షిగా...
పంచామృతాల సాక్షిగా...
పంచేంద్రియాల సాక్షిగా...
పంచాక్షరాల సాక్షిగా...
నా పంచ ప్రాణాలే నీవనీ... పంచేసుకుంటా నీతో ప్రేమనీ...

మూడుముళ్ల బంధంతో, ఏడడుగులతో రెండు మనసులను ఒక్కటి చేస్తుంది వివాహబంధం.

ధర్మేచ...మోక్షేచ...కామేచా...అర్దేచా...నాతిచరామి అంటూ భిన్న కుటుంబాలనుండి వచ్చిన ఇద్దరు వ్యక్తులను ఏకం చేస్తుంది వివాహ బంధం.

అప్పటి వరకు ఎవరికీ ఎవరోగా వున్న ఇద్దరు వ్యక్తులను ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా కలిపేది వివాహ బంధం.

భార్యా, భర్తలు జీవిత భాగస్వాములుగా కష్ట,సుఖాలను పంచుకుంటూ ఒకరి కోసం ఒకరుగా,ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ,సాగి పోయే వివాహ బంధం చూడ ముచ్చటగా వుంటుంది.

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు... నీకోసమే కన్నీరు నింపుటకు
నేనున్నానని నిండుగ పలికే ....తోడుకరుండిన అదే భాగ్యమూ...అదే స్వర్గమూ

ప్రతి మనిషి జీవితంలో కోరుకునేది ఇలాంటి తోడునే కదా ....

నేను సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన ఈ పాట రాజశేఖర్,జీవితల ఇంద్రధనస్సు సినిమా లో పాట
ఈ పాటలోని సాహిత్యం నాకు చాలా ఇష్టం.
భార్యను అమితంగా ప్రేమించి,ఆరాధించే భర్త ఆమెను గురించి పాడే పాట చాలా బాగుంటుంది.
భార్యను ఇంత వున్నతంగా వూహించుకుని,ప్రేమించే భర్త దొరకటం నిజంగా అద్రుష్టం...

ఇంద్రధనస్సు ఇల్లాలై ఇంటి వెలుగు అయ్యిందీరాజి

28, జూన్ 2010, సోమవారం

సర్వాంతర్యామిభగవంతుని నమ్మి నడక సాగించు  
దైవమే దారి చూపుతాడు.

నా చిన్ని ప్రపంచంలో నన్ను,నా కుటుంబాన్ని భగవంతుడు అహర్నిశలు వెన్నంటి కాపాడుతాడు.
అన్న నమ్మకమే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది .

ఇసుకలోని పాదముద్రలు.

రాత్రి నాకు ఒక కల వచ్చింది
కలలో నేను దేవుడితో కలిసి బీచ్ లో నడుస్తున్నాను
నా జీవితానికి సంబంధిన ఎన్నో సంఘటనలు 
నాకు ఆకాశంలో కనపడుతున్నాయి.
 
ప్రతి సన్నివేశంలోనూ ఇసుకలో పాదముద్రలను 
నేను గమనించాను
కొన్నిసార్లు ఇద్దరి పాదముద్రలు వుండగా 
మరికొన్నిసార్లు ఒక్కరివి మాత్రమే కనిపించాయి
ఇది నన్ను చాలా బాధపెట్టింది... 
ఎందుకంటే
జీవితంలో నేను బాధల్లో,ఓటమిలో,సమస్యల్లో వున్న సమయాల్లో
ఒక్కరి పాదముద్రలు మాత్రమే కనిపిస్తున్నాయి.
అప్పుడు నేను దేవుడితో ఇలా అన్నాను
"తండ్రీ నేను నిన్ను అనుసరించినట్లయితే 
నీవు నన్ను ఎప్పుడు వెన్నంటి ఉంటానని మాట ఇచ్చావు కదా...
కానీ ఇప్పుడు నేను గమనించాను 

నేను జీవితంలో ఎంతో కష్టపడుతున్న సమయాల్లో ఇసుకలో
ఒక్కరి పాదముద్రలే కనిపించాయి.
నీ అవసరం ఎంతగానో వున్న ఆ కష్ట సమయాల్లో
నీవు నా వెంట లేవా ?"
అప్పుడు దేవుడు నాతో అన్నాడు
"అమ్మా నువ్వు కష్టాల్లో వున్నపుడు 

చూసిన ఆ పాదముద్రలు నీవి కావునీకు బాధ తెలియకుండా నేను నిన్ను ఎత్తుకున్నప్పుడు 
పడిన నా పాదముద్రలు అవి"
రాజి

27, జూన్ 2010, ఆదివారం

మా ఇల్లే బృందావనం.....2

మా ఇంటి తులసి కోటముద్దుకే ముద్దొచ్చే మందారం
అమ్మకి బి.పి తగ్గడానికి కాకరకాయ తినమని డాక్టర్ చెప్పటంతో తమ్ముడు ఇంట్లోనే పెంచిన కాకరకాయ పందిరి.


మా దబ్బకాయ చెట్టు మా ఇంట్లో మా బంధువుల ఇళ్ళలో,మా చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళల్లో చెట్టు కాయల పచ్చడి ప్రతిసంవత్సరం తప్పనిసరిరాజి

26, జూన్ 2010, శనివారం

మా ఇల్లే బృందావనంఆనాటి క్రిష్ణుడు ఆడి పాడిన బృందావనం ఎంత మనోహరంగా వుంటుందో మా ఇంట్లో మా వంశీ క్రిష్ణుడు అంటే మా తమ్ముడు ఎంతో ఆసక్తిగా పెంచిన పూలతోట కూడా అంత మనోహరంగా వుంటుంది.

మా అమ్మ మేము చిన్నప్పుడు మాకంటూ సొంత ఇల్లు కావాలని ఎంతో కోరుకునేదట.ఒక రోజు అమ్మ కలలో అమ్మ పూజ చేసుకునే అమ్మవారు కనపడి నీకు 2 సొంత ఇళ్ళు ఇస్తాను నీ ఇంటి ముందు సన్నజాజి పూల చెట్లు పెంచి ఆ పూలతో నాకు పూజ చేయమని చెప్పిందట

ఈ కల వచ్చిన నెలలోనే మేము స్థలం కొనటం,ఇల్లు కట్టించటం అంతా జరిగిపోయింది.
అమ్మ మా ఇంట్లో ముందుగా నాటిన మొక్క సన్నజాజి.

ఇంట్లో స్థలం తక్కువ కాబట్టి అన్నీ కుండీలు తెచ్చి,ఆ కుండీలలో మొక్కలు నాటే మట్టి మమ్మల్ని స్కూల్ కి తీసుకెళ్ళే రిక్షా అబ్బాయికి డబ్బులిచ్చి తెప్పించేది అమ్మ.

వర్షం పడగానే కడియం, ఇంకా ఎక్కడెక్కడినుంచో సైకిల్ మీద అమ్మటానికి వచ్చే పూల మొక్కలని కొని మొక్కలు నాటటం అమ్మకి వర్షాకాలం లో వుండే పెద్ద పని.

అలా మొదలైన మొక్కలు పెంచే ఆసక్తి మా అమ్మతో పాటు మా తమ్ముడికి వచ్చింది.వాడు పెరిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా పూల మొక్కలు తెచ్చి వాటిని ఎంతో జాగ్రత్తగా పెంచుతాడు.
మొక్కలు,చెట్లతో బంధాన్ని పెంచుకున్న వ్యక్తి కుటుంబ బంధాలకు విలువ ఇస్తాడు.
ఈ మాట మా తమ్ముడి విషయం లో అక్షర సత్యం.

ఇక నాకు, మా చెల్లికి పూచిన పూలని పెట్టుకోవటం కంటే వాటిని చూసి ఆనందించటం అంటేనే ఇష్టం.
మనం నాటిన మొక్క ఎదుగుతున్న తీరు చూసినా,వాటికి పూసిన పూల అందాలు చూసినా కలిగే ఆహ్లాదకర భావన అనుభవిస్తే కానీ తెలియదు.

ఇంట్లో స్థలం తక్కువగా వున్నా కుండీలలో ,వున్న చిన్న నేలలోనే పెరిగిన మా పూలతోట ఎంతో ఆహ్లాదకరంగా,
నయన మనోహరంగా వుంటుంది.

ఇదే నా చిన్ని ప్రపంచం లో మా ఇంటి బృందావనం .


మా తోటలో పూచిన గులాబీ బాలలు

ఒక కొమ్మకి పూచిన పువ్వులం అనురాగం మనదేలే

రాజి

పెళ్లి పాటలు.ప్రతి ఒక్కరూ ఎన్నో కలలు కని కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టే వేడుకే పెళ్లి.
పెళ్ళంటే ఇలాగే చేసుకోవాలి అని ప్రతి ఒక్కరూ అనుకునేలాగా ఉంటాయి మన తెలుగు సినిమాలో పెళ్లి పాటలు
పెళ్లి పాటలు ఎన్ని వున్నా కొన్ని పాటలు ఎప్పటికీ మర్చిపోలేము.

By : N.RamyaNaidu
Related Posts Plugin for WordPress, Blogger...