మన సినిమాల్లో హీరో హీరోయిన్లు సంతోషంగా జంటగా పాడుకుంటే అది యుగళ గీతం, ఇద్దరూ విడి విడిగా ఒకరిని ఒకరు జ్ఞాపకం చేసుకుంటూ పాడితే విరహ గీతం, ఇద్దరూ ఒంటరిగా బాధగా పాడుకుంటే విషాద గీతం.. ఇలా చాలా రకాల పాటలు పాడుతూ వుంటారు.
వీటన్నిటికీ భిన్నంగా ఇద్దరూ కలిసి పాడుతూనే విభిన్న భావాలను వ్యక్తం చేస్తూ,ఒకరితో ఒకరు విభేదిస్తూ,ప్రశ్నిస్తూ పాడుకునే పాటలు కొన్ని ఉంటాయి ... పాత సినిమాల నుండి ఇప్పటిదాకా అలాంటి పాటలు చాలానే వుండి వుంటాయి కానీ నాకు కొన్నే గుర్తొచ్చాయి. అందులో అన్నీ నాకు నచ్చిన,హిట్ సాంగ్సే ఉన్నాయి ..
"సుమంగళి"
నాగేశ్వర రావు ,సావిత్రి పాడుకునే
నాగేశ్వర రావు ,సావిత్రి పాడుకునే
కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి
కలలే
కలలే
నా కలలో నీవే కనబడితే ఆ చొరవకు బలమేమి
మరులే..
మరులే..
ఈ పాట టాప్ 1 ప్రశ్నల పాటల్లో ఉంటుంది ఎప్పటికీ :)
కనులు కనులతో కలబడితే ఆ తగవుకు ఫలమేమి
"స్వర్ణకమలం"
వెంకటేష్ ' పరధర్మం కన్నా, ఏవో కొన్ని లోపాలున్నా స్వధర్మమే అనుసరించదగినది' అంటే "పరుగాపక పయనించవే తలపుల నావా కెరటాలకు తల వంచితే తరగదు త్రోవ" అంటూ భానుప్రియ తన అభిప్రాయాలను ఖచ్చితంగా చెప్తుంది...
శివ పూజకు చిగురించిన సిరి సిరి మువ్వా
"గోరింటాకు"
కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి ఎందుకీ మౌనం' అని సుజాత అడిగితే 'మనసులో ధ్యానం మాటలో మౌనం' అని తన ఆలోచనలు తెలియచేస్తాడు శోభన్ బాబు ..
కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి
"త్రిశూలం"...
భార్యగా గౌరవమైన స్థానాన్ని ఇచ్చిన మీరు రాముడు,దేవుడు అని భార్య పొగిడితే, నేను రాముడు దేవుడు కాదు 'తోడనుకో నీ వాడనుకో' అని భార్యను ఓదార్చుతూ భర్త చెప్పే సమాధానం ..
రాయిని ఆడది చేసిన రాముడివా
"సిరివెన్నెల"
కాబోయే జీవిత భాగస్వామి అందంగా ఉండాలి. ఇంకా ఎన్నో మంచి గుణాలు ఉండాలని కోరుకుంటారు కదా మీరు నాలో ఏమి చూసి ఇష్టపడ్డారు అన్న ఆమె ప్రశ్నకి "మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం అపురూపం" అంటూ అతడు పాడే ఈ పాట ఎప్పుడు విన్నా నిజంగా అపురూపంగానే వుంటుంది...
మెరిసే తారలదే రూపం విరిసే పువ్వులదే రూపం
"మహర్షి" ఒకరు బాధతో,ఒకరు ఆశతో పాడే పాట ఇది . ప్రేమించిన అమ్మాయికి పెళ్లి అయినా కూడా ప్రేమించే హీరో "నింగీ నేలా తాకే వేళా నీకు నాకు దూరాలేల" అంటే "ఆకాశాన తీరం అంతే లేని ఎంతో దూరం" అంటుంది హీరోయిన్ ..
మాటరాని మౌనమిది
"ఖుషీ"
ప్రేమంటే సులువు కాదు అది నీవు గెలవ లేవు అనే హీరోయిన్ తో
నీకోసం ఆకాశాన్ని నేలకు దించుతా అంటున్నాడు హీరో ..
ఈ పాట వీడియోలో పాట మొత్తం రాదు అందుకే ఆడియో పెట్టాను ..
ప్రేమంటే సులువు కాదురా
అది నీవు గెలవ లేవురా
"మగధీర"
వెలుగు దారి చూపింది చినుకు లాల పోసింది వాటితోటి పోలిక నీకేలా
ఇది హీరోయిన్ సందేహం "అవి బ్రతికున్నప్పుడే తోడుంటాయమ్మా నీ చితిలో తోడై నేనొస్తానమ్మా"నిను పొందేటందుకే పుట్టానే గుమ్మా నువు అందకపోతే వృధా ఈ జన్మ ..అని ఆమెపై తనకెంత ప్రేముందో హీరో తెలియచేసే ప్రయత్నం
పంచదార బొమ్మా బొమ్మా
నాకు నచ్చే మరొక పాట "రాధా - మధు" మా టీవీ సీరియల్ పాట.ఇది సినిమా పాట కాకపోయినా ఒకరు ఆశావాదిగా "కెరటాలు కోటి సార్లు ఎగిరి గగనాన్ని నేలపైకి తేవా" అంటే ,మరొకరు "ఆ నింగి నేలా ఎదురెదురుగున్నా రెంటికీ సాధ్యమా వంతెనా" అంటూ పాడే ఈ పాట చాలా బాగుంటుంది ..
ఆగదేనాడు కాలము ఆగినా గడియారము