
దోసిళ్లలో ఇసుక రేణువుల్లా జారిపోతున్నావే
ఎంతగా పిడికిలి బిగించినా
ఎంతగా బంధిద్దామని ప్రయత్నించినా
అంత త్వరత్వరగా పారిపోతున్నావే!
కలలకౌగిలి కరిగిపోక ముందే
మదిలో తలపులు తరలిపోకముందే
ఆలోచనలు అంతమవ్వకముందే
వెడలిపోతున్నావు…నీకెందుకంత తొందర?
జీవితం ఆస్వాదిద్దామన్నా
ప్రేయసి(ప్రియుడు) ప్రేమలో తరిద్దామన్నా
స్వప్నాల లోకంలో విహరిద్దామన్నా
దేనికీ సహకరించవే?
నిమ్మళంగా పనులు చక్కపెడదామన్నా
ప్రశాంతంగా కాసేపు కూర్చుందామన్నా
బద్దకంగా మరికాసేపు ఒద్దిగిల్లుదామన్నా
తీరికగా కబుర్లు చెప్పుకుందామన్నా
దేనికీ కాసేపు ఆగవే?
గాయం చేసేది నువ్వే ... మానిపేదీ నువ్వే
గుర్తు తెచ్చేదే నువ్వే ... మరిపించేదీ నువ్వే
బాధ పెట్టేదీ నువ్వే ... సంతోషాన్నీ మోసుకొచ్చేదీ నువ్వే
ఇంత శక్తి నీకెవరిచ్చారు?
ఎదురుచుపులో నత్తనడక నీదే
హడావుడిలో గుర్రపు స్వారీ నీదే
మాతోనే ఉన్నట్లు భ్రమ కలిగిస్తావు
సహకరించినట్లే వుంటావు
అందీ అందనట్లు పరుగులు తీస్తావు
నీ పరుగులో...మా అడుగులు జతపరచకపోతే
మిగిలేది శూన్యమే!
From: FaceBook TeluguQuotes


ఎంతగా పిడికిలి బిగించినా
ఎంతగా బంధిద్దామని ప్రయత్నించినా
అంత త్వరత్వరగా పారిపోతున్నావే!
కలలకౌగిలి కరిగిపోక ముందే
మదిలో తలపులు తరలిపోకముందే
ఆలోచనలు అంతమవ్వకముందే
వెడలిపోతున్నావు…నీకెందుకంత తొందర?
జీవితం ఆస్వాదిద్దామన్నా
ప్రేయసి(ప్రియుడు) ప్రేమలో తరిద్దామన్నా
స్వప్నాల లోకంలో విహరిద్దామన్నా
దేనికీ సహకరించవే?
నిమ్మళంగా పనులు చక్కపెడదామన్నా
ప్రశాంతంగా కాసేపు కూర్చుందామన్నా
బద్దకంగా మరికాసేపు ఒద్దిగిల్లుదామన్నా
తీరికగా కబుర్లు చెప్పుకుందామన్నా
దేనికీ కాసేపు ఆగవే?
గాయం చేసేది నువ్వే ... మానిపేదీ నువ్వే
గుర్తు తెచ్చేదే నువ్వే ... మరిపించేదీ నువ్వే
బాధ పెట్టేదీ నువ్వే ... సంతోషాన్నీ మోసుకొచ్చేదీ నువ్వే
ఇంత శక్తి నీకెవరిచ్చారు?
ఎదురుచుపులో నత్తనడక నీదే
హడావుడిలో గుర్రపు స్వారీ నీదే
మాతోనే ఉన్నట్లు భ్రమ కలిగిస్తావు
సహకరించినట్లే వుంటావు
అందీ అందనట్లు పరుగులు తీస్తావు
నీ పరుగులో...మా అడుగులు జతపరచకపోతే
మిగిలేది శూన్యమే!
From: FaceBook TeluguQuotes

