పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

2, నవంబర్ 2011, బుధవారం

నీకు నచ్చింది చెయ్యకుంటే ...లైఫులో యాడుంది కిక్కు...


  • చదివిన చదువు చాలే బుద్ధిగా చదువు మానేసి ఇంట్లో కూర్చో అంటే మానేసి ఇంట్లో కూర్చున్నారు.
  • పెళ్లి చూపుల్లో తలెత్తి చూడకుండా తల్లితండ్రులు చూపించిన సంబంధం చేసుకున్నారు.
  • 'ఆడపిల్లంటే అలా వుండాలి' అని ఇరుగుపొరుగు పొగుడుతుండగా అత్తవారింటికి వెళ్లారు.
  • అత్త పెట్టే ఆరళ్ళన్నీసహనంతో సీతలా భరించారు.
  • భర్తకి సినిమాలిష్టం లేదంటే మానేస్తారు..భర్త కోసం మీ కట్టు బొట్టు అభిరుచులన్నింటిని మార్చుకుంటారు.
  • నీకేం తెలీదమ్మా నువ్వూరుకో అని కొడుకులు,కూతుళ్ళు కసురుకుంటే అదో బిరుదులామీ అమాయకత్వానికి మురిసి పోతారు..
  • మా బామ్మ పాతకాలపు మనిషని మనవడు పరిచయం చేస్తుంటే అదో క్వాలిఫికేషన్ అనుకుంటారు.
ఇవన్నీ మీరు చేయలేదా అయితే
"మీరు
మంచి అమ్మాయి కాదు -- యండమూరి వీరేంద్రనాథ్
"

ప్రతి మనిషి ముఖ్యంగా ఆడవాళ్ళు తనను అందరు మంచి అనుకోవాలని కోరుకుంటారు,
దానికోసం ఎంతగానో తాపత్రయపడతారు..
ఇంతమందితో మంచి అనిపించుకోవటానికి మీరెంత కోల్పోయారు?
ఇంతకీ మీరెవరితో మంచి అనిపించుకోవాలి అనుకుంటున్నారు?
దానికోసం మీరు చెల్లించుకోవాల్సిన మూల్యం ఏమిటి?
మనం మంచి అనిపించుకోవాల్సింది మన "మనస్సుతో"
ఇంత ఆనందాన్ని జీవిత కాలం పాటు "నాకు ఇచ్చిన ఈ అమ్మాయిలో నేనుండటం నా అదృష్టం"
అని మన మనస్సు అనుకోవాలి అంతే కాని -
తల్లిదండ్రులు,భర్త,పిల్లలు,అత్తామామలు,మనవళ్ళు కాదు..
అలాంటి ఆరోగ్యకరమైన ఆనందాన్నే "వ్యక్తిత్వము" అంటారు.

అందుకే ఎప్పుడు ఇతరులతో మంచి అనిపించుకోవాలని కాకుండా మన కోసం,
మన సంతోషం కోసం కూడా మనం బతకాలి
బలమైన వ్యక్తిత్వం అంటే సున్నితత్వాన్ని కోల్పోవటం కాదు.
మెటీరియలిస్ట్ కూడా కొబ్బరాకుని,నీహారికా బిందు సందోహాల్ని చూస్తూ పరవశించి పోవచ్చు..
ఎదుటి వాళ్ళు మనల్ని కఠిన మనస్కులని అనుకోవచ్చు కానీ
మీకు సంబంధినంతవరకు మీరు సున్నిత మనస్కులు
ప్రతి చిన్న ఆనందానికి,స్పందనకి ఆహ్లాదంతో పరవశించి పోతారు
సున్నితత్వం అంటే చిన్న చిన్న విషయాలకి బాధపడటం,కష్టాలకి ఏడవటం కాదు,
చిన్న విషయాలకి కూడా ఆనందపడటం భావకులుగా ఉంటూ కూడా మెటీరియలిస్ట్ లుగా ఉండొచ్చు..
ఇలా వుండటం వలన మీరు మంచి అమ్మాయి కాకపోవచ్చు కానీ మంచి వ్యక్తిత్వం వున్న అమ్మాయి.

యండమూరి రాసిన మీరు మంచి అమ్మాయి కాదు!.. పుస్తకం నాకు నచ్చే పుస్తకాల్లో ఒకటి.


ఇలాంటి అర్ధంతోనే ఈ మధ్య వచ్చిన Mr.పర్ ఫెక్ట్ సినిమాలో రావుగారి అబ్బాయి పాట కూడా బాగుంది.
Be what's you wanna be
Do what's you wanna do
Say what's you wanna say

ఎవరేమి సలహాలు చెప్పినా ఎవరేమి అన్నా మనకు ఏమి కావాలో మనం తెలుసుకోలేకపోతే
లైఫ్ అంతా నరకం అంటూ అనంత శ్రీరాం రాసిన ఈ పాట బాగుంటుంది.

రావుగారి అబ్బాయి యాక్టర్ అవ్వాలన్నాడు
కానీ వాళ్ళ బాబేమో డాక్టర్నే చేసాడు
పైసలెన్నోవస్తున్నాపేషంట్ లా ఉంటాడు
సూపర్ స్టార్ అవ్వాల్సినోడు
సూది మందు గుచ్చుతున్నాడు

నీకు నచ్చింది చెయ్యకుంటే...లైఫులో యాడుంది కిక్కు
నిన్నే నువ్వు నమ్మకుంటే...నీకింక ఎవడు దిక్కు

be what's you wanna be
do what's you wanna do
say what's you wanna say
లేదంటే లైఫ్ అంతా నరకం

నిజమే రా ఏదో నిన్నుఫాలో
అవడము వల్ల ఇలా ఉన్నాను కానీ
లేకపోతే ఆ లక్ష్మిగారి అమ్మాయిలా
లైఫులో లైఫే లేకుండా పోయేదిరా బాబూ

లక్ష్మిగారి అమ్మాయి...బాగుంటుందా??
ముందు మేటర్ వినరా సన్నాసి
లక్ష్మిగారి అమ్మాయి డాన్సర్ అవ్వాలనుకుంది
కానీ వాళ్ళ అమ్మేమో పెళ్లి చేసి పంపేసింది
వందకోట్ల ఆస్తున్నావంటిట్లోనే ఉంటాది
గజ్జె కట్టాలనుకున్నది గరిట పట్టుకున్నాది

ఎవడో చెప్పింది చేస్తుంటే ...లైఫులోయాడుంది కిక్కు
ఎప్పుడు నువ్వే సర్దుకుపోతే ... నీకింక ఎవడు దిక్కు

be what's you wanna be
do what's you wanna do
say what's you wanna say
లేదంటే లైఫ్ అంతా నరకం

మన జెనరేషన్ కే కాదురా
మన ముందు జెనరేషన్ కి కుడా ఇదే టార్చర్
అంత ఎందుకు మన ... శ్రీనుగాడి బాబాయి...
శ్రీనుగాడి బాబాయి లీడర్ అవ్వాలన్నాడు
కానీవీడి తాతేమో ప్లీడర్ ని చేశాడు
కేసువాడి వైపున్నా ఫేసుమాడినట్టుంటాడు
జిందాబాద్ వినాల్సినోడు జడ్జ్ ముందు తల వంచాడు

నువ్వనుకున్నది చెప్పకుంటే .. లైఫులో యాడుంది కిక్కు
నీలో నువ్వే గింజుకుంటే .. నీకింక ఎవడు దిక్కు

be what's you wanna be
do what's you wanna do
say what's you wanna say
లేదంటే లైఫ్ అంతా నరకం

రేయ్ పెద్దవాళ్ళు చెబుతారు పక్కనోళ్ళు చెబుతారు
తప్పులేదు బాసూ వాళ్ళకు తోచిందే చెబుతారు
నువ్వు కోరుకుందేంటో . నీకు ఏది సూటవుతుందో
అర్థమయ్యేలా చెప్పకుంటే.. వాళ్ళు మాత్రం ఏం చేస్తారూ

మనమే క్లియర్ గ లేకపోతే ... అక్కడే వస్తుంది చిక్కు
లేని పోని భయాలు పెట్టుకుంటే...తర్వాత నీకు చిక్కు...

be what's you wanna be
do what's you wanna do
say what's you wanna say
లేదంటే లైఫ్ అంతా నరకం





Related Posts Plugin for WordPress, Blogger...