కొత్త పాళీ గారు ముందుగా నా బ్లాగ్ లో ఇళయరాజా టాప్ 25 లిస్ట్ పొస్టింగ్ గురించి మీ కామెంట్స్ లో ప్రస్తావించినందుకు చాలా థాంక్స్.
మీ బ్లాగ్ లో 'మూడు ప్రభంజనాలు' అన్న పోస్ట్ కి నాకు తోచిన రీతిలో నా అభిప్రాయాన్ని పోస్ట్ చేస్తున్నాను.
మీరు చెప్పిన ఈ ముగ్గురు వ్యక్తులను నేను కూడా అభిమానిస్తాను.
యండమూరి వీరేంద్రనాధ్
ఈయన రచనల్లో కొన్ని నాకు నచ్చుతాయి.
కొంతమంది రచయిత్రిల్లాగా అమ్మాయిలు కలల రాకుమారుడికోసం ఎదురు చూస్తూ ఆమెకి వచ్చే సమస్యలకి పరిష్కారం కోసం హీరో మీద ఆధారపడే వ్యక్తిగా కాకుండా వ్యక్తిత్వం వున్న స్త్రీ పాత్రలు ఈయన రచనల్లో చాలా వున్నాయి ఆఖరిపోరాటం లో ప్రవల్లిక పాత్రలాగా.
కాసనోవా 99 దెశం కోసం పొరాడే వ్యక్తులని న్యాయం, ధర్మం, నీతి ఎలా కాపాడాయో తెలిపే ఈ నవల నాకు చాలా నచ్చింది.
నాకు నచ్చిన మరొక పుస్తకం మీరు మంచి అమ్మాయి కాదు.
ఇతరులతో మంచి అనిపించుకోవటానికి ఆడవాళ్ళు వాళ్ళ వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు అని చాలా చక్కగా చెప్పారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి
ప్రస్తుతం సినిమాల్లో వస్తున్న పాటలు ఇప్పుడు వింటే ఇంకాసేపటికి మర్చిపోతున్నాం.కొన్ని పదాలకి అర్ధం కూడా ఏమిటో తెలియని పరిస్తితి కానీ సిరివెన్నెల గారు రచించిన ఎన్నో పాటలు ఇప్పటికీ కొంచెం వినగానే మిగిలిన పాటంతా గుర్తుకు వచ్చేలా ఉంటాయి ఆయన పాటలు.
ఈ పాట నాకు చాలా ఇష్టం.మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట ఇది.
పాటని మించి హోరెత్తే సంగీతం కాకుండా తన సంగీతంతో పాటకి ప్రాణం పోసే సంగీత దర్శకుడు ఇళయరాజా.
మనసుకు హత్తుకునే సంగీతం ఇళయరాజా గారి సొంతం.
యండమూరి వీరేంద్రనాథ్
సిరివెన్నెల సీతారామ శాస్త్రి
ఇళయరాజా
రాజి
మీ బ్లాగ్ లో 'మూడు ప్రభంజనాలు' అన్న పోస్ట్ కి నాకు తోచిన రీతిలో నా అభిప్రాయాన్ని పోస్ట్ చేస్తున్నాను.
మీరు చెప్పిన ఈ ముగ్గురు వ్యక్తులను నేను కూడా అభిమానిస్తాను.
యండమూరి వీరేంద్రనాధ్
కొంతమంది రచయిత్రిల్లాగా అమ్మాయిలు కలల రాకుమారుడికోసం ఎదురు చూస్తూ ఆమెకి వచ్చే సమస్యలకి పరిష్కారం కోసం హీరో మీద ఆధారపడే వ్యక్తిగా కాకుండా వ్యక్తిత్వం వున్న స్త్రీ పాత్రలు ఈయన రచనల్లో చాలా వున్నాయి ఆఖరిపోరాటం లో ప్రవల్లిక పాత్రలాగా.
కాసనోవా 99 దెశం కోసం పొరాడే వ్యక్తులని న్యాయం, ధర్మం, నీతి ఎలా కాపాడాయో తెలిపే ఈ నవల నాకు చాలా నచ్చింది.
నాకు నచ్చిన మరొక పుస్తకం మీరు మంచి అమ్మాయి కాదు.
ఇతరులతో మంచి అనిపించుకోవటానికి ఆడవాళ్ళు వాళ్ళ వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు అని చాలా చక్కగా చెప్పారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి
ప్రస్తుతం సినిమాల్లో వస్తున్న పాటలు ఇప్పుడు వింటే ఇంకాసేపటికి మర్చిపోతున్నాం.కొన్ని పదాలకి అర్ధం కూడా ఏమిటో తెలియని పరిస్తితి కానీ సిరివెన్నెల గారు రచించిన ఎన్నో పాటలు ఇప్పటికీ కొంచెం వినగానే మిగిలిన పాటంతా గుర్తుకు వచ్చేలా ఉంటాయి ఆయన పాటలు.
అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది ఉందా కరిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే నది నడకలకు
మరి మరి ఉరికే మది తలపులకు
నా కోసమే చినుకై కరిగి ఆకాశమే దిగదా ఇలకు
నా సేవకే సిరులే చిలికి దాసోహమే అనదా వెలుగు
ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు
కళలను తేవా నా కన్నులకు
మెలికలు తిరిగే నది నడకలకు
మరి మరి ఉరికే మది తలపులకు
నా కోసమే చినుకై కరిగి ఆకాశమే దిగదా ఇలకు
నా సేవకే సిరులే చిలికి దాసోహమే అనదా వెలుగు
ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు
కళలను తేవా నా కన్నులకు
ఈ పాట నాకు చాలా ఇష్టం.మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట ఇది.
చక్రవర్తికీ వీధి భిక్షగత్తెకీ బందువవుతాననీ అంది మనీ మనీ
అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు ఐన అన్నీ అంది మనీ మనీ
అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు ఐన అన్నీ అంది మనీ మనీ
డబ్బుకి మనుషుల జీవితాలలో వున్న స్థానాన్ని తెలియచేస్తుంది ఈ పాట
జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత వుంటే
నడకల్లో తడబాటైన నాట్యం అయిపోద
రేయంత నీ తలపులతో ఎర్రబడే కన్నులు వుంటే
ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా
నువ్వే తన ఐదోతనమని నీకై నోచే నోముంటే
నిత్యం నీ జీవితమంతా పచ్చని పంటవదా
తానే నీ పెదవులపై చిరునవ్వై చిలికే ప్రెముంటే
ఆ తీపికి విషమైనా అమ్రుతమే ఐపోదా

ప్రతి మనిషికీ తనను ప్రాణంగా ప్రేమించే మనిషి వుండటం ఎంత ముఖ్యమో ఈ పాట తెలియచేస్తుంది.
ఇళయరాజా
నాకు ఎక్కువగా వినాలనిపించే పాటల్లో ఇళయరాజా గారివే ఎక్కువగా ఉంటాయి.పాటని మించి హోరెత్తే సంగీతం కాకుండా తన సంగీతంతో పాటకి ప్రాణం పోసే సంగీత దర్శకుడు ఇళయరాజా.
మనసుకు హత్తుకునే సంగీతం ఇళయరాజా గారి సొంతం.
యండమూరి వీరేంద్రనాథ్
సిరివెన్నెల సీతారామ శాస్త్రి
ఇళయరాజా
వీళ్ళ ముగ్గురు ఎందరి జీవితాలను ప్రభావితం చేసారు అన్న విషయం పక్కనపెడితే ప్రతి మనిషి జీవితంలో మంచిని ఎక్కువగా గుర్తు పెట్టుకుంటారు, ఇష్టపడతారు అని నా అభిప్రాయం.
అది సాహిత్యం కావచ్చు ,సంగీతం కావచ్చు మనసుకు హత్తుకునే విషయాలు ఏవయిన కలకాలం మనసులో చెరగని ముద్ర వేస్తాయనేది మాత్రం వాస్తవం.
అది సాహిత్యం కావచ్చు ,సంగీతం కావచ్చు మనసుకు హత్తుకునే విషయాలు ఏవయిన కలకాలం మనసులో చెరగని ముద్ర వేస్తాయనేది మాత్రం వాస్తవం.
రాజి