Act of God
An event that directly and exclusively results from the occurrence of natural causes that could not have been prevented by the exercise of foresight or caution; an inevitable accident.
మనిషి ముందు చూపుతో కనిపెట్టలేని,ముందు జాగ్రత్తతో ఆపలేని సంఘటనలని,ప్రమాదాలని ఉదాహరణకి వరదలు,భూకంపాలు,సునామీ లాంటి అనేక ప్రకృతి వైపరీత్యాలని Act Of God అంటారు. ఇన్సూరెన్స్ కంపెనీలు నష్టపరిహారం చెల్లించకుండా తప్పుకోవటానికి కొన్ని సందర్భాల్లో "Act Of God" Law ని ఉపయోగిస్తుంటారు.
ఈ Act Of God గురించి తీసిన హిందీ సినిమా "OH My God". పరేష్ రావల్, అక్షయ్‌కుమార్, సోనాక్షి సిన్హా, మిథున్ చక్రవర్తి నటించిన ఈ సినిమాలో పరేష్ రావల్ (కాంజీలాల్ మెహతా )పరమ నాస్తికుడు. ముంబయి చోర్ బజార్ లో దేవతా మూర్తులు,పూజా సామగ్రి అమ్మే ఒక వ్యాపారి. దేవుడంటే నమ్మకం లేకపోయినా దేవుడికి సంబంధించిన సామాగ్రిని భక్తులకు తనకి ఇష్టమైన ధరలకు అమ్ముతూ ఉంటాడు. దేవుడే లేడని దైవభక్తిని, భక్తులను ఎగతాళి చేస్తుంటాడు. అతని భార్య సుశీల దైవభక్తురాలు.
కృష్ణాష్టమి రోజు పరేష్ రావల్ కొడుకు ఉట్టి కొట్టే ఫంక్షన్ లో ఆడటం చూసి అక్కడికి వెళ్లి కొడుకుని ఆపి,పక్కనే ఉన్న మైక్ లాక్కుని అన్ని ఆలయాల్లో కృష్ణుడు పాలు,వెన్న తాగుతున్నాడని ,ఒక్క గంట మాత్రమే ఈ అవకాశం ఉంటుందని చెప్పగానే అప్పటిదాకా అక్కడున్న జనమంతా ప్రసంగం చెప్తున్న స్వామీజీని ,ఉట్టిని వదిలేసి కృష్ణుడి మందిరాలకి పరుగులు తీస్తారు. దీంతో ఆగ్రహించిన స్వామీజీ నిన్ను దేవుడు శిక్షిస్తాడని శపిస్తాడు. ఇలాంటి శాపాలకి భయపడనని ఇంటికి వచ్చిన కాసేపటికే చోర్ బజార్ లో భూకంపం వలన పరేష్ రావల్ షాప్ ఒక్కటే కూలిపోయిందని టీవీలో న్యూస్ వస్తుంది.
భార్యా.బంధువులు అందరు నువ్వు దేవుడిని ఎగతాళి చేసినందుకు ఆ శాపం వలనే ఇలా అయ్యిందని తిడుతూ బాధ పడుతున్నా అవేమీ లెక్క చెయ్యకుండా కూలిపోయిన శిధిలాల్లో ఇన్సూరెన్స్ పాలసీ వెతికి తీసుకుని ఇన్సూరెన్స్ ఆఫీస్ కి వెళ్ళిన పరేష్ రావల్ కి అక్కడ ఆఫీసర్ భూకంపం Act Of God వలన అయ్యింది కాబట్టి కంపెనీ నష్టపరిహారం ఇవ్వదు అంటాడు. పరేష్ రావల్ లో అప్పటిదాకా లేని భయం,బాధ కనపడుతుంది.ఇన్సూరెన్స్ ఆఫీసర్ ని చితక్కొట్టి,నాలో కూడా దేవుడే ఉన్నాడు కదా దేవుడే కొట్టాడనుకో అని చెప్పి వచ్చేస్తాడు.
ఇంటికి వచ్చాక బాగా ఆలోచించి ఈ నష్టం దేవుడి వలన జరిగింది కాబట్టి దేవుడి మీద కోర్టులో దావా వేస్తానని కోర్టుకి వెళ్తాడు. అక్కడ లాయర్లు ఇతని వింత మాటలు విని మావల్ల కాదంటూ పారిపోతారు. అప్పుడు లాయర్ ఓంపురి ఈ కేస్ నేను చేస్తానని దేవుడికి ప్రతినిధులుగా చెప్పుకునే కొందరు ప్రముఖ స్వామీజీలకి నోటీస్ లు పంపుతాడు.దేవుడు మాతో మాట్లాడతాడు, మాకు భగవంతుడికి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు కాబట్టి భగవంతుడి తరపున నష్టపరిహారం కూడా మీరే చెల్లించాలని తన కేస్ తనే వాదించుకుంటాడు పరేష్ రావల్ .
ఇతని ఆరోపణలు సమంజసమేనని భావించిన జడ్జ్ కేస్ విచారణకి స్వీకరించగానే ఇలాగే Act Of God వలన నష్టపోయిన వాళ్ళందరూ కూడా కోర్టుకి వెళ్తారు. దీంతో స్వామీజీలు,మాతలు,అన్ని మతాలకు చెందిన మతాధిపతుల ఆగ్రహానికి గురవతాడు. వారి భక్తులు ఆగ్రహంతో పరేష్ రావల్ మీద దాడి చేస్తారు.సరిగ్గా సమయానికి అక్షయ్ కుమార్ వచ్చి ప్రమాదంలో ఉన్న పరేష్ రావల్ ని తన బైక్ మీద ఎక్కించుకుని కాపాడతాడు. ఇంటిమీదకి కూడా వెళ్లి భార్యా బిడ్డల మీద కూడా దాడి చేయటంతో అతన్ని వదిలి అందరూ వెళ్ళిపోతారు.
చివరికి ఒంటరిగా మిగిలిన పరేష్ రావల్ ఇంటికి కృష్ణ వాసుదేవ్ యాదవ్ (అక్షయ్ కుమార్) గా వచ్చిన గోపాలుడు (భగవంతుడు)నాస్తికుడైన పరేష్ రావల్ తో భగవద్గీత, ఖురాన్, బైబిల్ అన్నీ చదివించి భగవద్గీతలోని సృష్టించేదీ భగవంతుడే ,నాశనం చేసేది భగవంతుడే అన్న మాటతో కోర్టు కేస్ గెలిపిస్తాడు..
భగవంతుడు ప్రతి మనిషిలో ఉంటాడు కానీ మేమే దేవుడి ప్రతినిధులమని చెప్పుకుని,దేవుడి పేరుతో వ్యాపారం చేస్తూ, విలాసాలని అనుభవిస్తున్న స్వామీజీలు,బాబాలు ఇప్పడు లోకంలో దేవుడి కంటే ఎక్కువయ్యారు. అలాంటి వాళ్ళ గురించి,వాళ్ళని గుడ్డిగా నమ్మి,నష్టపోయే జనం గురించి సంధించిన వ్యంగ్యాస్త్రమే ఈ సినిమా. కొన్ని విషయాలు వాస్తవానికి విరుద్దంగా ఉన్నా కాసేపు సరదాగా చూడటానికి బాగుంది,దేవుడిని నమ్మే భక్తులకు సంతోషం కలిగిస్తుందీ సినిమా.
దైవారాధన, మానవశక్తి రెండు కలిస్తేనే కార్యసాధన సాధ్యమంటాడు భగవంతుడు. ఏ కులమైనా,మతమైనా భగవంతుడు ప్రతి మనిషిలోనూ ఉంటాడు.తన భక్తులైనా కాకపోయినా ఈ భూమి మీద జీవరాశి నంతటినీ కాపాడేది భగవంతుడే.. నమ్మిన వారిని వెన్నంటి కాపాడే సర్వాంతర్యామి సర్వకాల సర్వావస్థల్లోనూ ఏ రూపంలోనైనా అవతరిస్తాడని భక్తుల నమ్మకం.ఆ భగవంతుడి మరో రూపం ఈస్వామీజీలు, గురూజీలే ఐతే అందరికీ మంచిదే.
అలాగే ప్రకృతి వైపరీత్యాలు Act Of God అని అనకూడదేమో ఎందుకంటే మనిషి తన అవసరాల కోసమో,స్వార్ధం కోసమో చేస్తున్న కొన్ని పనుల కారణంగానే ఈ భూకంపాలు, సునామీలు, వరదల లాంటి భీభత్సాలు సంభవిస్తున్నాయని, దేవుడికి భక్తుడికి మధ్య ఉండాల్సింది భక్తి అనే వంతెన మాత్రమే కానీ బాబాలు, స్వామీజీలు,గురువులనే దళారులు కాదు అనేది అందరూ అంగీకరించాల్సిన నిజం...
ఇది సినిమా కాబట్టి సరిపోయింది కానీ నిజంగా దేవుడి ప్రతినిధులమని చెప్పుకునే కొందరు స్వామీజీలని చిన్న మాట అన్నా తట్టుకోలేని వారి అతి విదేయ భక్తులు,శిష్యులు చాలా మందే ఉంటారనుకుంటాను. ఇప్పటి రోజుల్లో అలాంటి స్వామీజీలు, గురువులని ఈ సినిమాలో లాగా చేస్తే "అనుకోకుండా ఒకరోజు" సినిమాలో ఛార్మి లాగా "నీడల్లే తరుముతు ఉంది" అని పాడుకోవాల్సి వస్తుందేమో..
ఇంతకీ ఇప్పుడు ఈ సినిమా ఎందుకు గుర్తొచ్చిందంటే తెలుగులో కూడా వెంకటేష్,పవన్ కళ్యాణ్ హీరోలు గా "గోపాలా గోపాలా" పేరుతో ఈ సినిమా రాబోతుంది. మన సినిమా ఎలా ఉంటుందో త్వరలోనే చూద్దాం ..
'వసతి వాసయతీతి వా వాసుదేవః'
మనలో తానుగా ఉండేవాడూ,తాను మనలో ఉన్న కారణంగా
మనల్ని జీవించి ఉండేలా చేసేవాడు ఆ భగవంతుడే..
మనలో తానుగా ఉండేవాడూ,తాను మనలో ఉన్న కారణంగా
మనల్ని జీవించి ఉండేలా చేసేవాడు ఆ భగవంతుడే..