ఆశ్వయుజ విదియ
ఈరోజు అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరిస్తారు.ఐదు ముఖాలతో,వరద అభయ హస్తాలు ధరించి, కమలాసీనురాలుగా దర్శనమిస్తుంది. గాయత్రీ మాత సకల మంత్రాలకు మూలమైన శక్తి,వేదమాత.ముక్తా విద్రుమ హేమ నీల ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచాముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన అధిష్టాన దేవత.గాయత్రీ మంత్రాన్ని జపిస్తే కీర్తి,దివ్య తేజస్సు, సకల సంపదలు ,సమస్త శుభాలు కలుగుతాయి..సకల దేవతలకు నివేదన చేయబోయే నైవేద్యాలను ముందుగా గాయత్రీ మంత్రం తో నివేదన చేస్తారు.
.
ఓం భూర్ భుహస్వహ
తత్స వితుర్వ రెణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్!!మా బుద్ధులను ప్రేరేపించునట్టి,జగత్కారణమైనట్టి
సూర్య భగవానుని సర్వోత్కృష్టమైన తేజస్సును
మేము ధ్యానించుచున్నాము.
గాయత్రీమంత్రం