పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..
Inspiring Quotes and Songs Collection లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Inspiring Quotes and Songs Collection లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, ఆగస్టు 2015, ఆదివారం

Where your FAITH is, I am there



Where do you search me? 

I am with you
Not in pilgrimage, nor in icons
Neither in solitudes
Not in temples, nor in mosques
Neither in Kaba nor in Kailash
 
I am with you O man
I am with you
Not in prayers, nor in meditation
Neither in fasting
Not in yogic exercises
Neither in renunciation
Neither in the vital force nor in the body
Not even in the ethereal space
Neither in the womb of Nature
Not in the breath of the breath
Seek earnestly and discover In 
but a moment of search Says 

Kabir, Listen with care
Where your FAITH is, I am there.

༺ Khalil Gibran ༻


9, జనవరి 2015, శుక్రవారం

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..




   
"ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను 
దీక్షకన్న సారధెవరురా?"

"నింగి ఎంత గొప్పదైన రివ్వుమన్నగువ్వపిల్ల 
రెక్క ముందు తక్కువేనురా"

''నొప్పిలేని నిమిషమేది జననమైన మరణమైన
జీవితాన అడుగు అడుగునా''


విశ్రమించ వద్దు ఏ క్షణం .. విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా.. 

అద్భుతమైన సాహిత్యంతో మనసుని ఉత్తేజ పరిచే ''సిరివెన్నెల'' గారి
ఈ పాట నాకు చాలా ఇష్టమైన Inspiration Song ..

నాకు ఇష్టమైన పాటని నాకు నచ్చిన చిత్రాలతో చేసిన వీడియో ..

 ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి




ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏ క్షణం .. విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి

నొప్పిలేని నిమిషమేది జననమైనా మరణమైన
జీవితాన అడుగు అడుగునా

నీరసించి నిలిచిపోతే నిమిషమైనా నీది కాదు
బ్రతుకు అంటే నిత్య ఘర్షణ
దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది
ఇంతకన్నా సైన్యముండునా
ఆశ నీకు అస్త్రమౌను .. శ్వాస నీకు శస్త్రమౌను
దీక్ష కన్నా సారథెవరురా

నిరంతరం ప్రయత్నమున్నదా .. నిరాశకే నిరాశ పుట్టదా
నిన్ను మించి శక్తి ఏది ..నీకె నువ్వు బాసటయితే

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏ క్షణం .. విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి

నింగి ఎంత గొప్పదైనా రివ్వుమన్న గువ్వపిల్ల
రెక్క ముందు తక్కువేనురా
సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేప పిల్ల
మొప్ప ముందు చిన్నదేనురా

పిడుగు వంటి పిడికిలెత్తి ఉరుము వల్లె హూంకరిస్తే
దిక్కులన్నీ ప్రిక్కటిల్లురా
ఆశయాల అశ్వమెక్కి ..అదుపులేని కదను తొక్కి
అవధులన్నీ అధిగమించరా

త్రివిక్రమా పరాక్రమించరా .. విశాల విశ్వమాక్రమించరా
జలధి సైతమార్పలేని జ్వాల ఓలె ప్రజ్వలించరా

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏ క్షణం .. విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి



సినిమా  -  పట్టుదల (1992)
సంగీతం - ఇళయరాజా 
లిరిక్స్ - సిరివెన్నెల 
గానం - K.J. ఏసుదాస్

10, అక్టోబర్ 2012, బుధవారం

ఆరంభమౌ ప్రచండమైన యుద్ధమే ..




ఏ అడ్డుగోడనైనా తొలగించే
ఏ పర్వతాన్నైనా పెకిలించే
ఏ సాగరాన్నైనా మధించే
ఏ ఆకాశాన్నైనా అధిగమించే
ఏ లక్ష్యాన్నైనా భేధించే
ఏ అలవాటునైనా శాసించే శక్తి మీలోనే నిగూఢంగా దాగి ఉంది
మనస్పూర్తిగా ప్రయత్నిస్తే లక్షలమందికి స్ఫూర్తిఅవుతారు 
మీరు గెలిస్తే కోట్లాది మందికి వెలుగవుతారు
అనుకున్నది  సాధిస్తే చరిత్ర పుటల్లో చేరిపోతారు 

చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవటం కంటే ఒక చిన్న దీపాన్ని వెలిగించి ,ఆ చీకటిని తొలగించటం వివేకం.జీవితం ఒక ప్రయాణం మాత్రమే  గమ్యం  కాదు..నిన్నటి నుండి పాఠాలు నేర్చుకుంటూ, ఈ రోజు సంతోషంగా  జీవిస్తూ, రేపటి కోసం ఆశను పెంచుకోవటమే జీవితం.మనలో ఉన్న అనంతమైన శక్తిని తెలుసుకుని,సాధించాలని సంకల్పించి సాధించి చూపించటమే ఆత్మస్థైర్యం.

అపజయాలు ఎదురైనప్పుడు క్రుంగిపోవటం,బాధపడటం సహజం కానీ ఆ ఓటమిని విజయంగా మార్చినవారే విజేతలు..ఈ ప్రయత్నంలో తమకుతాము స్ఫూర్తి పొందేది కొందరైతే..గొప్పవాళ్ళ మాటలు,సూక్తుల ద్వారా స్ఫూర్తి పొందేది కొందరు..నాకు కూడా ఇన్స్పిరేషన్ కొటేషన్స్,పాటలు,చిత్రాలు సేకరించటం, చదవటం,వినటం ఇష్టం.

నేను ఈ మధ్య చూసిన  ఒక మంచి ఇన్స్పిరేషన్ సాంగ్ నాకు చాలా నచ్చింది."గులాల్"  హిందీ సినిమాలోని  ."Aarambh hai prachand"  పాటను   Lyricist, Singer, Stage Performer   "విప్లవ సేన్.అప్పరాజు" గారు స్వయంగా తెలుగు లిరిక్స్ రాసి,పాడిన ఈ పాట ఇన్స్పిరేషన్ సాంగ్స్ లో ఒక కొత్త ప్రయోగం అని చెప్పొచ్చు.

ThankYou  "Viplov Sen. Apparaju"  గారు.. 
మీరు మరెన్నో మంచి  స్ఫూర్తిదాయకమైన పాటలను అందించాలని  కోరుకుంటూ అభినందనలు..

ఆరంభమౌ ప్రచండమైన యుద్ధమే 





ఆరంభమౌ ప్రచండమైన యుద్ధమే 
అఖండమైన శంఖారావాలాపనే పూరించుదాం
జాతి ప్రీతి గాంచె ఖ్యాతి పదములోన యుద్దరీతి
నీతిగానే విజయము సాధించుదాం
తుది సమరమే ఆరంభం  

తలచినంత ప్రాణార్పణ తెగువ తేల్చు సంఘర్షణ
సమరానికి సిద్దమెప్పుడు వీరుడు
కృష్ణ గీత సారమిది దైవ శాసనాల విధి 
యుద్ధానికి జంకడెపుడు  యోధుడు

అనునయులే ఎదిరించిన సహచరులే వారించిన
ధర్మానికి బద్ధుడెపుడు ధీరుడు
 తలవంచని స్వభావాలు రాజసమే ఆనవాలు
ఒడిదుడుకుల కెదురేగే తత్వము 
అలుపెరుగని సాహసాల ఎగరేయి ఇక బావుటాలు
నలుదిక్కుల చాటు ఆధిపత్యము

 ఆరంభమౌ ప్రచండమైన యుద్ధమే 
అఖండమైన శంఖారావాలాపనే పూరించుదాం
జాతి ప్రీతి గాంచె ఖ్యాతి పదములోన యుద్దరీతి
నీతిగానే విజయము సాధించుదాం
తుది సమరమే ఆరంభం  ...

 అధైర్యవంతమా భావన శౌర్యవంతమా స్పందన 
ఓటమిదా ఆక్రందన ఎంచుకో  ..
నిలువరించి ఆవేదన దీక్షబూని చేయ్ సాధన 
ప్రతిఘటించి బలహీనత వదులుకో 

బ్రహ్మాండమంత నిలదీసిన  ఒంటరిగా వెలివేసిన 
సంకల్పం సడలకుండా నడుచుకో  
సమయమునే వృధాపరచు సుఖములకై పరితపించు 
హృది తలపుల సంకెలనే తెంచుకో  
ఉప్పెనలా బడబాగ్ని రక్తములో మరిగేట్టు 
పోరాటపు పౌరుషమే పెంచుకో 

ఆరంభమౌ ప్రచండమైన యుద్ధమే 
అఖండమైన శంఖారావాలాపనే పూరించుదాం
జాతి ప్రీతి గాంచె ఖ్యాతి పదములోన యుద్దరీతి
నీతిగానే విజయము సాధించుదాం
తుది సమరమే ఆరంభం  ...
తుది సమరమే ఆరంభం  ... 
 తుది సమరమే ఆరంభం  ... 

 concept - Screenplay - Direction 
Editing  - Lyrics - Singing 
By :
Viplov Sen. Apparaju 
  

 

11, జులై 2012, బుధవారం

♥♥ ప్యార్ ... ప్రేమ ... కాదల్ ...Love Anthem For World Peace ♥♥


మానవత్వాన్ని మించిన మతం లేదు.. మానవత్వం అంటే బాధల్లో ఉన్నవారి మీద జాలి చూపించటం,ఆపదలో వున్న వారిని ఆదుకోవటం,సాటి ప్రాణిని హింసించి మనం ఆనందించకపోవటం,కులమతాలకు,దేశ భాషలకు అతీతంగా మనుషులందరినీ ప్రేమించగలగటం...ప్రేమ అన్న పదానికి చాలా పరిమితమైన పరిధి అందరికీ వుంటుంది.

ప్రేమ ఇద్దరు ప్రేమికుల మధ్య మాత్రమే కాదు తన కుటుంబాన్ని,తన చుట్టూ వున్న మనుషుల్ని,జీవరాశిని ప్రేమించే వ్యక్తిత్వాన్నే మానవత్వం అంటాము. ప్రేమ ఇద్దరు లేదా కొందరు మనుషుల మధ్య మాత్రమే వుండదు... కొందరు దేవుడిని ప్రేమిస్తారు, కొందరు చేసే పనిని ప్రేమిస్తారు,కొందరు వస్తువులను,ఆస్తులను ప్రేమిస్తారు,కొందరు ఇష్టమైన భోజనాన్ని ప్రేమిస్తారు, ఇలా ప్రేమ అనేక రకాల "భావాల నిధి" అని చెప్పొచ్చు..

సాటి మనిషికి సహాయం చేయటం,ప్రేమించటం అంటే మన ఆస్తిపాస్తులు,కుటుంబం అన్నిటినీ త్యాగం చేయాల్సిన అవసరం లేదు బాధలో వున్న మనిషికి చిన్న ఓదార్పు మాట చెప్పగలగటం, మన మాటలు,చేతల వల్ల సాటి మనిషికి ద్రోహం చేయకపోవటం కూడా మానవత్వమే. కానీ ప్రతి మనిషికీ తనకంటూ కొన్ని ఆలోచనలు వుంటాయి,తన జీవితంలో ఎవరికి ఏమి చెయ్యాలి,ఎవరికి తన ప్రేమను పంచాలి,ఎలా సమాజంలో మనుగడ సాగించాలి అనే విషయంలో ఎవరి పరిధులు వాళ్లకుంటాయి. మనుషులందరూ మదర్ థెరీసా లాగా సంఘ సేవకులు కాలేరు కానీ మానవత్వం వున్న మనుషుల్లాగా దయతో ఎదుటివారిని ఆదరించగలగాలి. ప్రేమ అనేది "మరొకరి సంతోషాన్ని చూసి ఆనందించగలగటం ".

ఒక్కోసారి నాకు అనిపిస్తుంది దేవాలయాలకు,స్వామీజీలకు లక్షలు లక్క్షలు పెట్టి బంగారు కిరీటాలు,తొడుగులు చేయించే అజ్ఞాత భక్తులు ఆ డబ్బేదో ఏదో ఒక అనాధాశ్రమానికో,పేదలకో ఇవ్వొచ్చు కదా,ఆ ఇచ్చిన విరాళాలను తీసుకున్న వారు సక్రమంగా ఖర్చు పెట్టొచ్చుకదా అని... కానీ మళ్ళీ నా మనసుకే అనిపిస్తుంది ఒకరి ఆలోచనలను నియంత్రించటానికి,నిర్ణయించటానికి మనకేమి హక్కుంది?? నా ఆలోచన నాకున్నట్లే ఎవరి రీజనింగ్ వాళ్ళకుంటుంది కదా అని.. "ఇంట గెలిచి రచ్చ గెలవమన్నట్లు" ఏదైనా మనం పాటించి ఎదుటివాళ్ళకి చెప్పటం మంచిది కదా..


"మనుషులంటే రాయిరప్పలకన్న కనిష్టం గానూ చూస్తావేల బేలా?
దేవుడెక్కడో దాగెనంటూ కొండకోనల వెతుకులాడేవేలా?
కన్ను తెరచిన కానబడడో? మనిషి మాత్రుడియందు లేడో?
యెరిగి కోరిన కరిగి యీడో ముక్తి?"
--గురజాడ

ఇప్పుడింతకీ నేను ఈ మానవత్వం, ప్రేమ అన్న విషయాల గురించి ఎందుకు చెప్తున్నానంటే మా తమ్ముడి ఫోన్ కి కాల్ చేస్తే కాలర్ టోన్ గా ఒక పాట వస్తుంది.. అది మన తెలుగు కాదు,తమిళ్ కాదు ఏదేదో వచ్చేస్తున్నాయి.. ఇదేంటా అని ఎన్నిసార్లు విన్నా పాట నాకు అర్ధం కాలేదు. అప్పుడు మా తమ్ముడిని అడిగితె చెప్పాడు అది తమిళ్ హీరో "శింభు" పాడిన "Love Anthem For World Peace" అన్న పాట ఆని చెప్పి, పాట చాలా బాగుందక్కా ,మీనింగ్ బాగుంది నువ్వు కూడా చూడు అని సాంగ్ లింక్ ఇచ్చాడు.

నాకు కూడా ఈ పాట నచ్చింది. ఈ మధ్య ధనుష్,నితిన్ ఇలా సినిమా హీరోలంతా పాటలు పాడేస్తున్నారు కదా అలాంటి ప్రయత్నమే "శింభు" కూడా చేశాడు. ప్రపంచంలోని వివిధ భాషల్లో ప్రేమ అనే పదాన్ని ఉపయోగించి, ప్రపంచవ్యాప్తమైన ప్రేమను, మానవత్వాన్ని కోరుకుంటూ,మనకు వున్న ఈ ఒక్క జీవితాన్ని ద్వేషంతో ,పగలు,ప్రతీకారాలతో వేస్ట్ చేసుకోవద్దని, "All We Need Is Love" అంటూ "శింభు" రాసి తానే స్వయంగా పాడి,27 December 2011 న రిలీజ్ చేసిన ఈ పాట బాగుంది...


♥♥ Love Anthem For World Peace ♥♥




dashuri dashuri
dashuri dashuri
salang salang
leifde leifde
las'ka las'ka

armastus armastus
rakkaus rakkaus
ag'api ag'api
lyubov lyubov

all we need is
love..aai..amour..amour
all we need is
love..aai..amour..amour

all we need is
love..aai..amour..amour
all we need is
love..aai..amour..amour..amour

love is full of energy
love is positivity
we don't need negativity
love to feel humanity

lets not cry and lets not try
hating,hurting and killing each other
we wont get another
life together
oh my brother

all we need is
pyaar..prema..kaadhal
all we need is
pyaar..prema..kaadhal..kaadhal

Music, Lyrics & Sung By
Simbu


All the following words denotes love in different languages.


♥Love - English
♥dashuri - Albanian
♥salang - Korean
♥leifde - Dutch
♥las'ka - Czech
♥armastus - Estonian
♥rakkaus - Finnish
♥ag'api - Greek
♥lyubov - Russian
♥Aai - Chinese
♥Amour - French/Spanish
♥Pyaar - Hindi
♥Prema - Telugu
♥Kaadhal - Tamil


15, మే 2012, మంగళవారం

జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం...


"వెలుగు పధకం" మహిళా సాధికారత కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్య మంత్రిగా వున్నప్పుడు ప్రవేశ పెట్టిన పధకం. ఈ పధకం ముఖ్య ఉద్దేశ్యం గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేద,పేద మహిళలను లక్షాధికారుల్ని చేయటం.. మహిళలను స్వయం సహాయక సంఘాలుగా, "సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ (SHG)" గా ఏర్పాటు చేసి,వాళ్లతో డబ్బులు పొదుపు చేయించి,కొంత బాంక్ ల ద్వారా అప్పు ఇప్పించి ఆ డబ్బుతో మహిళలకు స్వయం ఉపాధి కల్పించటం ఈ పధకం లక్ష్యం. దీని కోసం జిల్లా స్థాయి నుండి,గ్రామ స్థాయి దాకా సిబ్బందిని నియమించి వాళ్ళ ద్వారా ఈ పధకాన్ని అమలు చేసే వాళ్ళు..కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పధకం పేరు "ఇందిరా క్రాంతి పధం" గా మార్చారు.

ఇప్పుడు ఇంతకీ ఈ "వెలుగు పధకం" గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రాజెక్ట్ లో కొన్ని ప్రత్యేకతలు వున్నాయి...
మహిళలను మోటివేట్ చేస్తూ,వాళ్ళు సాధికారత సాధించేలా ప్రోత్సహించే పనిలో భాగం గా వాళ్లకి కొన్ని trainings నిర్వహిస్తారు. ఈ ట్రైనింగ్ క్లాసెస్ లో మొదటిది వాళ్లకు ఒక ప్రార్ధనా గీతం వుంటుంది. ఆ పాటను ఈ ప్రాజెక్ట్ CEO స్వయంగా రచించి,రూపకల్పన చేశారట. ఈ ప్రాజెక్ట్ ద్వారా వాళ్ళు ఎంతవరకు అనుకున్న లక్ష్యాన్ని సాధించారో, ఎంతమంది మహిళలు లక్షాధికారులు అయ్యారో తెలియదు కానీ... నాకు మాత్రం "వెలుగు ప్రార్ధనాగీతం "గా వాళ్ళు పిలుచుకునే ఇన్స్పిరేషన్ సాంగ్ చాలా నచ్చింది..

ఈ పాట నాకు ఈ వెలుగు ప్రాజెక్ట్ లో APM గా వర్క్ చేస్తున్న నా ఫ్రెండ్ ద్వారా తెలిసింది..
నా చిన్ని ప్రపంచం లో "ఇన్స్పిరేషన్ సాంగ్స్ కలెక్షన్" లో యాడ్ చేయాలనిపించింది..


జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం
స్వర్గమన్నదెక్కడున్నా నేలపైకి దించుదాం
జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం
స్వర్గమన్నదెక్కడున్నా నేలపైకి దించుదాం

గగనమెంత వురిమినా గిరికి చలనముండునా
గంగ పొంగిపొరలినా నేల భీతి చెందునా
ఆత్మబలం కూడగట్టి ... ఆకశాన్ని వంచుదాం
స్వర్గమన్నదెక్కడున్నా నేలపైకి దించుదాం

జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం
స్వర్గమన్నదెక్కడున్నా నేలపైకి దించుదాం

ఆకులన్నీ రాలినా వేసవి వెంటాడినా
చినుకు రాలకుండునా చిగురు వేయకుండునా
ఆశయాల నీరు పోసి ఆశలన్నీ పెంచుదాం
స్వర్గమన్నదెక్కడున్నా నేలపైకి దించుదాం

పేదరికం కసిరినా పెనుచీకటి ముసిరినా
వేలజనం మేలుకుంటే వేకువ రాకుండునా
అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం
స్వర్గమన్నదెక్కడున్నా నేలపైకి దించుదాం

జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం
స్వర్గమన్నదెక్కడున్నా నేలపైకి దించుదాం



12, మార్చి 2012, సోమవారం

"ఒక మనసుకు ఒక మనసని అనుకుంటే స్వర్గం "


"
మౌనమే నీ భాష మూగ మనసా" అంటూ..."బాధపడే సమయంలో మనసు భాష మౌనమని"
"
గుప్పెడు మనసు" సినిమాలో,
"కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు" అంటూ..."కళ్ళలో ఉన్న బాధ కళ్ళకే తెలుస్తుందని"
"
అంతులేని కధ" సినిమాలో ...
సగటు మనిషి జీవితంలోని కష్టనష్టాలను, ఆ కష్టానికి మనసు పడే వేదనను అద్భుతంగాఆవిష్కరించగల గొప్ప దర్శకుడు కే.బాలచందర్.హృదయ వేదనని మనసు పాటల్లో పలికించిన బాలచందర్ గారి సినిమాల్లో నాకు నచ్చిన మరొక సినిమా "ఇది కధ కాదు" .

ఈ సినిమాలో పాటలు అన్నీ బాగుంటాయి. ఇందులో ఒక పాట నేను కొత్తగా విన్నాను.
పాటలోని సాహిత్యం జీవితానికి అన్వయించి ఉంటుంది.
"ఒక మనసుకు ఒక మనసని అనుకుంటే స్వర్గం " అంటూ మొదలై
ప్రతి మాపూ ఒక రేపై తెరవాలి తలుపు
ఏ రేపో ఒక మెరుపై తెస్తుందొక మలుపు" అని
ముగిసే ఈ పాట వింటుంటే
ఇది కూడా ఒక ఇన్స్పిరేషన్ సాంగ్ అనిపించింది. నాకు నచ్చిన పాట.


తకధిమితక ధిమితకధిమి




తకధిమితక ధిమితకధిమి తకధిమి తక ధింధిం
జత జత కొక కధ ఉన్నది చరితైతే ఝం ఝం
తకధిమితక ధిమితకధిమి తకధిమి తక ధింధిం
జత జత కొక కధ ఉన్నది చరితైతే ఝం ఝం

ఒక ఇంటికి ముఖ ద్వారం ఒకటుంటే అందం
ఒక మనసుకు ఒక మనసని అనుకుంటే స్వర్గం
 
ఒక ఇంటికి ముఖ ద్వారం ఒకటుంటే అందం
ఒక మనసుకు
ఒక మనసని అనుకుంటే స్వర్గం


తకధిమితక ధిమితకధిమి తకధిమి తక ధింధిం
జత జత కొక కధ ఉన్నది చరితైతే ఝం ఝం

ఈ లోకమొక ఆట స్థలము ... ఈ ఆట ఆడేది క్షణమూ
 
లోకమొక ఆట స్థలము ... ఆట ఆడేది క్షణమూ
ఆడించు వాడెవ్వడైనా ... ఆడాలి ఈ కీలుబొమ్మా
 
ఆడించు వాడెవ్వడైనా ... ఆడాలి ఈ కీలుబొమ్మా

ఇది తెలిసీ తుది తెలిసీ ఇంకెందుకు గర్వం
తన ఆటే గెలవాలని ప్రతి బొమ్మకు స్వార్ధం
 
ఇది తెలిసీ తుది తెలిసీ ఇంకెందుకు గర్వం
తన ఆటే గెలవాలని ప్రతి బొమ్మకు స్వార్ధం


తకధిమితక ధిమితకధిమి తకధిమి తక ధింధిం
జత జత కొక కధ ఉన్నది చరితైతే ఝం ఝం

వెళ్తారు వెళ్ళేటి వాళ్ళు ... చెప్పేసెయ్ తుది వీడుకోలూ

ఉంటారు రుణమున్న వాళ్ళూ ... వింటారు నీ గుండె రొదలు
కన్నీళ్ళ సెలయేళ్ళు కాకూడదు కళ్ళు
కలలన్నీ వెలుగొచ్చిన మెలుకువలో చెల్లు

ఏనాడు గెలిచింది వలపూ ... తానోడుటే దాని గెలుపూ
 
ఏనాడు గెలిచింది వలపూ ... తానోడుటే దాని గెలుపూ
గాయాన్ని మాన్పేది మరుపు .
.. ప్రాణాల్ని నిలిపేది రేపూ 
గాయాన్ని మాన్పేది మరుపు ... ప్రాణాల్ని నిలిపేది రేపు

ప్రతి మాపూ ఒక రేపై తెరవాలి తలుపు
ఏ రేపో ఒక మెరుపై తెస్తుందొక మలుపు
ప్రతి మాపూ ఒక రేపై తెరవాలి తలుపు
ఏ రేపో ఒక మెరుపై తెస్తుందొక మలుపు


తకధిమితక ధిమితకధిమి తకధిమి తక ధింధిం
జత జత కొక కధ ఉన్నది చరితైతే ఝం ఝం
ఒక ఇంటికి ముఖ ద్వారం ఒకటుంటే అందం
ఒక మనసుకు ఒక మనసని అనుకుంటే స్వర్గం
 

సినిమా : ఇది కధ కాదు
డైరెక్టర్ : K.బాల చందర్
సంగీతం : M S విశ్వనాథన్
సింగర్ : S.P.బాలు


25, జనవరి 2012, బుధవారం

కలకానిది... విలువైనదీ...!


నాకు ఇష్టమైన మరొక ఇన్స్పిరేషన్ సాంగ్ "కలకానిది విలువైనదీ"
"వెలుగు నీడలు" సినిమాలోని ఈ పాటకు "శ్రీ శ్రీ" గారు రచించిన అద్భుతమైన సాహిత్యం
ఈ పాటను చిరస్థాయిగా మనస్సులో నిలిచేలా చేసింది.
సినిమాలో సావిత్రి భర్త జగ్గయ్య అనుకోని ప్రమాదంలో చనిపోతాడు.అప్పుడు ఆ దిగులుతో బాధపడుతున్న
సావిత్రిని ఓదారుస్తూ జీవితంలో కష్టాలు వస్తే వాటి గురించే బాధపడుతూ.. ఎంతో విలువైన జీవితాన్ని వ్యర్ధం చేసుకోకూడదని చెప్తూ, నాగేశ్వరరావు పాడే ఈ పాట అప్పడు... ఇప్పుడు ఒక ఆణిముత్యం.

పాటలో నాకు నచ్చే మహాకవి శ్రీ శ్రీ గారి inspirational words ...

"అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే "

"
ఏదీ
తనంత తానై నీ దరికి రాదు

శోధించి సాధించాలి అదియే ధీరగుణం"


కల కానిది విలువైనదీ
బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు
కల కానిది విలువైనదీ
బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు

గాలి వీచి పూవుల తీగ నేల వాలిపోగా
గాలి వీచి పూవుల తీగ నేల వాలిపోగా
జాలి వీడి అటులే దాన్ని వదిలివైతువా
చేరదీసి నీరు పోసి చిగురించనీయవా

కల కానిది విలువైనదీ
బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు

అలముకున్న చీకటిలోనే అలమటించనేలా
అలముకున్న చీకటిలోనే అలమటించనేలా
కలతలకే లొంగిపోయి కలువరించనేలా
సాహసమను జ్యోతినీ చేకొని సాగిపో

కల కానిది విలువైనదీ
బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు

అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే
అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే

ఏదీ తనంత తానై నీ దరికి రాదు
శోధించి సాధించాలి అదియే ధీరగుణం
కల కానిది విలువైనదీ
బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు
బ్రతుకూ ... బలిచేయకు





సినిమా: వెలుగు నీడలు (1961)
సంగీతం : పెండ్యాల నాగేశ్వర రావు
లిరిక్స్ : శ్రీ శ్రీ
గానం : ఘంటసాల


9, ఆగస్టు 2011, మంగళవారం

గోరంతదీపం కొండంత వెలుగు ... నా మరో ప్రయోగం..


నా బ్లాగ్ లో inspiration songs లో పెట్టటానికి గోరంతదీపం సినిమాలో "గోరంత దీపం కొండంత వెలుగు"
అనే పాట కోసం నెట్ లో వెతికాను కానీ కనిపించలేదు..
అందుకే ఎలాగు నాకు ఇష్టమైన పాటలు వీడియో మిక్సింగ్ చేయటం అలవాటే కాబట్టి నిన్నంతా ఆ పనిలో వుండి
మొత్తానికి సక్సెస్స్ అయ్యాను.
నాకిష్టమైన పాటను నాకిష్టమైన పిక్చర్స్ తో వీడియో మిక్సింగ్ చేసిన పాట

గోరంత దీపం కొండంత వెలుగు
చిగురంత ఆశ జగమంతా వెలుగు
By:Raaji



గోరంత దీపం కొండంత వెలుగు
చిగురంత ఆశ జగమంత వెలుగు

గోరంత దీపం కొండంత వెలుగు

చిగురంత ఆశ జగమంత వెలుగు

కరి మబ్బులు కమ్మే వేళ మెరుపు తీగే వెలుగు
కారు చీకటి ముసిరే వేళ వేగు చుక్కే వెలుగు

కరి మబ్బులు కమ్మే వేళ మెరుపు తీగే వెలుగు
కారు చీకటి ముసిరే వేళ వేగు చుక్కే వెలుగు

మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు
మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు
దహియించే బాధల మధ్యన సహనమే వెలుగు


గోరంత దీపం కొండంత వెలుగు
చిగురంత ఆశ జగమంత వెలుగు

కడలి నడుమ పడవ మునిగితే కడ దాకా ఈదాలి

కడలి నడుమ పడవ మునిగితే కడ దాకా ఈదాలి

నీళ్ళు లేని ఎడారిలో ...
నీళ్ళు లేని ఎడారిలో కన్నీళ్ళైన తాగి బతకాలి
నీళ్ళు లేని ఎడారిలో కన్నీళ్ళైన తాగి బతకాలి
ఏ తోడు లేని నాడు నీ నీడే నీకు తోడు
ఏ తోడు లేని నాడు నీ నీడే నీకు తోడు

జగమంతా దగా చేసినా చిగురంత ఆశను చూడు

చిగురంత ఆశ జగమంత వెలుగు
గోరంత దీపం కొండంత వెలుగు

చిగురంత ఆశ జగమంత వెలుగు


సినిమా:గోరంతదీపం
లిరిక్స్:c.నారాయణ రెడ్డి


29, జులై 2011, శుక్రవారం

కలలు మారాలి నిజములా... నిజములా...


ఈ మధ్య చూసిన నాన్న సినిమాలో ఈ పాట నాకు చాలా నచ్చింది..
నాకు నచ్చే Inspiring Songs Collection లో కొత్తగా చేరిన పాట


జగడ ధోం జగడ ధోం బతుకనేదొక రణం
జగడ ధోం జగడ ధోం మనసనేదొక రధం
నడక అడుగులాపేసినా కనుల కునుకు కమ్మేసినా
అలుపురాదు పోరులో ... పోరులో

నిశిని కరిగించు సూర్యుడు పిలుపులంపాడు నీకిలా
కలలు మారాలి నిజములా... నిజములా
జగడ ధోం జగడ ధోం బతుకనేదొక రణం

పదివేలకాలాలు... మట్టిలో దాక్కున్నా
కరిబొగ్గు వజ్రంలాగా మెరిసి బయటపడదా
చరితల్లో ఎపుడైనా ... శ్రమ లేనే లేకుండా
విజయం తన సొంతం అయిన గాధ రాసి ఉందా

దానవ సేనను బుగ్గిచేసినా పాపం కాదంటా
తోటకి రక్షగా ముళ్ళు పెంచినా తప్పేం కాదంటా
కన్నుల్లో మేఘం నేడే కరిగేను
ఆనందం వానై రేపే కురిసేను..

నడక అడుగులాపేసినా కనుల కునుకు కమ్మేసినా
అలుపురాదు పోరులో ... పోరులో

నిశిని కరిగించు సూర్యుడు పిలుపులంపాడు నీకిలా
కలలు మారాలి నిజములా... నిజములా
జగడ ధోం జగడ ధోం బతుకనేదొక రణం

మలుపంటు లేకుండా దారీ మొదలవదు
నది పయనం చూశావా కొండలకి బెదిరిపోదు
ముసురేసే మబ్బైనా సూర్యుడ్ని దాచెయ్దు
వుబికే కన్నీరైనా గుండెల్ని ముంచలేదు

ఆలయమన్నది దేవుని ఆకృతి దాల్చిన ఇల్లేరా
మంచికి గోపురమల్లె నిలిచిన గుండే గుడిలేరా
ఎవ్వరు వున్నారు నీలా ఇలలో
ఎవ్వరు సరిరారు నీకీ లోకంలో

నడక అడుగులాపేసినా కనుల కునుకు కమ్మేసినా
అలుపురాదు పోరులో ... పోరులో

నిశిని కరిగించు సూర్యుడు పిలుపులంపాడు నీకిలా
కలలు మారాలి నిజములా... నిజములా
జగడ ధోం జగడ ధోం బతుకనేదొక రణం
జగడ ధోం జగడ ధోం మనసనేదొక రధం





18, జులై 2011, సోమవారం

జీవితం ప్రతిపధం సమరమై సాగనీ



హిందీ లో "MeriJung" అనిల్ కపూర్ హీరోగా
తెలుగులో "విజృంభణ" శోభన్ బాబు హీరోగా నటించిన
సినిమాలో ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట...
జీవితం గురించి,జీవితంలో ఎన్నిఎదురుదెబ్బలు తగిలినా
ధైర్యంతో ముందుకు వెళ్లి విజయం సాధించాలని చెప్పే పాట ఇది.
హిందీ,తెలుగు రెండిటిలో ఈ పాట చాలా బాగుంటుంది.

విజృంభణ(1986)
గెలుపు మాదే సుమా గెలుపు మాదే సుమా



గెలుపు మాదే సుమా గెలుపు మాదే సుమా

గగనమే రగిలినా
జీవితం ప్రతిపధం సమరమై సాగనీ

జీవితం ప్రతిపధం సమరమై సాగనీ

గెలుపు మాదే సుమా గెలుపు మాదే సుమా
గగనమే రగిలినా


కమ్మని మనసులు కళకళలాడే కాపురం

తొలకరి ఎండకు తళతళలాడే గోపురం

మమతలు వెలిగే చల్లని ఇల్లే మందిరం

పాపలు తిరిగే వాకిలి సుందర నందనం


నిప్పులు పైబడినా ఉప్పెనలెదురైనా

తడబడకా వడివడిగా నడిచేదే జీవితం...


జీవితం ప్రతిపధం సమరమై సాగనీ

గెలుపు మాదే సుమా గెలుపు మాదే సుమా
గగనమే రగిలినా

జీవితం ప్రతిపధం సమరమై సాగనీ


చీకటి ముసిరిన వేళ చిరునవ్వే రవ్వలదీపం

మౌనం మూగిన వేళ ఒక మాటే మువ్వలనాదం

పదుగురు ఏమన్నా విధి పగపడుతున్నా

ఎదసాచి ఎదిరించి కదిలేదే జీవితం..


జీవితం ప్రతిపధం సమరమై సాగనీ

గెలుపు మాదే సుమా గెలుపు మాదే సుమా

గగనమే రగిలినా ...

జీవితం జీవితం ప్రతిపధం ప్రతిపధం సమరమై సాగనీ

జీవితం జీవితం ప్రతిపధం ప్రతిపధం సమరమై సాగనీ



Meri Jung (1985)
Zindagi Har Kadam Ek Nayi Jung Hai





Related Posts Plugin for WordPress, Blogger...