పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

25, జనవరి 2012, బుధవారం

కలకానిది... విలువైనదీ...!


నాకు ఇష్టమైన మరొక ఇన్స్పిరేషన్ సాంగ్ "కలకానిది విలువైనదీ"
"వెలుగు నీడలు" సినిమాలోని ఈ పాటకు "శ్రీ శ్రీ" గారు రచించిన అద్భుతమైన సాహిత్యం
ఈ పాటను చిరస్థాయిగా మనస్సులో నిలిచేలా చేసింది.
సినిమాలో సావిత్రి భర్త జగ్గయ్య అనుకోని ప్రమాదంలో చనిపోతాడు.అప్పుడు ఆ దిగులుతో బాధపడుతున్న
సావిత్రిని ఓదారుస్తూ జీవితంలో కష్టాలు వస్తే వాటి గురించే బాధపడుతూ.. ఎంతో విలువైన జీవితాన్ని వ్యర్ధం చేసుకోకూడదని చెప్తూ, నాగేశ్వరరావు పాడే ఈ పాట అప్పడు... ఇప్పుడు ఒక ఆణిముత్యం.

పాటలో నాకు నచ్చే మహాకవి శ్రీ శ్రీ గారి inspirational words ...

"అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే "

"
ఏదీ
తనంత తానై నీ దరికి రాదు

శోధించి సాధించాలి అదియే ధీరగుణం"


కల కానిది విలువైనదీ
బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు
కల కానిది విలువైనదీ
బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు

గాలి వీచి పూవుల తీగ నేల వాలిపోగా
గాలి వీచి పూవుల తీగ నేల వాలిపోగా
జాలి వీడి అటులే దాన్ని వదిలివైతువా
చేరదీసి నీరు పోసి చిగురించనీయవా

కల కానిది విలువైనదీ
బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు

అలముకున్న చీకటిలోనే అలమటించనేలా
అలముకున్న చీకటిలోనే అలమటించనేలా
కలతలకే లొంగిపోయి కలువరించనేలా
సాహసమను జ్యోతినీ చేకొని సాగిపో

కల కానిది విలువైనదీ
బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు

అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే
అగాధమౌ జలనిధిలోనా ఆణిముత్యమున్నటులే
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే

ఏదీ తనంత తానై నీ దరికి రాదు
శోధించి సాధించాలి అదియే ధీరగుణం
కల కానిది విలువైనదీ
బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు
బ్రతుకూ ... బలిచేయకు





సినిమా: వెలుగు నీడలు (1961)
సంగీతం : పెండ్యాల నాగేశ్వర రావు
లిరిక్స్ : శ్రీ శ్రీ
గానం : ఘంటసాల


యాదగిరిగుట్ట ట్రిప్ విశేషాలు



మా చెల్లి వాళ్ళ ఫామిలీతో ఈ వీకెండ్ కి మేము వెళ్ళిన ట్రిప్ యాదగిరిగుట్ట.ఇంతవరకు మేము చూడని ప్లేస్ ఇది.మిర్యాలగూడెం నుండి భువనగిరి వెళ్లి,అక్కడి నుండి యాదగిరి గుట్ట వెళ్ళాము.

నల్గొండ జిల్లాలోని భువనగిరి లో ఎంటర్ అవ్వగానే కనపడే గుండ్రాయి లాంటినున్నటి కొండ మీద వున్న భువనగిరి కోట చాలా బాగుంది.భువనగిరిలో ఉన్న ఈ కోట కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందినది.ఈ కోట పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన పాలకుడైన త్రిభువన మల్ల విక్రమదిత్య (ఆరవ) చేఏకశిలారాతి గుట్టపై నిర్మించబడింది. అతని పేరు మీదుగా దీనికి త్రిభువనగిరి అని పేరు వచ్చింది.ఈ పేరు క్రమంగా భువనగిరి అయ్యింది.

అద్భుతమైన ఆనాటి కట్టడం చూడటం ఒక గొప్ప అనుభూతి.. ఆధునిక కట్టడాలకి ఉపయోగించేభారీ పరికరాలేమీ లేకుండా ఆ రోజుల్లో నిర్మించిన ఈ కట్టడాలు ఇప్పటికీ కాలం తో పోటీ పడుతూ..
నిలిచి వున్న పూర్వ వైభవానికి,రాజసానికి ప్రతీక అనిపిస్తుంది.





























ఇక్కడి
నుండి యాదగిరిగుట్ట లోని "కుందా సత్యనారాయణ కళాధామం,సురేంద్రపురి" వెళ్ళాము.టీవీలో ఎప్పటి నుండో చూపిస్తున్న యాడ్ చూసి యాదగిరి గుట్ట వెళ్ళినప్పుడు ఇది కూడా తప్పకుండా చూడాలనుకున్నాము.






ప్రధాన ద్వారంలోనే ఇంద్రుడు తన ఐరావతం సమేతంగా ఆసీనుడై వచ్చిన వాళ్ళనుస్వాగతిస్తున్నట్లు వుంటుంది.లోపలి వెళ్ళగానే 60 అడుగుల పంచముఖ హనుమంతుడు ఒకవైపు,
పరమేశ్వరుడు మరొకవైపు ఒకే శిల్పంలో వున్న విగ్రహం కనపడుతుంది.
ఇక్కడి నుండి పెద్దలకు 250,పిల్లలకు 200 టికెట్ తీసుకుని గాయత్రి మాత విగ్రహం ముందు నుండి లోపలికి వెళ్ళాలి.ఇంక అప్పుడు మొదలవుతుంది పౌరాణిక పాత్రల పరిచయం..  భారతం, రామాయణం,కాళీయ మర్దనం,శక్తి పీఠాలు,దక్షిణ,ఉత్తర భారతదేశాల్లోని అనేక పుణ్యక్షేత్రాలు,  కైలాసం,వైకుంఠం,విశ్వరూపం,యమలోకం,పాతాళ లోకం,మయసభ చివరిగా పద్మవ్యూహంఇలా ఏదేదో వింత లోకాల్లో తిరిగి తిరిగి బయటికి వస్తాము.లోపల ఫోటోలు తీయకూడదు
ముందు ఇవన్నీ చూస్తూ నడవటం సరదాగానే అనిపించినా ఇంతదూరం నడిచి,మెట్లెక్కి అందరికీ నీరసం వచ్చేసింది .ఇక్కడ నడవటం కొంచెం కష్టమే అనిపించింది.



టీవీ యాడ్ లో నారదుల వారు హనుమంతుడు లడ్డూ ప్రసాదం ఇస్తారు అని చెప్తారు.నిజంగానే చివరిలో హనుమంతుడి చేతిలోనుండి లడ్డు ప్రసాదం ఇస్తారు కానీ ఉచితంగా కాదు
20 రూపాయలు తీసుకుని.మేము కూడా తీసుకున్నాము.
ఒక ప్లాస్టిక్ బంతి లో వున్న రవ్వలడ్డు ను ప్రసాదంగా ఇచ్చారు.

శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం - యాదగిరి గుట్ట
తర్వాత లక్ష్మీ నరసింహ స్వామి దర్శనంచేసుకున్నాము.
సాయంత్రం కొండ మీద చల్లటి గాలులతో వాతావరణం కొంచెం చలిగానే వున్నాఇబ్బంది అనిపించలేదు.
గర్భగుడి విద్యుత్ దీపాల కాంతులతో వెలిగిపోతూ,ఆలయం లోపల వున్న చిత్రపటాలు,
అలంకరణ చాలా బాగుంది.
లక్ష్మీ సమేతుడై కొండపై గల గుహలో వెలసిన నరసింహ స్వామిని దర్శనం చేసుకుని,తీర్ధ,ప్రసాదాలు తీసుకుని,
వెరైటీగా అట్టపెట్టెల్లో పెట్టి అమ్ముతున్న లడ్డుప్రసాదం కొనుక్కుని,
బయటికి వచ్చాము.ఇక్కడ కోతులు గుంపులు గుంపులుగా వున్నాయి...
కానీ ఎవరినీ ఏమీ అనకుండా తిరుగుతున్నాయి.
ఇవీ మేము మొదటిసారి వెళ్ళిన మా యాదగిరిగుట్ట యాత్రా విశేషాలు..
మా చెల్లి,మరిది గారు సర్ప్రైజింగ్ గా అప్పటికప్పుడు చెప్పి మమ్మల్ని తీసుకు వెళ్ళిన ఈ ట్రిప్ ఒక మంచి జ్ఞాపకం..
Related Posts Plugin for WordPress, Blogger...