పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

29, అక్టోబర్ 2011, శనివారం

కాణిపాకం To విష్ణు కంచి 10 - SomeThing Special In Tamilnadu

తమిళనాడు ప్రయాణంలో నాకు నచ్చిన కొన్ని విశేషాలు

జయలలిత హోర్డింగ్

వెల్లూర్ లో మేము తిన్న టిఫిన్

కంచిలో చేసిన భోజనం

కంచిపేరు చెప్తేనే గుర్తుకు వచ్చే ఆడవాళ్ళకి ఇష్టమైన
కంచిపట్టు
చీరల షాప్

తమిళనాడు ఆలయాల్లో ప్రసాదాలు

ఆలయాల దగ్గర పూజాసామాగ్రి షాప్

కాణిపాకం To విష్ణుకంచి - 9 విష్ణుకంచి

వరదరాజస్వామి దేవాలయం - విష్ణుకంచి
వరదరాజ పెరుమాళ్ దేవాలయం ఉన్న ప్రాంతం విష్ణుకంచి
ఇక్కడ వరదరాజ పెరుమాళ్ ని చూస్తుంటే తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దగ్గరనుండి చూస్తే
ఇలాగే ఉంటుందేమో అనిపించేంత నిలువెత్తు విగ్రహం.
స్వామివారిని చాలా దగ్గరనుండి దర్శించుకోవచ్చు..
వరదరాజ పెరుమాళ్
ఆ దేవాలయం పరిసర ప్రాంతాలు, ఆ మండపాలు అవన్నీ చూస్తుంటే నాకు ఒక్కసారిగా ఎన్నో ఏళ్ల
వెనక్కి వెళ్లి పోయినట్లుగా,ఆ ప్రాచీనకాలంలోనే నేను కూడా వున్నట్లుగా అనిపించింది.
అంత పురాతన కట్టడాలైనా ఎంతో గంభీరంగా, ఆనాటి రాజుల రాజరికం ఉట్టిపడే ఎత్తైన గోపురాలు,
ఈ ఆలయాలలో చెక్కిన శిల్పకళా నైపుణ్యం అందరినీ ఆకట్టుకుంటుంది.
ఈ దేవాలయంలో బంగారు బల్లి, వెండి బల్లులు ఉండడం మరో విశేషం .
వీటిని తాకితే అంత వరకు బల్లులు మీద పడిన దోషాలు పోతాయని,ఇకముందు పడినా ఏమీ దోషం
ఉండదని అందరి నమ్మకం.
బంగారు బల్లి, వెండి బల్లులు
అమ్మవారిని కూడా దర్శించుకుని,తీర్ధ ప్రసాదాలు తీసుకుని కాసేపు ఆలయమంతా తిరిగి చూసి,
కంచి ఫేమస్ కంచిపట్టు చీరలు కొనటానికి షాపింగ్ కి వెళ్ళాము.
ఇలా మా తమిళనాడు దేవాలయాల టూర్ హ్యాపీగా,సంతృప్తికరంగా,మరిచిపోలేని మదురానుభూతిగా
పూర్తి అయ్యింది..కొన్ని మంచి పుణ్యక్షేత్రాలను చూసిన ఆనందంతో ఇంటికి తిరిగి వచ్చాము..

కాణిపాకం To విష్ణుకంచి - 8 శివకంచి.


శ్రీపురం
టెంపుల్ తర్వాత కంచి వెళ్ళాము అక్కడ నైట్ స్టే చేసి ఉదయాన్నే దర్శనానికి వెళ్ళాము.
ఈ కాంచీపురం రెండు భాగాలుగా వుంటుంది. అవి శివ కంచి,విష్ణు కంచి ఈ రెండు ప్రాంతాల మధ్యలో
అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన కామాక్షి అమ్మవారి ఆలయం వుంది.
ఏకాంబరనాధుని దేవాలయం ఉన్న ప్రాంతాన్ని శివకంచి అని,
వరదరాజ పెరుమాళ్ దేవాలయం ఉన్న ప్రాంతాన్ని విష్ణుకంచి అని పిలుస్తారు.

కంచి కామాక్షి ఆలయం - కంచి.

అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన కంచి కామాక్షి అమ్మ గ్రరూపంలో ఉండేదట.ఆ ఉగ్ర రూపంలో
వున్న అమ్మవారిని శాంతింప చేయటానికి ఆది శంకరాచార్యుల వారు తన స్వహస్తాలతో ఇక్కడ
శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారట...
మేము
ముందుగా కామాక్షి అమ్మవారిని దర్శించుకుని అక్కడి నుండి
ఏకంబరనాధుని కోవెలకి వెళ్ళాము.
ఏకాంబరేశ్వర దేవాలయం - శివకంచి

ఇక్కడ శివుడు పంచభూతాల క్షేత్రాలలో ఒకటైన పృధ్వీలింగం ( సైకత లింగం)
అందుకే ఇక్కడ శివుడికి పాలు, నీళ్ళతో అభిషేకం చేయరని అక్కడ పూజారి చెప్పారు.
ఆలయంలో వేయి స్తంభాల మంటపం,కోనేరు చాలా బాగున్నాయి.
ప్రశాంతమైన వాతావరణం లో ఆలయం చాలా పవిత్రమైన భావనను కలిగించేలా వుంది..
ఆలయంలో ఒక మామిడి చెట్టుకింద పార్వతి అమ్మవారు శివుడి కోసం తపస్సు చేసిందట
ఆ మామిడి చెట్టు సుమారు 3500 సంవత్సరాల వయస్సు కలిగి ఉంటుందని అక్కడ పూజారి చెప్పారు.
ఈ మామిడి చెట్టు దగ్గర ఏ కోరిక కోరుకున్నా వెంటనే జరుగుందట..
పార్వతి అమ్మవారు తపస్సు చేసిన మామిడిచెట్టు


గర్భగుడిలోని ఏకాంబరేశ్వరుడు
ఇక్కడ కూడా దర్శనం అయినతర్వాత అక్కడే దేవస్థానం వాళ్ళే విక్రయిస్తున్న
పులిహోర,పొంగలి,దద్దోజనం ప్రసాదాలను తీసుకుని తిన్నాము.
తమిళనాడులోని అన్ని ఆలయాలలో బయటికి వెళ్లి హోటల్స్ లో తినే అవసరం రానట్లుగా పెడతారు ప్రసాదాలు.
పది రూపాయలకే ఒక మనిషికి సరిపడే ప్రసాదం పెట్టే పధ్ధతి బాగుంది ఇక్కడ.
ప్రతి దేవాలయంలో తీర్ధంతో పాటూ స్వామి, అమ్మవార్ల విభూది,కుంకుమ ఇచ్చి ఆశీర్వదించటం చాలా సంతోషంగా అనిపిస్తుంది.

ఆలయం నుండి బయటికి వచ్చి ఇక్కడికి దగ్గరలోనే వున్న వామన దేవాలయానికి వెళ్ళాము .
బలిచక్రవర్తిని దానమడిగిన వామనమూర్తి విశ్వాన్ని మొత్తాన్ని ఆక్రమిస్తున్నట్లు చూపిస్తున్నట్లుగా వున్న విగ్రహం చాలా పెద్దది.
ఒకప్పుడు హారతి వెలుగులోనే ఈ విగ్రహాన్ని చూసేవారట.ఇప్పుడు లైట్ల వెలుగులో చూస్తున్నారు..

వామనావతార
దేవాలయం-శివకంచి


Related Posts Plugin for WordPress, Blogger...