ఇలాగే ఉంటుందేమో అనిపించేంత నిలువెత్తు విగ్రహం.
స్వామివారిని చాలా దగ్గరనుండి దర్శించుకోవచ్చు..
వరదరాజ పెరుమాళ్
ఆ దేవాలయం పరిసర ప్రాంతాలు, ఆ మండపాలు అవన్నీ చూస్తుంటే నాకు ఒక్కసారిగా ఎన్నో ఏళ్లవెనక్కి వెళ్లి పోయినట్లుగా,ఆ ప్రాచీనకాలంలోనే నేను కూడా వున్నట్లుగా అనిపించింది.
అంత పురాతన కట్టడాలైనా ఎంతో గంభీరంగా, ఆనాటి రాజుల రాజరికం ఉట్టిపడే ఎత్తైన గోపురాలు,
ఈ ఆలయాలలో చెక్కిన శిల్పకళా నైపుణ్యం అందరినీ ఆకట్టుకుంటుంది.
ఈ దేవాలయంలో బంగారు బల్లి, వెండి బల్లులు ఉండడం మరో విశేషం .
వీటిని తాకితే అంత వరకు బల్లులు మీద పడిన దోషాలు పోతాయని,ఇకముందు పడినా ఏమీ దోషం
ఉండదని అందరి నమ్మకం.
అమ్మవారిని కూడా దర్శించుకుని,తీర్ధ ప్రసాదాలు తీసుకుని కాసేపు ఆలయమంతా తిరిగి చూసి,బంగారు బల్లి, వెండి బల్లులు
కంచి ఫేమస్ కంచిపట్టు చీరలు కొనటానికి షాపింగ్ కి వెళ్ళాము.
ఇలా మా తమిళనాడు దేవాలయాల టూర్ హ్యాపీగా,సంతృప్తికరంగా,మరిచిపోలేని మదురానుభూతిగా
పూర్తి అయ్యింది..కొన్ని మంచి పుణ్యక్షేత్రాలను చూసిన ఆనందంతో ఇంటికి తిరిగి వచ్చాము..
0 కామెంట్లు:
కామెంట్ను పోస్ట్ చేయండి