7, ఆగస్టు 2011, ఆదివారం
My sister My Friend...
ఈ రోజు friendship డే మాత్రమే కాదు సిస్టర్స్ డే కూడా అంటే సోదరీమణుల దినోత్సవం.
Frienship డే సిస్టర్స్ డే ఒకే రోజు రావటం నిజంగా చాలా బాగుంది..ఎందుకంటే అక్కాచెల్లెళ్లు ఒకే ఇంట్లో పుట్టిన స్నేహితులు కదా మరి...బయటి స్నేహాలు కొన్ని పరిధులకి లోబడి మాత్రమే వుంటాయి కానీ అక్కాచెల్లెళ్ల ప్రేమాభిమానాలు మనతో పాటు పెరిగి పెద్దవవుతాయి.
ఏవో చిన్ని చిన్ని గొడవలు వచ్చినా ఒక్క క్షణంలోనే మళ్ళీ మాట్లాడుకోకుండా ఉండలేని ఆత్మీయబంధం అక్కాచెల్లిది. .
మా చెల్లి రమ్య నేను తను నిజంగా ఫ్రెండ్స్ లాగానే కలిసిపోతాము.నాకు తను సలహాలు చెప్తుంది.
నేను చెప్పేవి వింటుంది..మా ఇద్దరినీ ఒకే చోట చూసిన వాళ్ళు ఇద్దరిదీ ఒకే పోలిక అనకుండా వుండరు..
ఎక్కడికి వెళ్ళినా నేను తనకి తోడు నాకు తను తోడు ఇప్పటిదాకా...
ఈ మధ్యే పెళ్లి చేసుకుని తన ఇంటికి వెళ్ళినా రోజు ఫోనులో మాట్లాడకుండా ఉండలేము ఇద్దరం..
మా మధ్య ప్రేమాభిమానాలు ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని,మా బంధం దేవుడి ఆశీర్వాదంతో మరింత ఆనందంగా గడిచిపోవాలని కోరుకుంటూ మా చిన్ని రమ్యను దేవుడు ఎప్పుడు కాపాడాలని ప్రార్ధిస్తూ
My Dear Little Sister "RamyaBhadra"
HappySister's Day And friendship Day
లేబుళ్లు:
నేను... నా కుటుంబం,
Special Days And Events