ఒకప్పుడు టీవీలో రాధిక సీరియల్స్ పిన్ని, శివయ్య, లక్ష్మి ఇలా అన్ని
సీరియల్స్ వరసగా చూసేవాళ్ళం. తర్వాత అంత ఆసక్తిగా చూసినవి మంజులా నాయుడు సీరియల్సే. రుతురాగాలు, కస్తూరి,చక్రవాకం, మొగలిరేకులు ఇవన్నీ కూడా ఆసక్తిగా మొదలై ఏవేవే మలుపులతో ,ఏదో ఒక ముగింపుతో మొత్తానికి ఏమి జరుగుతుందో చూద్దాం అనిపించేలా ఉండేవి.ఈ మధ్య సుమారు మూడు సంవత్సరాల క్రితం మొదలైన "శ్రావణ సమీరాలు" సీరియల్ శుభం కార్డు పడింది.ఈ సీరియల్ మొదటి ఎపిసోడ్ విషయంలో నాకొక సందేహం.. సీరియల్ మొదలైన రోజు సూరజ్ నానమ్మ ఇందుని చూపించి నీకు పెళ్ళి సంబంధం తెచ్చాను అని చెప్తుంది. అక్కడ ఇందుని చూసి ఆశ్చర్య పోయిన సూరజ్
"రెండు సంవత్సరాల నుండి కనపడకుండా పోయిన ఇందు ఇప్పుడు కనపడిందని కానీ అర్జున్ ,వీణాధరి ఎక్కడున్నారో తెలియట్లేదు ఇప్పుడు మనం కనిపెట్టాలి " అని పూజానాధ్ తో చెప్పటంతో కథ మొదలవుతుంది.
సీరియల్ మొదలైనప్పటి నుండి అన్ని కారెక్టర్స్ కలిసే ఉన్నాయి. కొన్నాళ్ళు అందరికీ తెలిసేలాగానే ఇందు కనపడకుండా పోయింది, అర్జున్ కనపడకుండా పోయాడు కానీ వీణాధరి మాత్రం కనపడకుండా ఎక్కడికీ వెళ్ళలేదు, చివరి వరకు అందరితో కలిసే ఉండి అందరి ముందే చనిపోతుంది. మరి అర్జున్ ,వీణాధరి ఇద్దరూ రెండేళ్ళు కనపడకుండా ఎక్కడికి పోయారన్నదానికి సమాధానం నాకైతే కనపడలేదు. మేమైతే పాపం వీణాధరి, అర్జున్ని ఎవరేం చేశారా అని ఆసక్తిగా చూసేవాళ్ళం. కానీ ఉండే కొందీ కథ మారిపోతుంది అసలు ending ఎలా ఉంటుందా అని చూశాం .. కానీ సీరియల్ మధ్యలో కూడా ఈ ప్రస్తావన రాకుండానే అయిపోయింది.
సీరియల్ మొదట్లో ఎక్కడో పల్లెటూర్లో బంధువుల ఇంట్లో ఉన్న ఇందుని చూసి గతం గుర్తు చేసుకోవటంతో కథ మొదలవుతుంది.ఇక ఎక్కడా ఆ గతం ప్రస్తావనే రాదు.సూరజ్ ని పెళ్ళి చేసుకుని విడిపోయిన ఇందు కనపడకుండా వెళ్ళిపోయి ఏకంగా అజయ్ తోనే తిరిగొస్తుంది. మరి గతం ఎక్కడ??
జనాలు ఏమి గుర్తుంచుకుంటారులే అని కథ మార్చేశారా లేకపోతే నేనే పొరపాటు పడ్డానా?? డౌట్ తీర్చుకుందామంటే మొదటి ఎపిసోడ్ ఎక్కడా దొరకలేదు. ఎవరైనా ఈ సందేహం తీరిస్తే బాగుండు..