16, జులై 2011, శనివారం
ప్రేమంటే తెలుసా నీకు.....
ప్రేమ ఈ మాట వినని వాళ్ళు, తెలియని వాళ్ళు,ఎప్పుడు ఉపయోగించనివాళ్ళు
వుండరేమో నాకు తెలిసి..
ప్రేమ గురించి ప్రతి మనిషికీ ఎన్నో అభిప్రాయాలూ ఎన్నో నమ్మకాలు
మనిషి తన అవసరాలకు తగినట్లు తన నమ్మకాలతో,సిద్దాంతాలతో కొన్ని వర్గాలను తయారు చేసుకుంటాడు.
తనను ప్రేమించే వారందరూ ఒక వర్గం,తనను ద్వేషించే వారందరూ ఒక వర్గం
తనతో ఏకీభవిస్తే ప్రేమ లేకపోతే ద్వేషం...
ప్రేమ గురించి ఎంత చెప్పుకున్నా.... మనం ఎంతగా ఎవరిని ప్రేమించినా,ఎవరితోనైనా మనం ప్రేమించబడినా ఒక్క సందేహం మాత్రం ఎప్పటికీ సందేహంగానే మిగిలిపోతుంది...అది
ఏ కారణము,ఏ అవసరము,ఏ అనుమానము,ఏ సంబంధము లేకుండా ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రేమించగలడా???
ప్రేమరాహిత్యమంటే నిన్నెవరు ప్రేమించకపోవటమా?
నువ్వెవరినీ ప్రేమించకపోవటమా??
ప్రేమ ప్రేమని ప్రేమిస్తుంది అంటారు కానీ నిజమైన ప్రేమ అవతలి వైపు నుండి ప్రేమలేకపోయినా ప్రేమించటం ఆపదు.
నిజమైన ప్రేమంటే అవతలి వాళ్ళ బలహీనతలని కూడా ప్రేమించగలగాలి...
ఒకరి కోసం ఒకరు ఏదైనా చేయగలగటమే ప్రేమంటే...
ప్రేమించగలిగేవాళ్ళు,ప్రేమించబడే వాళ్ళు ఎప్పుడు సంతోషంగానే వుంటారు
ఆహ్లాదాన్ని,ఆనందాన్ని అందరికీ పంచుతారు...
ప్రేమించటానికి హృదయం వుండాలి
ప్రేమించబడటానికి వ్యక్తిత్వం వుండాలి
చెట్టుని,పుట్టని ప్రేమించగలగాలి,వర్షాన్ని,మంచుని ప్రేమించగలగాలి
మేఘమొస్తుంటే సంతోషించాలి,పూవు పూస్తుంటే మైమరచిపోవాలి
విశ్వాన్ని,ప్రకృతిని,సాటిమనిషిని ప్రేమించేవాళ్ళ మనసునుంచి ఆనందాన్ని,
పెదవి మీద నుండి సంతోషాన్ని,చిరునవ్వుని బ్రహ్మ కూడా చెరపలేడు..
లేబుళ్లు:
ప్రేమ