
జీన్స్ వేసుకున్నా మన జీన్స్ లో వున్నది ఎక్కడికీ పోదు..
దండం పెట్టుకుని పరీక్ష రాస్తాం..కొత్త కంప్యూటర్ ఆన్ చేసే ముందు కొబ్బరికాయ కొడతాం
వీసా కోసం చిలుకూరు బాలాజీని దర్శించుకుంటాం..
సెల్ ఫోన్ లో రింగ్ టోన్ గా గాయత్రిమంత్రాన్ని పెట్టుకుంటాం..
రోడ్డున వెళ్తుంటే ఏ గుడి కనపడినా దండం పెట్టుకుంటాం..
ఎన్.వి లేకపోతె ముద్ద దిగకపోయినా శనివారం నీచు తినటం నీచమైన పని అనుకుంటాం..
జెనరేషన్ ఏదైనా కానీ వుపవాసాలుంటాం..
మొక్కులు తీర్చుకుంటాం..గుండ్లు కొట్టించుకుంటాం..
కలియుగాంతం గురించి చెవులొగ్గి వింటాం..
ఏ గ్రాఫిటీ కూడా బ్రహ్మరాతకు సరిరాదంటాం..
అందుకే మాల్స్.. సినిమా హాల్స్ కన్నా మన దేవాలయాలే రద్దీ రద్దీ...
మనం ఇంతే ఇలాగే వుంటాం..





