పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

22, మే 2011, ఆదివారం

చీకటి తో వెలుగే చెప్పెను నేనున్నానని


ప్రతి మనిషికి జీవితంలో ఎన్నో ఆటుపాట్లు ఎదురవుతాయి..
కష్టాలు,సుఖాల సమ్మేళనమే జీవితం.
అలాంటి పరిస్థితుల్లో ఎవరో వస్తారని, ఏదో చేస్తారని మనల్ని ఓదారుస్తారని..
ఎదురుచూడకుండా మనంతట మనం ఓటమిని గెలుపుగా మార్చుకోవాలి.
మన అంతరాత్మ మనకి తోడుగా ముందుకు సాగిపోవాలి ...

నీకు నేనున్నాను అని చెప్పే మనిషి తోడు ప్రతి ఒక్కరి జీవితంలో తప్పకుండా ఉంటుంది..
ఒకవేళ లేకపోయినా మన ఆత్మావిశ్వాసమే మన తోడుగా సాగిపోవాలని
"నేనున్నాను" సినిమాలో "చంద్రబోస్" గారు రాసిన ఈ పాట నాకు చాలా ఇష్టం.
నాకు నచ్చిన పాటలను వీడియో మిక్సింగ్ చేయటం నా హాబీ..

నేను సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన... చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని...




చీకటి తో వెలుగే చెప్పెను నేనున్నానని

ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
నేనున్నానని నీకేం కాదని...నిన్నటి వ్రాతని మార్చేస్తానని

తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని
తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందు కేళ్లాలని
కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని
కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని

గుండెతో తో ధైర్యం చెప్పెను...చూపుతో మార్గం చెప్పెను
అడుగు తో గమ్యం చెప్పెను నేనున్నానని
నేనున్నానని నీకేం కాదని...నిన్నటి వ్రాతని మార్చేస్తానని

శ్వాసతో శ్వాసే చెప్పెను
మనసుతో మనసే చెప్పెను
ప్రశ్నతో బదులే చెప్పెను నేనున్నానని
నేనున్నానని నీకేం కాదని...నిన్నటి వ్రాతని మార్చేస్తానని

చీకటి తో వెలుగే చెప్పెను నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
నేనున్నానని నీకేం కాదని...నిన్నటి వ్రాతని మార్చేస్తానని


Related Posts Plugin for WordPress, Blogger...