పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

6, ఆగస్టు 2011, శనివారం

ఆరారుకాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు...



పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమే ఆనందానికి ఇల్లు లోకంలోకన్నీరింక చెల్లు..

అందని మిన్నే ఆనందం అందే మన్నే ఆనందం
భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరిక ఆనందం
మంచుకి ఎండే ఆనందం వాగుకి వానే ఆనందం
ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం

ప్రకృతిలోని
అణువణువు అందమైనదే..
వేకువలో మంచులో తడిసిన నీటిబిందువులను రాల్చే వృక్షాలు... గుత్తులు గుత్తులు గా పూచే పూలు.. చల్లగా మనసును తాకే పిల్ల తెమ్మెరలు... సూర్యోదయం వేళ రెక్క లు టపటప కొట్టుకుంటూ ఆకాశానికి
ఎగిరే
పక్షుల గుంపుల కిలకిలా రావాలు... ఇలా ఈ ప్రకృతిలో ఎన్నో అందాలు... ఎన్నెన్నో అద్భుతాలు...

ఎలాంటి వారినైనా పరవశింపజేసే గుణం ఒక్క ప్రకృతికే ఉంది.

ఆరు ఋతువులు,పన్నెండు నెలలు,365 రోజులు అన్నీ మనిషి సంతోషంగా జీవించటానికి భగవంతుడు
ప్రసాదించిన
వరాలు ..
ఆ వరాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రకృతి సౌందర్యం ... లేకపోతె ప్రకృతి వైపరీత్యం

వసంతము - Spring


గ్రీష్మము
- Summer


వర్షము
- Rainy season



శరదృతువు - Autumn


హేమంతము - Dewy


శిశిరము - Winter



ఆరు ఋతువుల అందాలను రమణీయంగా వర్ణించిన పాట రుతురాగాలు సీరియల్ టైటిల్ సాంగ్...
సాగే జీవన గానం అణువణువున ఋతురాగం అంటూ ఆరు ఋతువుల ను మన జీవితంలోని అనుభవాలతో
పోల్చుతూ ఆహ్లాదంగా సాగిపోయే ఈపాట ఆరు ఋతువుల అందాలను మరింత అందంగా ఆవిష్కరిస్తుంది.

సాగే జీవన గానం అణువణువున ఋతురాగం




వాసంత సమీరం లా నునువెచ్చని గ్రీష్మం లా
సారంగ
సరాగం లా అరవిచ్చిన లాస్యం లా

ఒక శ్రావణ మేఘం లా శరత్చంద్రికల కల లా..
హేమంత
తుషారం లా నవ శిశిర తరంగం లా

కాలం.. జాలం.. లయలో కలల అలల సవ్వడి లో
కాలం
.. జాలం.. లయలో కలల అలల సవ్వడి లో
సాగే
జీవన గానం అణువణువున ఋతురాగం
సాగే
జీవన గానం అణువణువున ఋతురాగం


సంగీతం : బంటి, రమేష్
సాహిత్యం : బలభద్రపాత్రుని మధు
గానం : సునీత, బంటి.

♥♥♥♥♥♥♥♥

ఎన్ని అనుభూతులతో నింపినా బరువెక్కనిది జీవితం..
నేను నడిచే తోటలో ప్రతి అనుభవుపు పూవు దగ్గరా ఆగి పలకరిస్తాను
ఎందుకంటే ఏది అనుభూతి పరిమళాన్ని అందిస్తుందో తెలియదు కదా...
ప్రకృతిలో ప్రతి పూవుకో అందం! పూవు పూవుకో పరిమళం !

♥♥♥♥♥♥♥♥

Related Posts Plugin for WordPress, Blogger...