10, మార్చి 2010, బుధవారం
మహిళా మనోరధం.
అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే నది నడకలకు
మరి మరి ఉరికే మది తలపులకు
నా కోసమే చినుకై కరిగి ఆకాశమే దిగదా ఇలకు
నా సేవకే సిరులే చిలికి దాసోహమే అనదా వెలుగు
ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు
కళలను తేవా నా కన్నులకు
మహిళ తలచుకుంటే సాధించలేనిది ఏది లేదని మరోసారి రుజువు చేసుకుంది.
ఆత్మవిశ్వాసంతో గత పద్నాలుగు సంవత్సరాలుగా ప్రయత్నించి ఈనాటికి తమ ప్రయత్నం లో విజయం సాధించిన మహిళ ప్రయత్నం ప్రశంశనీయం.
భారతదేశ భవిష్యత్తును ప్రభావితం చేసే మహిళా రిజర్వేషన్ బిల్లును ఎగువసభ ఆమోదించింది.దిగువ సభ ఆమోదం ఇంకా లభించాల్సి వుంది.
నూట ఎనిమిదవ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్ సభ,రాష్త్ర అసెంబ్లీ లో మహిళలకు మూడోవంతు స్థానాలను కేటాయిస్తూ చట్టం అమల్లోకి రాబోతుంది.
చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచిన ఈ చట్టం సామాజిక మార్పునకు ఎంతగానో దోహదం చేస్తుంది.
రాజకీయ నాయకుల బంధువులు,వారి అండ వున్నవారికి,
డబ్బున్న వారికే ఈ చట్టం వలన లాభం ఎక్కువ అన్న అభిప్రాయం కొందరిలో వున్నప్పటికీ,
ఇప్పటికే చాలామంది మహిళలు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పొషిస్తున్నారు కాబట్టి
ఈ మహిళా బిల్లు మహిళలకి మరిన్ని ఎక్కువ అవకాశాలను కల్పిస్తుందని,
తమ తోటి మహిళల సమస్యలను పరిష్కరించగలిగే ఒక ఆయుధంగా మారుతుందని ఆశిద్దాం.
ఫోటో .....ఈనాడుదినపత్రిక నుండి
రాజి
లేబుళ్లు:
మహిళాలోకం