పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..
నా సొంత వీడియో మిక్సింగ్ పాటలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నా సొంత వీడియో మిక్సింగ్ పాటలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, జనవరి 2015, శుక్రవారం

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..




   
"ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను 
దీక్షకన్న సారధెవరురా?"

"నింగి ఎంత గొప్పదైన రివ్వుమన్నగువ్వపిల్ల 
రెక్క ముందు తక్కువేనురా"

''నొప్పిలేని నిమిషమేది జననమైన మరణమైన
జీవితాన అడుగు అడుగునా''


విశ్రమించ వద్దు ఏ క్షణం .. విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా.. 

అద్భుతమైన సాహిత్యంతో మనసుని ఉత్తేజ పరిచే ''సిరివెన్నెల'' గారి
ఈ పాట నాకు చాలా ఇష్టమైన Inspiration Song ..

నాకు ఇష్టమైన పాటని నాకు నచ్చిన చిత్రాలతో చేసిన వీడియో ..

 ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి




ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏ క్షణం .. విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి

నొప్పిలేని నిమిషమేది జననమైనా మరణమైన
జీవితాన అడుగు అడుగునా

నీరసించి నిలిచిపోతే నిమిషమైనా నీది కాదు
బ్రతుకు అంటే నిత్య ఘర్షణ
దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది
ఇంతకన్నా సైన్యముండునా
ఆశ నీకు అస్త్రమౌను .. శ్వాస నీకు శస్త్రమౌను
దీక్ష కన్నా సారథెవరురా

నిరంతరం ప్రయత్నమున్నదా .. నిరాశకే నిరాశ పుట్టదా
నిన్ను మించి శక్తి ఏది ..నీకె నువ్వు బాసటయితే

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏ క్షణం .. విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి

నింగి ఎంత గొప్పదైనా రివ్వుమన్న గువ్వపిల్ల
రెక్క ముందు తక్కువేనురా
సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేప పిల్ల
మొప్ప ముందు చిన్నదేనురా

పిడుగు వంటి పిడికిలెత్తి ఉరుము వల్లె హూంకరిస్తే
దిక్కులన్నీ ప్రిక్కటిల్లురా
ఆశయాల అశ్వమెక్కి ..అదుపులేని కదను తొక్కి
అవధులన్నీ అధిగమించరా

త్రివిక్రమా పరాక్రమించరా .. విశాల విశ్వమాక్రమించరా
జలధి సైతమార్పలేని జ్వాల ఓలె ప్రజ్వలించరా

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏ క్షణం .. విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి



సినిమా  -  పట్టుదల (1992)
సంగీతం - ఇళయరాజా 
లిరిక్స్ - సిరివెన్నెల 
గానం - K.J. ఏసుదాస్

31, ఆగస్టు 2014, ఆదివారం

ఇళయరాజా & ఇళయరాజా





నా మరో కొత్త వీడియో ప్రయోగం "నాదం నీ దీవెనే నీ రాగాలాపనే"...  ఈ పాట తమిళ్ డబ్బింగ్ సినిమా రాగమాలిక లోది  రాధ,కన్నన్ నటించారు . ఈ  పాట వింటుంటే నాదం,రాగం, ఇలా ఏదో శాస్త్రీయ సంగీతం పాటలగా అనిపిస్తుంది కానీ ఈ పాట వీడియో తమిళం లో చూశాను .. రాధ పల్లెటూరి అమ్మాయి లాగా పాడుతుంది ... 

తన ప్రేమను తెలియచేస్తూ అమ్మాయి పాడే ఈ పాట ఇళయరాజా సంగీతం, వేటూరి సాహిత్యం తో పాటూ జానకమ్మ స్వరం లో చాలా బాగుంటుంది .. 1982 లో వచ్చిన రాగమాలిక సినిమా గురించి తెలుగులో ఎక్కడావీడియోలు, పాటలు లేవు కానీ యూట్యూబ్ లో తమిళ సినిమా పాటలు, వీడియోలు ఉన్నాయి .ఈ పాట వీడియో తెలుగులో లేదు కాబట్టి నాకు నచ్చిన చిత్రాలతో వీడియో చేశాను.. 

"సంగీత జ్ఞాని ఇళయరాజా" గారి సంగీతం లో వచ్చిన ఈ పాట కోసం నేను ఎంచుకున్న చిత్రాలు కూడా ఇళయరాజావే.. "ఆర్టిస్ట్ ఇళయరాజా"  గురించి అందరికీ తెలిసే వుంటుంది .జీవం ఉట్టిపడే అమ్మాయిల చిత్రాలు చూస్తుంటే ఆశ్చర్యం  అనిపిస్తుంది .. రోజువారీ ఇంట్లో పనులు చేస్తున్నట్లున్న అమ్మాయిలు, పరిసరాలను  చిత్రించిన పెయింటింగ్స్ చూస్తుంటే ఫోటోలు చూస్తున్నాము అనిపిస్తుంది కానీ పెయింటింగ్స్  అనిపించవు . రాజా రవి వర్మ తర్వాత ఆడవాళ్ళ చిత్రాలను ఇంత  చక్కగా వేసింది ఈయనేనేమో. ఆర్టిస్ట్ ఇళయరాజా పెయింటింగ్ లో అమ్మాయిలైతే ఈ పాటకి సరిపోతారు అనిపించి ఆ  చిత్రాలతో పాటు కొన్ని నాకు నచ్చిన రాధాకృష్ణుల పెయింటింగ్స్ తో ఈ పాట ఎడిట్ చేశాను. 

ఆర్టిస్ట్ S.ఇళయరాజా గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు. 



ఒకరు మహా సంగీత జ్ఞాని, మరొకరు జీవం ఉట్టిపడే చిత్రాల సృష్టికర్త ఇలా వీరిద్దరి సృష్టిని ఒక చోటికి చేర్చిన  నా చిన్ని ప్రయత్నమే ఈ పాట.. 

నాదం నీ దీవెనే నీ రాగాలాపనే
నీ రాగ గీతం పాడుతుంటే
పలుకే పాలూరదా ఓ.. పువ్వే వికసించదా
నాదం నీ దీవెనే నీ రాగాలాపనే




20, డిసెంబర్ 2011, మంగళవారం

ఎంకి - నాయుడుబావ By:Raaji


నండూరి సుబ్బారావు గారు రాసిన ఎంకి పాటలు ప్రణయానికి సంబంధించిన పాటలు.
తొలి వలపులు, దాంపత్య జీవితానురాగాలు కలిసిన ఊసులు, బాసలు,
వేదనలు, విరహాలు పాటల్లో చక్కగా వర్ణించారు..
ఎంకి పల్లె పడుచు. కపటం ఎరుగనిది. జానపద సౌందర్యానికి ప్రతీక.
ఎంకి,నాయుడు బావలు జానపదజంట..
అందమైన అమ్మాయిని పోల్చటానికి నండూరి వారి ఎంకి అనటం అందరికీ తెలిసిందే..

బాపుబొమ్మల్లో ఎంకి నాయుడు బావ బొమ్మను చూసిన నాకు వీళ్ళిద్దరి గురించి
సుభాష్ చంద్రబోస్ సినిమాలో "జాజిరి జాజిరి మావా" అనే పాటను
రాజస్థానీ జానపద జంట చిత్రాలతో కలిపి పాట చేయాలనిపించింది..

నేను చేసిన ఎంకి నాయుడు బావ పాట...నా మరో వీడియో ప్రయోగం..

జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా
ఎన్ని జనమలకైనా నువ్వే నా నాజత మావా!
జాజిరి జాజిరి జాజిరి జాజిరి మావా
ఎనకటి జనమలో ఎంకిని నేనే నాయుడు మావా!
By:Raaji





12, డిసెంబర్ 2011, సోమవారం

రవి వర్మకే అందనీ ఒకే ఒక అందానివో...


రాజా రవివర్మ ఈనాటి భారతదేశములోని కేరళలో తిరువనంతపురానికి 25 మైళ్ళ దూరంలోని
కిలమానూరు రాజప్రాసాదములో ఉమాంబ తాంబురాట్టి, నీలకంఠన్ భట్టాద్రిపాద్ దంపతులకు
ఏప్రిల్ 29, 1848న జన్మించారు.
రాజా
రవివర్మ భారతీయ చిత్రకారుడు. అతను రామాయణ, మహాభారతములలోని ఘట్టాలను
చిత్రాలుగా మలచి మంచి గుర్తింపు పొందాడు.
భారతీయ సాంప్రదాయిక, పాశ్చాత్య చిత్రకళా మెళకువల సంగమానికి
అతని చిత్రాలు చక్కని మచ్చుతునకలు.
చీరకట్టుకున్న
స్త్రీలను అందంగా, చక్కని వంపు సొంపులతో
చిత్రించడంలో అతనికి అతనే సాటి.
1873 లో జరిగిన వియన్నా కళా ప్రదర్శనలో మొదటి బహుమతిని గెలుచుకున్నప్పుడు
ఆయన గురించి ప్రపంచానికి తెలిసింది.
భారతీయ చిత్రకళా చరిత్రలో గొప్ప చిత్రకారునిగా గుర్తింపు పొందిన రాజా రవి వర్మ,
1906లో, 58 సంవత్సరాల వయసులో మధుమేహంతో మరణించాడు.
ఈయన మరణించేనాటికి కిలామానూరు ప్యాలెస్‌లో 160 దాకా రవివర్మ చిత్రాలు ఉండేవని ప్రతీతి.
ఆ తరువాత వాటిని అధికారికముగా తిరువనంతపురములోని చిత్రా ఆర్ట్ గ్యాలరీకి అందజేశారు.(Wikipedia)

ఎంతో అందంగా వుండి,హుందాగా వుండే రాజా రవివర్మ చిత్రాలు నాకు చాలా నచ్చుతాయి..
వీటిలో శకుంతల అందమైన,అమాయకమైన మొహాన్ని రవివర్మ జీవం ఉట్టిపడేలా చిత్రీకరించారు..
ఇంకా పళ్ళు చేతిలో పట్టుకున్న మహిళ,దమయంతీ హంస సంవాదము,యశోదకృష్ణ చిత్రాలు
చాలా బాగుంటాయి.
రవివర్మ చిత్రాలతో చేసిన "రవి వర్మకే అందనీ" పాటని యూ ట్యూబ్ లో ఇంతకుముందు చూశాను
కానీ 2 రోజుల క్రితం "ఎందుకో? ఏమో !" గారి బ్లాగ్ లో ఈ పాట చూసినప్పుడు నాకు కూడా
ఈ పాటని రవివర్మ చిత్రాలతో చేయాలనిపించింది.

నాకు నచ్చిన రవివర్మ చిత్రాలతో వీడియో మిక్సింగ్ చేసిన పాట:

రవి వర్మకే అందనీ ఒకే ఒక అందానివో
By:Raaji..




రవి వర్మకే అందనీ ఒకే ఒక అందానివో
రవి వర్మకే అందనీ ఒకే ఒక అందానివో
రవి చూడని పాడనీ నవ్య రాగానివో
రవి వర్మకే అందనీ ఒకే ఒక అందానివో

ఏ రాగమో తీగదాటి ఒంటిగా నిలిచే
ఏ యోగమో నన్ను దాటి జంటగా పిలిచే
ఏ మూగ భావాలో అనురాగ యోగాలై
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ....
నీ పాటనే ... పాడనీ
రవివర్మకే అందనీ ఒకే ఒక అందానివో

ఏ గగనమో కురుల జారి నీలిమై పోయే
ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమై పోయే
ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై
ఆ ఆ ఆ ఆ ఆ ఆ...
కదలాడనీ ...పాడనీ

రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో ఆ ఆ ఆ
రవి చూడని పాడని నవ్య రాగానివో
రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో

****************
సినిమా:రావణుడే రాముడైతే
మ్యూజిక్:G.K.వెంకటేష్
లిరిక్స్:వేటూరి సుందరరామ్మూర్తి
సింగర్స్:S.P.బాలు,S.జానకి
****************


9, డిసెంబర్ 2011, శుక్రవారం

జీవితం ఓ ప్రయాణం తోడుగా సాగనీ... By :రాజి


కృష్ణంరాజు,జయప్రద జంటగా నటించిన "సుమంగళి" సినిమాలో "జీవితం ప్రయాణం తోడుగా సాగనీ"
పాట చాలా బాగుంటుంది.నాకు ఇష్టమైన పాట..
ప్రతి మనిషి జీవితంలో ఎన్నెన్నో బంధాలు,అనుబంధాలు కానీ అన్నిటికంటే పవిత్రమైనది ,
ప్రాముఖ్యత కలిగింది వివాహబంధం..
ఐతే ఈ పెళ్లి కొందరికి ఒక మంచి అర్ధవంతమైన జీవితాన్ని అందిస్తే కొందరికి
ఒక చేదు జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోతుంది..

ఈ సినిమాలో కృష్ణంరాజు,జయప్రద ఇద్దరు మంచి జంట
ఇద్దరు ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ,అనురాగం వున్నా విధి వాళ్ళు విడిపోక
తప్పని పరిస్థితుల్ని కల్పిస్తుంది..
అలా వాళ్ళు విడిపోక ముందు జీవితమనే ఈ ప్రయాణంలో ఒకికొకరు తోడుగా సాగిపోవాలని
కోరుకుంటూ సంతోషంగా పాడుకునే ఈ పాట ఇప్పటికీ ఎప్పటికీ ఒక మధురగీతం..

"ఈ పాటని నాకు నచ్చిన పిక్చర్స్ తో వీడియోమిక్సింగ్ చేశాను .."

జీవితం ఓ ప్రయాణం తోడుగా సాగనీ
By:Raaji


జీవితం ప్రయాణం తోడుగా సాగనీ
గుండెలో ప్రేమగీతం నిండుగా మ్రోగనీ
దారిలో మమతలే పూవులై కురియనీ
ఇలానే...ఇలానే...
జీవితం ప్రయాణం తోడుగా సాగనీ
గుండెలో ప్రేమగీతం నిండుగా మ్రోగనీ

జలతారు మేఘం పరదాలు దాటి
నీలాల నింగీ నే చేరుకోనా
ఆ తారలన్నీ తళుకాడు వేళ
ఎన్నెన్నో కళలు కదలాడవా
ఆ కాంతినై ఇలా... ఇలా నేనుండిపోనా

జీవితం ప్రయాణం తోడుగా సాగనీ
గుండెలో ప్రేమగీతం నిండుగా మ్రోగనీ

దరిచేరు వేళ చిరు సిగ్గులో
మనసైనవాని కనుచూపులో
సరికొత్త అందం చిగురించితే
ఓ గర్వరేఖ కనుగీటితే
ఆ రేఖనై ఇలా... ఇలా నేనోదిగిపోనా

జీవితం ప్రయాణం తోడుగా సాగనీ
గుండెలో ప్రేమగీతం నిండుగా మ్రోగనీ


9, ఆగస్టు 2011, మంగళవారం

గోరంతదీపం కొండంత వెలుగు ... నా మరో ప్రయోగం..


నా బ్లాగ్ లో inspiration songs లో పెట్టటానికి గోరంతదీపం సినిమాలో "గోరంత దీపం కొండంత వెలుగు"
అనే పాట కోసం నెట్ లో వెతికాను కానీ కనిపించలేదు..
అందుకే ఎలాగు నాకు ఇష్టమైన పాటలు వీడియో మిక్సింగ్ చేయటం అలవాటే కాబట్టి నిన్నంతా ఆ పనిలో వుండి
మొత్తానికి సక్సెస్స్ అయ్యాను.
నాకిష్టమైన పాటను నాకిష్టమైన పిక్చర్స్ తో వీడియో మిక్సింగ్ చేసిన పాట

గోరంత దీపం కొండంత వెలుగు
చిగురంత ఆశ జగమంతా వెలుగు
By:Raaji



గోరంత దీపం కొండంత వెలుగు
చిగురంత ఆశ జగమంత వెలుగు

గోరంత దీపం కొండంత వెలుగు

చిగురంత ఆశ జగమంత వెలుగు

కరి మబ్బులు కమ్మే వేళ మెరుపు తీగే వెలుగు
కారు చీకటి ముసిరే వేళ వేగు చుక్కే వెలుగు

కరి మబ్బులు కమ్మే వేళ మెరుపు తీగే వెలుగు
కారు చీకటి ముసిరే వేళ వేగు చుక్కే వెలుగు

మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు
మతి తప్పిన కాకుల రొదలో మౌనమే వెలుగు
దహియించే బాధల మధ్యన సహనమే వెలుగు


గోరంత దీపం కొండంత వెలుగు
చిగురంత ఆశ జగమంత వెలుగు

కడలి నడుమ పడవ మునిగితే కడ దాకా ఈదాలి

కడలి నడుమ పడవ మునిగితే కడ దాకా ఈదాలి

నీళ్ళు లేని ఎడారిలో ...
నీళ్ళు లేని ఎడారిలో కన్నీళ్ళైన తాగి బతకాలి
నీళ్ళు లేని ఎడారిలో కన్నీళ్ళైన తాగి బతకాలి
ఏ తోడు లేని నాడు నీ నీడే నీకు తోడు
ఏ తోడు లేని నాడు నీ నీడే నీకు తోడు

జగమంతా దగా చేసినా చిగురంత ఆశను చూడు

చిగురంత ఆశ జగమంత వెలుగు
గోరంత దీపం కొండంత వెలుగు

చిగురంత ఆశ జగమంత వెలుగు


సినిమా:గోరంతదీపం
లిరిక్స్:c.నారాయణ రెడ్డి


22, సెప్టెంబర్ 2010, బుధవారం

మయూరి.



మయూరి సినిమా అందరికీ తెలిసిన సినిమానే నేను కొత్తగా చెప్పేదేమీ లేదు
కానీ నాకు ఇష్టమైన సినిమా గురించిన నా అభిప్రాయం నా చిన్ని ప్రపంచంలో....

నాకు ఎప్పటికీ గుర్తుండిపొయేలా , ఎంతగానో నచ్చిన సినిమాలు చాలా వున్నాయి.
వాటిలో టాప్ 10 లో వుండే సినిమా మయూరి.

చిన్నప్పుడు ఇంగ్లీష్ సబ్జెక్టు లో సుధాచంద్రన్ జీవిత చరిత్ర ఒక లెసన్ వుండేది.
ఆ లెసన్ చెప్తూ మా టీచర్ ఇది మయూరి అనే సినిమాగా వచ్చింది.
సినిమా చూడండి చాలా బాగుంటుంది అని చెప్పారు.

అప్పుడు మొదటిసారి మయూరి సినిమా చూశాను.అప్పటినుండి నేను మయూరి ఫాన్ అయిపోయాను.
ఎన్ని సార్లు టివీ లో వచ్చినా మిస్ అవ్వకుండా చూసే సినిమా మయూరి.

మనిషి తలచుకుంటే ఏదైనా సాధించగలడు అని,ప్రయత్నం చేస్తే విజయం వరిస్తుందని తెలియచేయటానికి
మయూరి నిజజీవితం గురించి స్ఫూర్తి కలిగించే విధంగా,చిన్నప్పటి పాఠంగా చదివాను .
మళ్ళీ కొంతకాలానికి నేను డిగ్రీ పూర్తీ చేసి, ICET ,EDCET కోచింగ్ కోసం
విజయవాడ SUPERWHIZZ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యాను.

షార్ట్ టర్మ్ కోచింగ్ అయిపోయిన తర్వాత ఒక రోజు SUPERWHIZZ డైరెక్టర్ గుప్తా గారు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో feedback claass ఏర్పాటు చేశారు .

ఆ క్లాస్ లో ఆయన చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తుకువస్తుంటాయి.
ప్రతి మనిషీ జీవితంలో ఏదో ఒక క్షణంలో నిరాశ నిస్పృహలకు,
నేనికేమీ చేయలేననే ఆశక్తతకు లోనవుతాడు.
ఆలాంటి సమయంలోనే మనిషి ధైర్యాన్ని కోల్పోకుండా మనం ఏది సాధించాలి అనుకున్నామో
దానికోసం రెట్టింపు కృషి చేయాలి ,విజయాన్ని సాధించాలి.
ఇవన్నీ చెప్తూ ఆయన క్లాస్ లో మయూరి సినిమాలోని కొన్ని సన్నివేశాలను చూపించారు.

నిజంగా ఒక సామాన్య మనిషి జీవితం మరి కొందరి జీవితంలో స్పూర్తిని నింపడానికి ఉపయోగపడింది అంటే
అంతకంటే ఆ మనిషి జీవితంలో సాధించే విజయం ఇంకేముంటుంది?

మయూరి సినిమా కధ విషయానికి వస్తే ....

మయూరికి నాట్యం అంటే చాలా ఇష్టం.ఎప్పటికైనా నాట్యం లో మంచి పేరు సాధించాలన్నది ఆమె ఆశయం.
కానీ ఇంట్లో డాన్సు అచ్చిరాలేదన్న కారణంగా ..మయూరి పిన్ని నాట్యం నేర్చుకోవటానికి ఇష్టపడకపోవటంతో ,
ఇంట్లో తెలియకుండా ఒక స్నేహితుని సహకారంతో డాన్సు నేర్చుకుని తన కలలు నిజం చేసుకుంటున్న సమయంలో జరిగిన ఒక ప్రమాదంలో తన కాలు కోల్పోతుంది.

జరిగిన ప్రమాదం లో మయూరికి సానుభూతి చూపకపోగా మాటలతో హింసిస్తుంది ఆమె పిన్ని.
తన స్వార్ధం కోసమే మయూరికి నాట్యం నేర్పి, ప్రదర్శనలు ఇప్పించి,ఆమెని పెళ్లి చేసుకుంటానన్న మోహన్
మయూరికి కాలు పోగానే నిన్ను పెళ్లి చేసుకుంటే నాది కూడా అవిటి బతుకేనంటూ అవహేళన చేస్తాడు.

ఈ సంఘటనలతో బాధపడిన మయూరి ఇల్లు వదిలి వెళ్లి,స్నేహితురాలి వద్ద ఉంటూ
జైపూర్ ఫుట్ గురించి తెలుసుకుని, తన బామ్మ సహకారంతో ,
తను సాధించాలనుకున్న నాట్యాన్ని తిరిగి నేర్చుకుని మనిషి తలచుకుంటే ఏది అసాధ్యం కాదు అని నిరూపిస్తుంది.

సినిమాలో మనుషుల వ్యక్తిత్వాలను చాలా చక్కగా చిత్రీకరించారు...

కోరుకున్న గమ్యాన్ని చేరటం కోసం ఆత్మవిశ్వాసంతో కష్టాన్ని అధిగమించిన వ్యక్తిత్వం కలిగిన అమ్మాయి మయూరి.

మయూరి తండ్రి మంచి మనసుతో కూతురిని అర్ధం చేసుకుంటాడు కానీ భార్య,కుటుంబాన్ని కాదనుకోలేని వ్యక్తి.

ఇక మయూరి పిన్ని ఎప్పుడో జరిగిన అనర్ధాలను దృష్టిలో ఉంచుకుని మయూరిని డాన్స్ కి దూరంగా ఉంచాలన్నది ఆమె పట్టుదల.

ఇక సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషించింది,నాకు నచ్చే పాత్రలు అని చెప్పదగినవి
మయూరి బామ్మ నిర్మలమ్మ, వాళ్ళింట్లో పని చేసే సత్యం.

మయూరికి కష్ట కాలంలో ఎంతో చేదోడు వాదోడుగా నిలిచి,తనలో ఆత్మస్థైర్యాని నింపి ఆమె విజయానికి బాటలు వేసిన వ్యక్తులు వీళ్ళిద్దరూ.

జీవితంలో విజయం సాధించిన ప్రతి మనిషి వెనుక ఇలాంటి వ్యక్తులు తప్పకుండా వుంటారు.

ఇక సినిమాలో కీలక పాత్ర అని చెప్పదగినది మోహన్ పాత్ర.
స్వార్ధానికి నిలువెత్తు ఉదాహరణ మోహన్

అతను బైక్ మీద వెళ్తున్నప్పుడు కాలినడకన వెళ్ళే వాళ్ళని సరిగా నడవరని విమర్శించడం,
వెంటనే అతను నడిచి వెళ్తున్నప్పుడు బైక్ మీద వెళ్ళే వాళ్ళను విమర్శిస్తూ జనాలకి బొత్తిగా సివిక్ సెన్సు లేకుండా పోయిందండీ అనే సంఘటనలోనే అతని వ్యక్తిత్వాన్ని చాలా చక్కగా చిత్రీకరించారు.

ఇదే స్వార్ధాన్ని మయూరి విషయంలో కూడా చూపించిన మోహన్
అతని వలననే ప్రమాదానికి గురి అయిన మయూరి అసహాయ పరిస్థితిలో వుండి
తనను పెళ్లి చేసుకోమని అడగటానికి వచ్చినప్పుడు ఎంతో అవమానించి మాట్లాడతాడు.

కానీ అతని మాటలు విన్న మయూరి కుంగిపోకుండా, అతని ముందే నేను సాధించగలను అని,
తను అనుకున్న గమ్యాన్ని సాధించి నాట్య మయూరిగా విజయ తీరాలని చేరుకుంటుంది.

మయూరి తిరిగి నర్తకిగా పేరు తెచ్చుకోగానే మోహన్ ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా మయూరికి మళ్ళీ దగ్గరవ్వాలని ప్రయత్నిస్తాడు,
కానీ మయూరి అతనిని నిరాకరించి తగిన గుణపాఠం చెప్తుంది.

జీవితంలో కష్ట,నష్టాలు అందరికీ వస్తాయి కానీ వాటిని ఎదిరించి పోరాడితేనె విజయం సాధించగలం అని
నిజ జీవితంలో జరిగిన సంఘటన ద్వారా రుజువు చేసిన మయూరి సుధాచంద్రన్ అందరికీ ఆదర్శం.

మనల్ని అవమానించిన వాళ్ళమీద మనం పగ తీర్చుకోవటం అంటే తిరిగి మనం కూడా వాళ్లకి ఏదో ఒక నష్టం కలగచేయటం,వాళ్ళని బాధించటం కాదు.
మనం ఏదైతే సాధించలేమని,చేయలేమని మనల్ని అవమానించారో అది సాధించటం అని నా అభిప్రాయం.
నేను నమ్మే సిద్ధాంతం కూడా అదే..

మా అమ్మమ్మ ఎప్పుడూ చెప్తుండే ఒక మాట, నాకు ఎప్పుడూ గుర్తుండే మాట ...
పట్టు
పట్టరాదు
పట్టి
విడువరాదు
పట్టి
విడుచుటకంటే
పడి
చచ్చుటే మేలు


నాకు నచ్చిన మయూరి సినిమాలో పాటలు నా సంగీత ప్రపంచం సరిగమలు...గలగలలు లో






30, జూన్ 2010, బుధవారం

నా పంచ ప్రాణాలే నీవనీ....


పంచభూతాల సాక్షిగా...
పంచామృతాల సాక్షిగా...
పంచేంద్రియాల సాక్షిగా...
పంచాక్షరాల సాక్షిగా...
నా పంచ ప్రాణాలే నీవనీ... పంచేసుకుంటా నీతో ప్రేమనీ...

మూడుముళ్ల బంధంతో, ఏడడుగులతో రెండు మనసులను ఒక్కటి చేస్తుంది వివాహబంధం.

ధర్మేచ...మోక్షేచ...కామేచా...అర్దేచా...నాతిచరామి అంటూ భిన్న కుటుంబాలనుండి వచ్చిన ఇద్దరు వ్యక్తులను ఏకం చేస్తుంది వివాహ బంధం.

అప్పటి వరకు ఎవరికీ ఎవరోగా వున్న ఇద్దరు వ్యక్తులను ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా కలిపేది వివాహ బంధం.

భార్యా, భర్తలు జీవిత భాగస్వాములుగా కష్ట,సుఖాలను పంచుకుంటూ ఒకరి కోసం ఒకరుగా,ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ,సాగి పోయే వివాహ బంధం చూడ ముచ్చటగా వుంటుంది.

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు... నీకోసమే కన్నీరు నింపుటకు
నేనున్నానని నిండుగ పలికే ....తోడుకరుండిన అదే భాగ్యమూ...అదే స్వర్గమూ

ప్రతి మనిషి జీవితంలో కోరుకునేది ఇలాంటి తోడునే కదా ....

నేను సొంతగా వీడియో మిక్సింగ్ చేసిన ఈ పాట రాజశేఖర్,జీవితల ఇంద్రధనస్సు సినిమా లో పాట
ఈ పాటలోని సాహిత్యం నాకు చాలా ఇష్టం.
భార్యను అమితంగా ప్రేమించి,ఆరాధించే భర్త ఆమెను గురించి పాడే పాట చాలా బాగుంటుంది.
భార్యను ఇంత వున్నతంగా వూహించుకుని,ప్రేమించే భర్త దొరకటం నిజంగా అద్రుష్టం...

ఇంద్రధనస్సు ఇల్లాలై ఇంటి వెలుగు అయ్యిందీ



రాజి

22, మార్చి 2010, సోమవారం

నవమినాటి వెన్నెల నేను



రెండు రోజుల క్రితం టి.వి.9 లో మంత్రనగరి అనే కార్యక్రమం ప్రసారం అయ్యింది.సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులను,వారి జీవితవిశేషాలను పరిచయం చేసే ఈ కార్యక్రమం బాగుంది.మొన్న శనివారం దర్శకుడు.దాసరి నారాయణరావు గారి సినీ జీవిత విశేషాలను పరిచయం చేశారు. ఆయన సినిమాల్లో కొన్నిపాటలు నాకు కూడా చాలా ఇష్టం.

జయసుధ నటించిన శివరంజని సినిమాలోని నవమినాటి వెన్నెల నేను పాట చాలా బాగుంటుంది.ఆ పాట సున్నితమైన భావాలతో, అర్ధవంతంగా, వినడానికి హాయిగా వుంటుంది.నాకు ఇష్టమైన ఆడియోలకి మా చెల్లి రమ్య తో స్లైడ్ షో తో వీడియో మిక్సింగ్ చేయించటం నాకు హాబి.ఐతే మొదటిసారిగా నాకు చాలా ఇష్టమైన ఈ పాటకి నేనే వీడియో తయారు చేయాలని ఈ పాటని మా చెల్లి హెల్ప్ తో చేసాను.నాకు నచ్చింది.మరి మీకు...

రాజి.


Related Posts Plugin for WordPress, Blogger...