పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

9, జనవరి 2015, శుక్రవారం

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..




   
"ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను 
దీక్షకన్న సారధెవరురా?"

"నింగి ఎంత గొప్పదైన రివ్వుమన్నగువ్వపిల్ల 
రెక్క ముందు తక్కువేనురా"

''నొప్పిలేని నిమిషమేది జననమైన మరణమైన
జీవితాన అడుగు అడుగునా''


విశ్రమించ వద్దు ఏ క్షణం .. విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా.. 

అద్భుతమైన సాహిత్యంతో మనసుని ఉత్తేజ పరిచే ''సిరివెన్నెల'' గారి
ఈ పాట నాకు చాలా ఇష్టమైన Inspiration Song ..

నాకు ఇష్టమైన పాటని నాకు నచ్చిన చిత్రాలతో చేసిన వీడియో ..

 ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి




ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏ క్షణం .. విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి

నొప్పిలేని నిమిషమేది జననమైనా మరణమైన
జీవితాన అడుగు అడుగునా

నీరసించి నిలిచిపోతే నిమిషమైనా నీది కాదు
బ్రతుకు అంటే నిత్య ఘర్షణ
దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది
ఇంతకన్నా సైన్యముండునా
ఆశ నీకు అస్త్రమౌను .. శ్వాస నీకు శస్త్రమౌను
దీక్ష కన్నా సారథెవరురా

నిరంతరం ప్రయత్నమున్నదా .. నిరాశకే నిరాశ పుట్టదా
నిన్ను మించి శక్తి ఏది ..నీకె నువ్వు బాసటయితే

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏ క్షణం .. విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి

నింగి ఎంత గొప్పదైనా రివ్వుమన్న గువ్వపిల్ల
రెక్క ముందు తక్కువేనురా
సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేప పిల్ల
మొప్ప ముందు చిన్నదేనురా

పిడుగు వంటి పిడికిలెత్తి ఉరుము వల్లె హూంకరిస్తే
దిక్కులన్నీ ప్రిక్కటిల్లురా
ఆశయాల అశ్వమెక్కి ..అదుపులేని కదను తొక్కి
అవధులన్నీ అధిగమించరా

త్రివిక్రమా పరాక్రమించరా .. విశాల విశ్వమాక్రమించరా
జలధి సైతమార్పలేని జ్వాల ఓలె ప్రజ్వలించరా

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏ క్షణం .. విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి



సినిమా  -  పట్టుదల (1992)
సంగీతం - ఇళయరాజా 
లిరిక్స్ - సిరివెన్నెల 
గానం - K.J. ఏసుదాస్

Related Posts Plugin for WordPress, Blogger...