పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

22, డిసెంబర్ 2011, గురువారం

మిలే సుర్ మేరా తుమ్హారా....


ఎన్నో భాషలు,ఎన్నో మతాలూ,మరెన్నో సంస్కృతులు.వీటి సమ్మేళనం మన భారతీయం.
ఆ భారతీయతనురెండు లైన్లలో పాడుకోగలిగితే అది.. 
"మిలే సుర్ మేరా తుమ్హారా..తో సుర్ బనే హమారా.."

గతంలోకి వెళితే..లోక్ సేవ సంచార్ పరిషత్ వారు ఓ వీడియో రూపొందించమని "ఒగిల్వి మీడియాని"
కోరారు.ఆ వీడియో భారతీయత ఉట్టిపడేలా ఉండాలనేది అప్పటి ప్రభుత్వం ఆలోచన.అంతే కాదు నిడివి
5 నిమిషాలే వుండాలి..14 భాషలు వినిపించాలి..దేశంలోని భిన్నత్వమంతా ఏకత్వంగా కనిపించాలి 
ఇదీ కాన్సెప్ట్.అనుకున్నట్లే వీడియోను రూపొందించింది ఒగ్విలి మీడియా.ఆ పాటే మిలే సుర్ మేరా తుమ్హారా.సురేష్ మాలిక్ ఈ పాట సృష్టికర్త .. ఈ పాటను "పీయూష్ పాండే" రాశారు.. దీనికి సంగీతం  
లూయిస్ బ్యాంక్స్ ..1988,ఆగస్ట్ 15 న ప్రధానమంత్రి ప్రసంగం అనంతరం దూరదర్శన్ లో ఈ పాట తొలిసారి ప్రసారమైంది.

నేను భారతీయుడినని ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకునేలా, జాతీయతా భావాన్ని కలిగించేలా
ఎన్నో అందమైన లోకేషన్స్ లో, ఎందరో ప్రముఖులు,అప్పటి హీరోహీరోయిన్లతో పాటు, కోట్లమంది
భారతీయులు సమసృతిలో పాడిన ఈ పాట మరో జాతీయ గీతం అనదగ్గ స్థాయిలో మన గుండెల్లో
నిలిచిపోయింది..

ఈ పాట వినగానే వెంటనే నా మనసు చిన్నప్పుడు DD రోజులకి వెళ్ళిపోతుంది.చిన్నప్పుడు ఈ పాటకి అర్ధం తెలియకపోయినా మన తెలుగు దంపతులు పాడే "నా స్వరము నీ స్వరము సంగమమై మన స్వరంగా అవతరించే.." అనే లైన్స్ చాలా బాగుండేవి .. ఇప్పటికీ, వింటున్నా,చూస్తున్నా మనసుకు ఏదో తెలియని సంతోషాన్నిచ్చే ఈ పాట  ఈ పాట నా చాలా ఇష్టమైన పాట.

मिले सुर मेरा तुम्हारा -1988
(Video On National Integration)





మ్యూజిక్:లూయిస్ బాంక్స్
లిరిక్స్:పీయూష్ పాండే
డైరెక్టర్:సురేష్ మాలిక్
సింగర్:భీంసేన్ జోషి
ప్రొడ్యూసర్ :లోక్ సేవా సంచార్ పరిషత్.



నా స్వరము నీ స్వరము సంగమమై
మన స్వరంగా అవతరించే..

Related Posts Plugin for WordPress, Blogger...