
వర్షాకాలం మొదలవ్వగానే మొక్కలు తెచ్చి నాటటం మా ఇంట్లో అందరికీ ఇష్టం.
చెల్లిని శ్రావణమాసం కోసం ఇంటికి తీసుకు రావటానికి హైదరాబాద్ వెళ్ళిన మాకు మా చెల్లి వాళ్ళింటికి వెళ్ళే దారిలో
నర్సరీలు కనిపించాయి..మొక్కలు చూసిన తర్వాత ఇంక కొనకుండా ఉండగలమా వెంటనే ఆ నర్సరీకి వెళ్లి మంచి గులాబీ మొక్కలు తెచ్చుకున్నాము..
అప్పుడే వర్షం కురిసి ఆగిన ఆ చల్లటి వాతావరణంలో ఎటు చూసినా ఆకుపచ్చగా రంగురంగుల రకరకాల
పూల మొక్కలతో మనసును ఆహ్లాదపరచేలా వున్న ఆ నర్సరీని వదిలి రావాలనిపించలేదు.
మా మరిది గారు కూడా మొక్కల సెలెక్షన్ లో మాకు హెల్ప్ చేశారు..
ముద్దమందారాలు, ఎన్నెన్నో రంగుల్లో గులాబీలు ఇంకా ఏవో రకరకాల చెట్లు ఆ అందాలను కళ్ళారా చూడాలే కానీ
వర్ణించటం సాధ్యం కాదు నర్సరీలో నేను తీసిన కొన్ని ఫోటోలు..





వర్షంలో తడిసి ముద్దయిన ముద్దుమందారాలు..ఎంతబాగున్నాయో కదా..



అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం..
పువ్వు నవ్వు పులకించే గాలిలో
నింగి నేల చుంబించే లాలిలో
తారల్లారా రారే విహారమే..
నేచర్ WallPapers తో మా చెల్లి రమ్య వీడియో మిక్సింగ్ చేసిన పాట..
పువ్వు నవ్వు పులకించే గాలిలో
నింగి నేల చుంబించే లాలిలో
తారల్లారా రారే విహారమే..
నేచర్ WallPapers తో మా చెల్లి రమ్య వీడియో మిక్సింగ్ చేసిన పాట..
