పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

21, నవంబర్ 2011, సోమవారం

Art of living


Art of living అంటే నేను చెప్పేది అన్నీ వున్నా ఇంకా "కళాత్మకంగా" జీవించటం
ఎలాగో తెలుసుకోవటానికి ఎంతైనా ఖర్చు పెట్టుకుని పూజ్యులైన గురూజీల దగ్గర
కొన్నిరోజుల పాటు శ్వాసమీద ధ్యాసపెట్టి మరీ ...
ఖరీదైన ప్రక్రియ నేర్చుకునే ఖరీదైన మనుషుల గురించి కాదు.

తమకొచ్చిన కళను ప్రదర్శిస్తే తప్ప పూట గడవని.. బ్రతుకుతెరువుకు మాత్రమే కళను
వుపయోగించి బ్రతకటం అనే కళను విజయవంతంగా ప్రదర్శిస్తూ బ్రతకటం కూడా ఒక కళ
అని నిరూపిస్తున్న...మనం నిత్యం చూసే
నిజజీవిత కళాకారుల గురించి...ఎందరో మహానుభావులు అందరికీ వందనము..

ఇది నేను ఎవరినీ ఉద్దేశించి రాస్తున్నది కాదు నా మనసుకు అనిపించింది అంతే!


Related Posts Plugin for WordPress, Blogger...