శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి - 21 - 10 - 2012
ఆశ్వయుజ శుద్ధసప్తమి
ఈరోజు అమ్మవారిని శ్రీలలితా సుందరిగా అలంకరిస్తారు.
త్రిపురత్రయంలో రెండో శక్తి లలితాదేవి.ఈమెనే త్రిపుర సుందరి అంటారు.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులకన్నా పూర్వం నుంచి వున్నది కాబట్టి త్రిపుర సుందరి అను పిలువబడుతుంది.శ్రీ చక్ర అధిష్టాన శక్తిగా,పంచదశాక్షరీ మహామంత్ర అధిదేవతగా భక్తుల్నిఉపాసకుల్ని అనుగ్రహిస్తుంది.
దుర్గమ్మ సన్నిధిలో శంకరాచార్యుల వారిచే ప్రతిష్టితమైన శ్రీచక్ర అధిష్టాన దేవత కూడా లలితా త్రిపుర సుందర దేవియే.లలితా సహస్ర నామంలో వర్ణించినట్లు ' సచామర రమావాణీ సవ్య దక్షిణ సేవితా ' అన్నట్లు లక్ష్మీ దేవి,సరస్వతీ దేవి అటు ఇటు నిలబడి లలితా దేవిని వింజామరతో సేవిస్తున్నట్లుగా అలంకారం చేస్తారు. చిరునవ్వులు చిందిస్తూ,చేతిలో చెరకుగడను ధరించి,శివుని వక్ష స్థలం మీద కూర్చుని, అపురూపంగా శ్రీ లలితాదేవి దర్శనమిస్తుంది.
సచామర రమావాణీ సవ్య దక్షిణ సేవితా
ప్రాత: స్మరామి లలితావదనారవిందం
బింబాధరం పృధుల మౌక్తిక శోభినాశమ్