నా చిన్నిప్రపంచానికి పుట్టినరోజు శుభాకాంక్షలు
నా హృదయంలో నిలిచిపోయే భావాలు ..
నన్ను నేను తెలుసుకునే అనుభవాలు..
సంతోషంలో నా పెదవులపై నిలిచే చిరునవ్వులు..
బాధలో నా కంటి నుండి జారే చిన్ని చినుకులు..
నా చుట్టూ ఉన్న మనుషుల ప్రేమ,అభిమానం అసూయ,ద్వేషాలు..
జయాపజయాలు , పొగడ్తలు, అభినందనలు, అవమానాలు
అన్నిటిని తనలో ఇముడ్చుకుని ప్రతి రోజూ ఒక కొత్త పాఠాన్ని నేర్పుతూ,
ఎప్పుడూ నన్ను వదలకుండా నాతో ఉండే "నా చిన్నిప్రపంచం" నాకు చాలా ఇష్టం.
" నా చిన్నిప్రపంచం " నాకు కేవలం బ్లాగ్ మాత్రమే కాదు ..
నా ప్రియనేస్తం.. నా అంతరంగానికి అక్షర రూపం.
" నా చిన్నిప్రపంచం " పేరుకే చిన్నది కానీ ఎల్లలు లేనిది ... మంచి స్నేహితులను, వ్యక్తులను , కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది.
లోకాన్ని , మనుషుల ప్రవర్తనలను బ్లాగ్ ల ద్వారా కూడా చూసే అవకాశం కల్పించింది.ఈ నెట్ ప్రపంచంలో నా పేరుకు ఒక గుర్తింపును తెచ్చింది.
ఇన్నేళ్ళ నా బ్లాగ్ ప్రయాణంలో నేను ఏదో సాధించానని చెప్పను, కానీ నేను నేర్చుకున్నవి చాలా ఉన్నాయి..నెట్ ప్రపంచం అయినా బయటి ప్రపంచం అయినా ఎదుటి వాళ్ళ మనోభావాలు, ఆలోచనలు మనకి నచ్చినా నచ్చక పోయినా వారి అభిప్రాయాలను గౌరవిస్తే చాలు, ఇతరులను జడ్జ్ చేసే ముందు మన అర్హత ఏమిటో కూడా తెలుసుకుంటే మంచిది అన్న విషయాన్నీ ఎప్పుడూ గుర్తుంచుకుంటాను...
" నా చిన్నిప్రపంచాన్ని" ఈ ప్రపంచానికి పరిచయం చేసి ఈ రోజుకి 3 సంవత్సరాలు పూర్తయ్యింది.నాకు చాలా ఇష్టమైన "నా చిన్నిప్రపంచం" పుట్టినరోజు ఈ రోజు...