ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించ వద్దు ఏ క్షణం---విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన
జీవితాన అడుగు అడుగున
నీరసించి నిలిచిపోతె నిమిషమైన నీది కాదు
బ్రతుకు అంటె నిత్య ఘర్షణ
దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది
ఇంతకన్న సైన్యముండున
ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను ..
దీక్షకన్న సారధెవరురా
నిరంతరం ప్రయత్నమున్నదా... నిరాశకే నిరాశ పుట్టదా
నిన్ను మించు శక్తి ఏది నీకు నువ్వే బాసటైతే
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించ వద్దు ఏ క్షణం---విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా
నింగి ఎంత గొప్పదైన రివ్వుమన్న గువ్వపిల్ల
రెక్క ముందు తక్కువేనురా
సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేపపిల్ల
మొప్ప ముందు చిన్నదేనురా
పిడుగు వంటి పిడికిలెత్తి వురుమువల్లె హుంకరిస్తె
దిక్కులన్ని పిక్కటిల్లురా
ఆశయాల అశ్వమెక్కి అదుపులేని కదను తొక్కి
అవధులన్ని అధిగమించరా
త్రివిక్రమా పరాక్రమించరా విశాల విశ్వమాక్రమించరా
జలధి సైతమార్పలేని జ్వాలవోలె ప్రజ్వలించరా
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించ వద్దు ఏ క్షణం---విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా