పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

27, అక్టోబర్ 2011, గురువారం

కాణిపాకం To విష్ణుకంచి - 3 ( వాయిద్య గణపతులు )

కాణిపాకంలో శివాలయం ఆవరణలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న వినాయకుని వివిధరూపాల విగ్రహాలు మనసును ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారు.ఇవి ఇంకా పూర్తి కాలేదు కానీ ఇప్పడే ఎంతో అందంగా ఆకర్షణీయంగా చూపరులను ఆకట్టుకుంటున్నాయి.మాకు ఎంతగానో నచ్చిన ఈ విగ్రహాలన్నీ తీరికగా ఫోటోలు తీసుకున్నాము.

కాణిపాకంలో కొలువైన వాయిద్య గణపతులు
వివిధరకాల సంగీత సాధనాలను ధరించి సంగీతసాధన చేస్తున్న బొజ్జగణపయ్య
చూడచక్కగా కొలువై వున్నవిగ్రహాలు కనువిందు చేస్తున్నాయి.










శివపరివారం
శివుడు, అమ్మవారు,కుమారస్వామి,విఘ్నేశ్వరుడు,శివుని వాహనమైన నంది
అందరూ ఇక్కడే కొలువై కైలాసంలో కొలువైన శివ పరివారాన్ని తలపిస్తూ
భక్తులను మైమరిపించేలా వున్నాయి విగ్రహాలు..






మా తరవాత ప్రయాణం తిరువన్నామలై రమణ మహర్షి అతిధి ఆశ్రం
http://raji-rajiworld.blogspot.com/2011/10/to-4.html

కాణిపాకం To విష్ణుకంచి - 2 ( కాణిపాకం )

సెప్టెంబర్ 4 తెల్లవారుజాము నాలుగు గంటలకు బ్రహ్మోత్సవాలలో కళకళలాడిపోతున్న విద్యుత్ దీపాల కాంతులతో
ప్రత్యేక అలంకరణలో వీధులన్నీ అలంకరించిన ఫ్లెక్సీలతో ఎంతో ఆహ్లాదకరంగా వున్న కాణిపాకం వెళ్ళాము.
అక్కడ జనం అంతగా లేకపోవటంతో దర్శనం ,పూజలు వెంటనే అయ్యాయి...
ప్రత్యేక అలంకరణలో వున్న వరసిద్ధి వినాయకుడిని దర్శించుకుని,మమ్మల్ని కరుణించమని వేడుకుని,
తీర్ధప్రసాదాలు తీసుకున్నాము.
బ్రహ్మోత్సవాల టైములో అనుకోకుండా లభించిన ఈ కాణిపాక వరసిద్ధి వినాయకుని దర్శనం
మాకు చాలా ఆనందంగా అనిపించింది.గుడిలో రకరకాలుగా అలంకరించిన వినాయకులు వున్నారు.
కూరగాయలు,డ్రై ఫ్రూట్స్ తో చేసిన వినాయక విగ్రహాలు చాలా బాగున్నాయి.
లోపల ఫొటోస్ తీయనివ్వరు కదా అందుకే వాటిని మిస్ అయ్యాము..
తీర్ధప్రసాదాలు తీసుకుని,పక్కనే వున్నశివాలయానికి వెళ్లి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము..

బయటికి రాగానే ఆవరణలో రకరకాల వాయిద్యాలను వాయిస్తున్న బొజ్జగణపయ్యల విగ్రహాలు చాలా చూడముచ్చటగా,అందంగా వున్నాయి.
అవన్నీ ఫోటోలు తీసుకుని,అక్కడే Breakfast చేసి,షాపింగ్ చేసుకుని మా నెక్స్ట్ ప్లేస్
తిరువన్నామలై
( అరుణాచలం ) బయలుదేరాము.
కాణిపాకంలో బ్రహ్మోత్సవాల ప్రత్యేక అలంకరణ




కాణిపాకం To విష్ణుకంచి -1





సెప్టెంబర్ 1 న వినాయకచవితి అయిపోగానే అనుకోకుండా మా ఫామిలీతో వెళ్ళిన ట్రిప్ తమిళనాడు.
వినాయకచవితి అయిపోయిన రెండోరోజే అంటే సెప్టెంబర్ 3 న బయలుదేరి
"కాణిపాకం",
"తిరువన్నామలై(అరుణాచలం)
""సాతనూర్ డామ్" "శ్రీపురం గోల్డెన్ టెంపుల్" "శివ కంచి" "విష్ణుకంచి"
అన్నీ చూసి వచ్చాము... మా కుటుంబం అంతా కలిసి వెళ్ళిన
ఈ ప్రయాణం నా జీవితంలో మరచిపోలేని ఒక మధురానుభూతిగా
ఎంతో సంతోషకరమైనయాత్రగా ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పొచ్చు.
నా ఈ sweetmemories నా చిన్నిప్రపంచంలో ఎప్పటికీ భద్రపరచుకోవాలని అనుకుంటున్నాను.

సెప్టెంబర్ 3 సాయంత్రం మా కుటుంబం అందరితో కలిసి మా వెహికల్ లో బయలుదేరాము
వినాయకచవితి అయిపోగానే వెళ్ళిన ట్రిప్ కావటంతో దారిపొడుగునా 3 వ రోజు నిమజ్జనానికి వెళ్ళే వినాయకులు,
అలాగే రకరకాల అందమైన మండపాలలో, విద్యుత్ దీపాలతో కనువిందు చేసే అలంకరణల్లో పూజలందుకుంటున్న
గణనాధులను దర్శించుకుంటూ,కొన్నిచోట్ల నిమజ్జనానికి వెళ్ళే వినాయక మండపాలు వాళ్ళు పెట్టే ప్రసాదాలు తింటూ మా ప్రయాణం ఆనందంగా సాగిపోయింది.
అంతమంది వినాయకులను ఒకేసారి దర్శించుకోవటం చాలా సంతోషంగా అనిపించింది.
4 వ తారీకు తెల్లవారుజాముకు కాణిపాకం చేరుకున్నాము.
మేము చూసి వినాయక చవితి సందళ్ళు...





Related Posts Plugin for WordPress, Blogger...