
అమ్మలగన్నయమ్మ;ముగురమ్మల మూలపుటమ్మ;
చాల పెద్దమ్మ;సురారులమ్మ కడుపారని బుచ్చినయమ్మ;
తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబున నుండెడియమ్మ;
దుర్గ; మాయమ్మ;కృపాబ్ధి;యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్!
సకల దేవత స్వరూపిణి అయిన అమ్మను భక్తిశ్రద్ధలతో పూజించే దేవీ నవరాత్రులు 
ఈ రోజు నుండీ ప్రారంభం. 
ఈ పది రోజులు అమ్మవారికి  ప్రత్యేక అలంకారాలు చేస్తారు.. 
ఆ  అమ్మ కరుణ కటాక్ష వీక్షణాలు అందరికీ ప్రసాదించాలని,
కోరిన కోరికలు తీర్చి కాపాడమని, 
అమ్మని  వేడుకుంటూ  దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు.

