"నా చిన్నిప్రపంచం" మిత్రులందరికీ హాయ్ మరియు నమస్తే అందరూ బాగున్నారా ??చాలా రోజులయింది బ్లాగ్ రాసి, రాయకుండా ఉండేంత
గొప్ప కారణాలు ఏమీ లేకపోయినా రాయటానికి అంత గొప్ప విషయాలు ఏమున్నాయిలే అని రాయటం మానేశాను..
దాదాపు సంవత్సరం నుండి బ్లాగ్ రాయలేదు.. నా బ్లాగ్ ఈ నెట్ ప్రపంచం లో ఎక్కడో ఒక మూలన పడిపోయుంటుంది లే అనుకున్నాను కానీ ఏమీ రాయకపోయినా నా బ్లాగ్ రోజూ చూసే వాళ్ళు, అప్పుడప్పుడు కామెంట్స్ ఇచ్చేవాళ్ళు కూడా వుండటం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది ..
కొన్ని కామెంట్స్ అయితే నా బ్లాగ్ ని ఇంతగా ఫాలో అయ్యి,అభిమానించే వాళ్ళు కూడా వున్నారా ??అని నాకే అనుమానం కలిగించేలా కూడా చేశాయి ... :)
నా చిన్నిప్రపంచం ద్వారా నాకు పరిచయం అయిన ఫ్రెండ్స్ ... నేను ఈ సంవత్సరం రోజులుగా కనపడలేదని నా గురించి తెలుసుకోవాలని మెసేజ్ ఇచ్చి,నా క్షేమసమాచారాలు తెలుసుకున్న "మనస్వి జయ" గారు,
నేను ఫేస్ బుక్ లో కనపడగానే ఎప్పుడో విడిపోయిన ఆత్మీయుల్ని
పలకరించినట్లుగా పలకరించిన "సాహితి మాలాకుమార్ " గారు ...
నన్ను ఎప్పడూ ఆత్మీయంగా పలకరించే "వనజవనమాలి" గారు,
"శ్రీ" గారు , ఇంకా చాలా మంది బ్లాగర్స్ నా ఫేస్ బుక్ లో కూడా ఫ్రెండ్స్ ..
ఇంతమంది మంచి స్నేహితుల్ని,నెట్ ప్రపంచం లో నాకంటూ ఒక గుర్తింపుని,స్థానాన్ని ఇచ్చిన "నా చిన్ని ప్రపంచాన్ని" ఇలా వదిలెయ్యటం నాకు నచ్చలేదు .. అందుకే మళ్ళీ వచ్చేశాను "నా చిన్నిప్రపంచం" లోకి...
"నేను కవయిత్రిని కానన్న వాళ్ళని ఏదో చేస్తా " రేంజ్ లో కాకపోయినా ఏదో నాకు నచ్చిన కబుర్లు మీతో పంచుకుందామనే నా ప్రయత్నం .. :)
మన మాటలు,చేతలు ఎదుటివాళ్ళకి మంచి చేయకపోయినా పర్లేదు కానీ కీడు చేయకపోతే చాలు .. మంచి మనస్సుతో సాటి మనుషుల్ని అభిమానించి,ప్రోత్సహించే మిత్రులందరికీ మరొక్కసారి ధన్యవాదములు