నిన్న మాఇంటికి అనుకోని అతిధి వచ్చింది.తను నాచిన్నప్పటి ఫ్రెండ్ రాజేశ్వరి.St'anns girls high school లో నేను 6th class లో జాయిన్ అయినప్పటినుండి తను నాకున్న ఒకే ఒక్క ఫ్రెండ్.మా స్నేహం 6th నుండి 10th వరకు ఒకే స్కూల్లో ఎంతో సరదాగా వుండేది.10th తర్వాత నేను మా వూర్లో,తను తెనాలిలో ఇంటర్ జాయిన్ అయ్యాము అయినా కొన్నాళ్ళు మా friendship కంటిన్యూ అయ్యింది.వాళ్ళ ఫామిలీ గుంటూరు షిఫ్ట్ అవ్వటం,తనకి పెళ్లి కావటం,నేను లా లో జాయిన్ అవ్వటం వీటన్నిటి తర్వాత మా స్నేహానికి పూర్తిగా బ్రేక్ పడినట్లే అయింది.
మళ్ళీ ఇన్నాళ్ళకి మా అమ్మావాళ్ళింటికి నాకోసం వచ్చిన తనని చూసి నాకు చాలా సంతోషంగా,ఆశ్చర్యంగా కూడా అనిపించింది.తను మలేషియాలో ఉంటున్నానని ,ఒక పాప అని ప్రస్తుతం వాళ్ళ అమ్మ వాళ్ళింటికి గుంటూరు వచ్చానని,ఇంకా 3,4 నెలలు ఇండియాలోనే ఉంటానని చెప్పింది.కనీసం 10 సంవత్సరాలుగా ఫోనులో కూడా మాట్లాడుకోని మేమిద్దరం మాట్లాడుకోవటానికి చాలా విషయాలు వున్నా,తను వాళ్ళ బంధువుల ఇంట్లో ఫంక్షన్ కి వెళ్ళే పని ఉండటంతో మళ్ళీ కలుద్దామని అనుకున్నాము.సృష్టిలోమధురమైనది,జీవితంలో మరువలేనిది స్నేహం అని ఇలాంటి సందర్భాల్లోనే అనిపిస్తుందేమో...