పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

11, మే 2011, బుధవారం

ప్రేమ --- ఆనాడు --- ఈనాడు


ఏంటో ఇప్పటి పిల్లలు ఈ గొడవలు ఇప్పటి తరం వాళ్ళని చూసి అప్పటి పెద్దలు అనుకునే మాట ఇది..
నిజంగానే అప్పటి మనుషులు,వాళ్ళ ఆప్యాయతలు ఇప్పటి వాళ్లకి వుండటం లేదు.
అంటే నేనెప్పుడో తాతల కాలం నాటి దాన్ని కాకపోయినా నాకు గుర్తున్నప్పటికీ ఇప్పటికే మనుషుల మధ్య ఆప్యాయతలు,అనురాగాలు,బంధాలు అన్నిటిలో ఎన్నెన్నో మార్పులు వచ్చాయి..

ఈ మధ్య టీవి లో ఎక్కడ చూసినా అమ్మాయి ప్రేమించలేదని,కొంతకాలం తనను ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుందని,పెళ్లి చేసుకుని వదిలేసి తను కాదన్నాలెక్క చేయకుండా వెళ్లి హాయిగా చదువుకుంటుందని
ఎక్కడ కనపడితే అక్కడ చంపేయటం,దాడులు చేయటం మామూలు విషయం అయిపోయింది...

ఇదంతా నేను ఎవరినో ఒకరిని మాత్రమే సపోర్ట్ చేస్తూ చెప్పటం లేదు..ఎవరో ఒకరిది మాత్రమే తప్పు అనటంలేదు..
నాకు తప్పుగా అనిపించింది ఇంకొకరికి ఒప్పుగా అనిపించవచ్చు, ఎవరి మనసుకి సంబంధించిన వాదన వాళ్లకి ఉండొచ్చు..అందుకే ఎవరి ఇష్టం, ఎవరి పరిస్థితులు వాళ్ళవి ...

సినిమాల్లో కూడా అప్పటికీ ... ఇప్పటికీ ప్రేమను వ్యక్తం చేయటంలో,ఆ ప్రేమ విఫలమైతే స్పందించే
విధానం లో చాలా మార్పులు వచ్చాయి.

అప్పటి ప్రేమ వ్యక్తం చేయటము సున్నితమే...విఫలమైతే బాధపడటమూ సున్నితమే..

ఇప్పటి
ప్రేమ వ్యక్తం చేయటం భయానకమే...విఫలమైనా భయానకమే...



ప్రేమను వ్యక్తం చేయటము ...... నాడు

రాసాను ప్రేమలేఖలెన్నో..దాచాను ఆశలన్నీ నీలో..



అందాల చిలకా అందుకో నా లేఖా



ఇదే నా మొదటి ప్రేమలేఖ రాసాను నీకు చెప్పలేక..



ప్రేమ విఫలమైతే .... నాడు

నీ సుఖమే నే కోరుకున్నా నిను వీడి అందుకే వెళుతున్నా..



నేనొక ప్రేమ పిపాసిని...నీవొక ఆశ్రమ వాసివి..



ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం





ప్రేమ ... ఈనాడు

హలో గురు ప్రేమ కోసమేనోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం.



పాపలు పాపలు లవ్ యు..



హలో రమ్మంటే వచ్చేసిందా చెలీ నీ పైన ప్రేమ
పో పో పొమ్మంటు నువ్వంటే పోనే పోదమ్మా..



నిన్నే నిన్నే నిన్నే నిన్నే...దిల్సే దిల్సే ఇష్క్ కియా తుమ్సే
ఇనవా ఇనవా ఇనవా ఏందే నీ గొడవా



Related Posts Plugin for WordPress, Blogger...