నిన్న మా అమ్మ పుట్టినరోజు. మా అమ్మ ఉగాది పండగరోజే పుట్టింది కాబట్టి ప్రతి ఉగాదికి మాకు రెండు పండగలు.నిన్న face Book లో విషెస్ పెట్టాను.నా ఫ్రెండ్స్,మా తమ్ముడి ఫ్రెండ్స్ అందరూ అమ్మకి విషెస్ చెప్పారు. ఎప్పుడూ బ్లాగ్ లో కూడా విషెస్ పెట్టేదాన్ని ఈసారి పెట్టలేదు.కొంచెం లేట్ గా ఈరోజు పోస్ట్ చేస్తున్నాను.ఎంతైనా బ్లాగ్లో రాసుకున్నవన్నీ మంచి జ్ఞాపకాలుగా ఎప్పటికీ నిలిచిపోతాయి కదా..
ఉగాది రోజునే పుట్టిన మా అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు
Happy BirthDay అమ్మ :)
మాలోనే తన చిన్నిప్రపంచాన్ని చూసుకుంటూ
నేను, తమ్ముడు,చెల్లి ఎలాంటి అసూయద్వేషాలు
నేను, తమ్ముడు,చెల్లి ఎలాంటి అసూయద్వేషాలు
లేకుండా ఎప్పటికీ ఒకరికొకరు తోడుగా నిలవాలనే ప్రేమ,ఆప్యాయతలు
ఎవరికీ మేలు చేయలేకపోయినా,కీడుమాత్రం చేయొద్దని,
మాకు మేముగా ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచనతో పాటు
కావాలని మాకు హాని చేయాలనుకునే వాళ్ళనుండి కాపాడుకోగలిగే ధైర్యం
ఎవరినుండి ఏమీ అతిగా ఆశించకూడదు,ఎవరి తోడు లేకపోయినా
దేవుడు ఎప్పుడూ మనల్ని కాపాడతాడనే నమ్మకంతో పాటు,
సమాజంలో ఎక్కడ ఎలా ప్రవర్తించాలి ,మాట్లాడాలనే హద్దులు తెలుసుకునే ఇంగితఙ్ఞానం
రాత్రి ఉంటే పగలు కూడా ఉంటుంది, ప్రయాణం ఉంటే గమ్యం కూడా ఉంటుంది,
అలాగే ప్రతి సమస్యకీ పరిష్కారం ఉంటుంది కాబట్టి
ఎన్ని సమస్యలున్నా ఎదుర్కోవాలనే ఆత్మవిశ్వాసం
అన్ని విషయాలు గురువు,నేస్తంగా నేర్పిన, నేర్పుతున్న
మా అమ్మని ఆయురారోగ్యాలతో కాపాడమని భగవంతుడ్ని వేడుకుంటూ,
ఎప్పటికీ మాకు తోడుగా,మా అందరితో సంతోషంగా ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని కోరుకుంటూ...
Happy Birthday 🎂💐 అమ్మా
Many Many Happy returns of the day...
నా కలలని కన్నది నీవే నా మెలకువ వేకువ నీవే
ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా
నా కష్టం నష్టం నీవే చిరునవ్వు దిగులు నీవే
ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా
Love u మా 💕💞💝
Raaji,Vamsi,Ramya