పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

18, ఫిబ్రవరి 2010, గురువారం

అమ్మవు నీవే అఖిలజగాలకు


నీ బాధల గురించి ఎప్పుడూ భయపడకు  
అమ్మ నీ బాధలన్నింటిని తొలగిస్తుంది.
"అమ్మదయ వుంటే అన్నీ ఉన్నట్లే"


నా చిన్ని ప్రపంచంలో నా చెయ్యివిడువకుండా ఎల్లకాలం నన్నూ,నా కుటుంబాన్ని కాపాడే శక్తి జగన్మాత అమ్మ.జీవితంలో ఎల్లప్పుడు అమ్మ మాకు తోడుంది అనడానికి ఎన్నో సంఘటనలు సాక్ష్యం.కష్ట నష్టాల్లో కాపాడి వెన్నంటి వుండి మా బాధలను తీర్చి,సుఖసంతోషాలను ప్రసాదించే ఆ పరాశక్తిని మేము అమ్మగా భావిస్తాము.

నాకు చాలా
ఇష్టమైన అమ్మపాట

 

చల్లని మల్లెలతో ఊయలకట్టా మాత 
చల్లగా శయనించు లాలి జో లాలి
వేపతోవిసిరి నీకు సేవలు చేసే వేళ 
తల్లిరో శయనించు లాలి జో లాలి

ఈ జగతినేలే తల్లికి కన్నబిడ్డ నేనేగా 
కలలతేలి పోవమ్మ నన్నుగన్న తల్లి
చల్లని మల్లెలతో ఊయలకట్టా మాత  
చల్లగా శయనించు లాలి జో లాలి

పామే తలదిండు వేపాకే పూలపక్క 
తల్లి నిదురిస్తే జోలాలి పాడెనుగా
ఎన్నినాళ్ళ పుణ్యమో ఈ వరం దొరికేనే 
ఆనందం పొంగెనమ్మ నిన్ను గన్న కన్నుల
 
దేవీ మహాదేవీ నీ దీవెన చాలునమ్మ 
 నీవే మా సర్వం అని నమ్మిన వారమమ్మ
చల్లని మల్లెలతో ఊయలకట్టా మాత  
చల్లగా శయనించు లాలి జో లాలి

గోరుముద్దలందించి తినిపిస్తే వేడుకగా  
భువనం పులకించి మరచునమ్మ ఆకలిని
మదిలో వ్యధ నీకు విన్నవిస్తే చాలునుగా 
వెతలే కనిపెట్టి మోక్షమిచ్చు మాతవుగా
 
దేవిమహదేవి ఏ సేవచేయగలమే పాదం  
నీ పాదం సర్వదోషాలు హరియించునే
చల్లని మల్లెలతో ఊయలకట్టా మాత  
చల్లగా శయనించు లాలి జో లాలిఅమ్మా నీ అపార కరుణా,కటాక్షాలు నిరంతరం మాపైన వుంచి
అడుగడుగునా మా వెన్నంటి వుండి కాపాడు తల్లీ

శ్రీశైలం శివమయం


శివపార్వతులు మా ఇష్టదైవాలు.
ప్రపంచం మొత్తాన్ని అలాగే నా చిన్నిప్రపంచం లో మా కుటుంబాన్ని అన్నివేళలా కాపాడేది దైవశక్తి మాత్రమే అని నాప్రగాఢవిశ్వాసం.

ప్రతిసంవత్సరం
మేము చేసే శ్రీశైలయాత్ర మా జీవితాలలో మధురానుభూతి.

చిన్నపిల్లలుగా అమ్మ,నాన్న చెయ్యి పట్టుకుని
శ్రీశైలం వెళ్ళిన మమ్మల్ని ఇప్పటివరకు అన్ని విషయాల్లో కాపాడుతూఆనందకరమైన జీవితాలను అనుగ్రహించిన తండ్రి దయ అపారం.

అక్షయవరాలనిచ్చే శ్రీశైల
మల్లికార్జునుడు తనను దర్శించుకునే భక్తులను కనికరిస్తూ కొలువుతీరి ఉన్న దక్షిణకైలాసం ప్రతి భక్తుని మనస్సును ఆనందమయం చేస్తూ యిట్టె ఆకట్టుకుంటుంది.

స్వామిని
తాకి తల ఆనించి,తమ కష్టాలుచెప్పుకునే అవకాశంఉన్న క్షేత్రంలో భక్తులు శ్రీ మల్లికార్జునుని స్వయంగా అభిషేకించవచ్చు.ప్రశాంతతకు నెలవు క్షేత్రం.

శ్రీ
శ్రీశైలమల్లికార్జునభ్రమరాంబికలు అందరిని అన్ని వేళలా
కాపాడుతూ,
మా
కుటుంబాన్ని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతోదీవించాలని నిరంతరం ప్రార్ధిస్తూ...

ఓం నమఃశివాయ
రాజి.14, ఫిబ్రవరి 2010, ఆదివారం

ప్రేమికులరోజు


ఆమె అతడు ఇద్దరికే చోటుండే లోకం ప్రేమ
కాలం దూరం ఎన్నడు చేరని మరోప్రపంచం ప్రేమ
ఒకరి
ధ్యాస ఇంకొకరి శ్వాసగా బ్రతికించేదే ప్రేమ
అనుభవమైతే
గాని తెలియని అద్భుతభావం ప్రేమ.


జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత వుంటే
నడకల్లో
తడబాటైన నాట్యం అయిపోద
రేయంత
నీ తలపులతో ఎర్రబడే కన్నులు వుంటే
కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా


బహుమతినా చిన్నిప్రపంచంలో దేవుడు నాకు ఇచ్చిన గొప్పబహుమతులు
అమ్మప్రేమ

నాన్నసలహా

శ్రీవారి అనురాగం


తమ్ముడి కేరింగ్

చెల్లి ఆప్యాయత

మా సీజుగాడి అభిమానం


ఎప్పటికి నన్ను ఎంతగానో అభిమానించి ప్రేమించే నా ప్రియమైన అమ్మ,నాన్న,శ్రీవారు,తమ్ముడు,చెల్లి,సీజు అందరికి ప్రేమికులరోజుశుభాకాంక్షలు

13, ఫిబ్రవరి 2010, శనివారం

మా ఇల్లు


ఇంటి పేరు అనురాగం ముద్దుపేరు మమకారం
మా ఇల్లే బృందావనం
ముక్కోటి దేవతలు వెలసిన దేవాలయం

మనసులోని భావాలు మదిలోని రాగాలు ఎన్నిటినో పదిలంగా దాచుకున్న నా మనసే నా చిన్ని ప్రపంచం.నేను ఆడిన ఆటలు,చేసిన అల్లరి,పొందిన ఆప్యాయత అనురాగాలు,జీవితం లో సాధించిన విజయాలు,కొన్నిఓటములు,మరిచిపోలేని జ్ఞాపకాలుగా,అనుబంధాల బంధాలతో అల్లుకున్న పొదరిల్లు లాంటి మా ఇల్లు నా చిన్ని ప్రపంచం.ఇది అందమైన నా మరో ప్రపంచం.నా చిన్ని ప్రపంచం లో అతి ముఖ్యమైన నా కుటుంబం.నా బలం నా బలహీనత అంత నా కుటుంబమే.

11, ఫిబ్రవరి 2010, గురువారం

స్వాగతం

నా చిన్ని ప్రపంచానికి స్వాగతం.
బ్లాగ్ వ్రాయాలన్న నా ఆలోచనకి కారణం మా అమ్మ.నెట్ తో తరం వాళ్లకి ఎంత పరిచయం వుందో మా అమ్మకి కూడా ఇంచుమించు అంత తెలుసు.ఎందుకంటే మా అమ్మ బి. డిగ్రీ హోల్దర్ మరి .చాలా రోజులుగా నెట్ లో తెలుగు బ్లాగ్స్ చూస్తున్నాము.నాకు నచ్చిన విషయాలు అన్ని అమ్మతో షేర్ చేసుకోవటం నాకు అలవాటు అలాగే అమ్మ నేను కలిసి బ్లాగ్స్ చదివే వాళ్లము. బ్లాగ్స్ చూసిన మా అమ్మ నువ్వు కూడా బాగా ఆలోచిస్తావు,మంచి ఫీలింగ్స్ వున్నాయి కదా నువ్వు బ్లాగ్ ఎందుకు వ్రాయకూడదు అని నన్ను ప్రోత్సహించేది.కాని దేనికైనా ఒక టైం రావాలంటారు కదా.

బ్లాగింగ్ లో మంచి అనుభవం వున్న మా చెల్లి రమ్య హెల్ప్ తో ఇప్పటికి బ్లాగ్ మొదలుపెట్టాను.
నా బ్లాగ్ లో పోస్టింగ్స్ అన్ని నా ఆలోచనలు,జ్ఞాపకాలు,నానమ్మకాలు,నా అభిరుచులు,నా కుటుంబం,నా స్నేహితులు,ఏదో ఒక బంధం వున్న ఇతర విషయాల గురించే ఉంటాయి.ఎవరిని కాపీ చేసినవి కావు.ఎవరినైనా కాపీ చేసినట్లు అనుకరించినట్లు వుంటే అది నా తప్పు కాదు ఎందుకంటే మనం అందరం మనుషులం అన్నది ఎంత నిజమో కొందరి ఆలోచనలు కూడా ఒకేలా ఉంటాయన్నది కూడా అంతే నిజం కదా మరి.

పాఠకులు
,సీనియర్ బ్లాగర్స్ నా బ్లాగ్ కి కామెంట్స్ మరియు సలహాలు,సూచనలు ఇస్తారని కోరుకుంటూ

రాజి

Related Posts Plugin for WordPress, Blogger...