పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

18, ఫిబ్రవరి 2010, గురువారం

అమ్మవు నీవే అఖిలజగాలకు


నీ బాధల గురించి ఎప్పుడూ భయపడకు  
అమ్మ నీ బాధలన్నింటిని తొలగిస్తుంది.
"అమ్మదయ వుంటే అన్నీ ఉన్నట్లే"


నా చిన్ని ప్రపంచంలో నా చెయ్యివిడువకుండా ఎల్లకాలం నన్నూ,నా కుటుంబాన్ని కాపాడే శక్తి జగన్మాత అమ్మ.జీవితంలో ఎల్లప్పుడు అమ్మ మాకు తోడుంది అనడానికి ఎన్నో సంఘటనలు సాక్ష్యం.కష్ట నష్టాల్లో కాపాడి వెన్నంటి వుండి మా బాధలను తీర్చి,సుఖసంతోషాలను ప్రసాదించే ఆ పరాశక్తిని మేము అమ్మగా భావిస్తాము.

నాకు చాలా
ఇష్టమైన అమ్మపాట

 

చల్లని మల్లెలతో ఊయలకట్టా మాత 
చల్లగా శయనించు లాలి జో లాలి
వేపతోవిసిరి నీకు సేవలు చేసే వేళ 
తల్లిరో శయనించు లాలి జో లాలి

ఈ జగతినేలే తల్లికి కన్నబిడ్డ నేనేగా 
కలలతేలి పోవమ్మ నన్నుగన్న తల్లి
చల్లని మల్లెలతో ఊయలకట్టా మాత  
చల్లగా శయనించు లాలి జో లాలి

పామే తలదిండు వేపాకే పూలపక్క 
తల్లి నిదురిస్తే జోలాలి పాడెనుగా
ఎన్నినాళ్ళ పుణ్యమో ఈ వరం దొరికేనే 
ఆనందం పొంగెనమ్మ నిన్ను గన్న కన్నుల
 
దేవీ మహాదేవీ నీ దీవెన చాలునమ్మ 
 నీవే మా సర్వం అని నమ్మిన వారమమ్మ
చల్లని మల్లెలతో ఊయలకట్టా మాత  
చల్లగా శయనించు లాలి జో లాలి

గోరుముద్దలందించి తినిపిస్తే వేడుకగా  
భువనం పులకించి మరచునమ్మ ఆకలిని
మదిలో వ్యధ నీకు విన్నవిస్తే చాలునుగా 
వెతలే కనిపెట్టి మోక్షమిచ్చు మాతవుగా
 
దేవిమహదేవి ఏ సేవచేయగలమే పాదం  
నీ పాదం సర్వదోషాలు హరియించునే
చల్లని మల్లెలతో ఊయలకట్టా మాత  
చల్లగా శయనించు లాలి జో లాలి



అమ్మా నీ అపార కరుణా,కటాక్షాలు నిరంతరం మాపైన వుంచి
అడుగడుగునా మా వెన్నంటి వుండి కాపాడు తల్లీ

Related Posts Plugin for WordPress, Blogger...