పరుగాపక పయనించవె తలపుల నావా.. కెరటాలకు తలవంచితె తరగదు త్రోవా.. ఎదిరించిన సుడిగాలిని జయించినావా.. మది కోరిన మధు సీమలు వరించిరావా..

11, ఆగస్టు 2011, గురువారం

కృష్ణవేణి తెలుగింటి విరిబోణీ...


కృష్ణవేణి ఈ సినిమా నాకు కాదు మా అమ్మకి మధుర జ్ఞాపకం.మా అమ్మ 10th క్లాసు చదివేటప్పుడు ఈ సినిమా షూటింగ్ మావూరు మాచర్ల దగ్గలోనినాగార్జున సాగర్ లో జరిగిందట. సంగీతం మధుర సంగీతం అనే పాట షూటింగ్ నాగార్జున సాగర్ లో జరిగిందని అప్పుడు మేమందరం వెళ్లి చూశామని ఎప్పుడైనా ఈ సినిమా గురించి టాపిక్ వస్తే చెప్తుంటుంది అమ్మ .అమ్మకిష్టమైన సినిమాలన్నీ మాకు కూడా చూపించేసింది కాబట్టి అలా నేను చూసిన సినిమానే కృష్ణవేణి సినిమా.ఈ సినిమా స్టోరీ గురించి ఇప్పటికే అందరికీ తెలిసే వుంటుంది కాబట్టి ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏమిటంటే ఒక మనిషిలోని రెండు రూపాలు..భార్య తను కోరుకున్నట్లుగా ఉన్నంతవరకు ఎంతో అమితంగా ప్రేమించిన అదే భర్త భార్య గతంలో జరిగిన ఒక దురదృష్టకరమైన సంఘటనతో కొంత మానసిక వేదనకి గురికాగానే భార్యకి ఆ బాధ తీర్చటానికి ప్రయత్నించకపోగా ఆమెని ఇంకా వేదనకి గురిచేసి, పిచ్చిదయ్యేలా చేసిచివరికి చేతులతోనే చంపాల్సిన అవసరం లేకుండా మానసికంగా ఒక మనిషిని చిత్ర హింస చేసి ఎలా చంపాలో అంత ఘోరంగా కృషవేణి జీవితాన్ని అంతం చేస్తాడు..ఎన్నో కలలు కోరికలతో అతని జీవితంలో అడుగు పెట్టిన కృష్ణవేణి అసహాయ స్థితిలో ప్రాణం కోల్పోవటంతో ఈ సినిమా అయిపోతుంది..

ఆడవాళ్లంటే భర్త నిరాదరించినా,ఇంకొక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నా కృష్ణవేణిలాగా పిచ్చివాళ్ళు అయిపోవాలి,చివరికి భర్త కాళ్ళ మీద పడి చచ్చిపోవాలి కానీ ఎదురు తిరిగి మా మీదే కేస్ లు పెడతారా
వాళ్ళ ఇష్టమొచ్చినట్లు మమ్మల్ని కాదనుకుని హాపీ గా బతుకుతారా అని బాధపడే మగవారు,మా రోజుల్లో ఇలా లేదమ్మా పెళ్ళికి ముందు పుట్టింట్లో,పెళ్ళైన తర్వాత అత్తింట్లో వంచిన తల ఎత్తకుండా వున్నాము ఇప్పటి పిల్లలు ప్రతిదానికి వంక పెడుతున్నారు,ఎదురు తిరుగుతున్నారు అంటూ వాళ్లకి సపోర్ట్ చేసే కొందరు
ఆడవాళ్ళు లేకపోలేదు..

ఈ కృష్ణవేణి సినిమా ప్రతి మనిషికీ ఒక పాఠం అని నా అభిప్రాయం మనిషి తనకోసం తను బ్రతకాలి.ఎవరో మనల్ని నిరాదరించారని,నిరాకరించారని ఎంతో విలువైన జేవితాన్ని చేతులారా అంతం చేసుకోకూడదు.మనం పొతే ఇంకొకరు అనుకునే వాళ్ళ కోసం మనల్ని మనం కోల్పోకూడదు.. ఒక మనిషికి కుటుంబం, సమాజం ఎంత ముఖ్యమో తనకు తను కూడా అంతే ముఖ్యం.


Related Posts Plugin for WordPress, Blogger...